
Adam Gilchrist
Adam Gilchrist: క్రికెట్… మన దేశంలో విపరీతమైన క్రేజ్ ఉన్న ఆట. క్రికెటర్లను దేవుళ్ళుగా ఆరాధిస్తారు. ఇంత క్రేజ్ ఉండటంతో పలు కంపెనీలు క్రికెటర్ల వెంట పడుతుంటాయి. ఫలితంగా ఆట, ఆటే తర ఆదాయం ద్వారా క్రికెటర్లు వందల కోట్లు సంపాదిస్తూ ఉంటారు. తాజాగా ఓ సంస్థ ప్రపంచంలో అత్యధిక ఆదాయం కలిగిన టాప్ టెన్ క్రికెటర్ల జాబితా విడుదల చేసింది.
ఇక 20 సంవత్సరాల పాటు భారత క్రికెట్ ను ఏలి, క్రికెట్ గాడ్ గా అవతరించిన సచిన్ టెండుల్కర్, భారత్ కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ధోని, రన్ మెషిన్ గా పేరుపొందిన విరాట్ కోహ్లీ.. భారీగా సంపాదిస్తున్నారు. కానీ వీరిని మించిపోయాడు ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడం గిల్ క్రిస్ట్. సీఈఓ వరల్డ్ మ్యాగజైన్ రిపోర్ట్ ఈ విషయాన్ని వెల్లడించింది.
ఈ నివేదిక ప్రకారం 2023లో గిల్ క్రిస్ట్ ఆస్తుల విలువ 380 మిలియన్ డాలర్లు. భారత క్రికెటర్లలో సచిన్ 170, మహేంద్రసింగ్ ధోని 115, విరాట్ కోహ్లీ 112 మిలియన్ డాలర్ల సంపద కలిగి ఉన్నారు. జాబితాలో సచిన్, ధోని , కోహ్లీ తో పాటు ఐదో స్థానంలో ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్ కొనసాగుతున్నాడు. ఇతడి ఆస్తి విలువ 75 మిలియన్ డాలర్లు. దక్షిణాఫ్రికాకు చెందిన మాజీ ఆల్ రౌండర్ కలీస్, వెస్టిండీస్ దిగ్గజం లారా, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, స్టీవ్ స్మిత్ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. కలీస్ 75, లాగా 60, సెహ్వాగ్ 40, యువరాజ్ 35, స్మిత్ 30 మిలియన్ డాలర్ల సంపద కలిగి ఉన్నారు.

Adam Gilchrist
ఇక గిల్ క్రిస్ట్ తన కెరీర్ లో 96 టెస్టులు, 287 వన్డేలు, 13 టి20లు ఆడాడు. టెస్టుల్లో 5,570, వన్డేల్లో 9,169, టీ 20ల్లో 272 పరుగులు చేశాడు. ఇక తాను ఆడినప్పుడు ప్రపంచంలోనే బ్యాటర్ గా కొనసాగాడు. తన కెరీర్లో 905 వికెట్లు తీసిన కీపర్ గా చరిత్ర సృష్టించాడు. మరే వికెట్ కీపర్ కు ఈ రికార్డు లేదు. ఆస్ట్రేలియా 1999, 2003, 2007 వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు.. క్రికెట్ నుంచి తప్పుకున్నాక కామెంట్రేటర్ గా ఉంటూనే ఎఫ్ 45 ట్రైనింగ్ సెంటర్స్ ఫౌండర్ మెంబర్ గా ఉన్నాడు. 45 దేశాల్లో ఈ సంస్థ కార్యకలాపాలు సాగిస్తోంది. ఎఫ్ 45 కి యూస్ తోపాటు కెనడా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, యూరప్ వంటి దేశాల్లో ప్రముఖ క్రీడాకారులు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు.