Actress Yamuna: ఫ్యామిలీ దూరం పెట్టారు.. చనిపోయిన వదలరా: యమున కామెంట్స్
రీసెంట్ గా సుమ అడ్డా ప్రోమో విడుదల కాగా ఈ ప్రోమోలో యమున చేసిన కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో నా గురించి తప్పుగా రాసే కామెంట్ల వల్ల మా ఫ్యామిలీలో చాలా మంది నన్ను దూరం పెట్టారంటూ ఆవేదన చెందింది.

Actress Yamuna: టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న హీరోయిన్ లలో యమున ఒకరు. తక్కువ సినిమాలలోనే నటించిన యమున సీరియళ్ల ద్వారా అభిమానులకు మరింత చేరువైంది. అయితే ఓ వివాదంలో ఇరుక్కోవడంతో ఇదే ఆమెకు శాపంగా మారింది. ఆ వివాదం వల్ల యమున గురించి చాలా మంది చెడుగా అనుకున్నారు. చెడు అభిప్రాయం పెంచేసుకున్నారు. అయితే ఇప్పటికే ఈ వివాదం గురించి ఓ ఇంటర్వ్యూలో స్పందించి క్లారిటీ ఇచ్చింది యమున. ఈ విషయం గురించి తెలియజేస్తూ ఆవేదన చెందింది.
రీసెంట్ గా సుమ అడ్డా ప్రోమో విడుదల కాగా ఈ ప్రోమోలో యమున చేసిన కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో నా గురించి తప్పుగా రాసే కామెంట్ల వల్ల మా ఫ్యామిలీలో చాలా మంది నన్ను దూరం పెట్టారంటూ ఆవేదన చెందింది. వాటిని చూడలేక బాధలు భరించలేక వద్దు, సూసైడ్ చేసుకుందాం చచ్చిపోదాం అని ఫిక్స్ అయ్యానంటూ ఆవేదన చెందింది. ఒక సందర్బంలో యమున ఈ అంశం గురించి ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినా సోషల్ మీడియాలో థంబ్ నెయిల్స్ తో వీడియోలు చేస్తూ బాధ పడేలా చేస్తున్నారని తెలిపారు.
నేను మనిషినే… చనిపోయినా కూడా ఈ జనాలు వదిలేరా లేరు అంటూ విమర్శించింది. నేను చనిపోయినా కూడా థంబ్ నెయిల్స్ పెట్టి డబ్బులు సంపాదిస్తారు కావచ్చంటూ ఆవేదన చెందింది. అయితే జమున ఆవేదనను అర్థం చేసుకొని ఇకనైనా పరిస్థితి మారుతుందో లేదో చూడాలి. అయితే ఈమె అభిమానులు మాత్రం కెరీర్ విషయంలో జమున అవకాశాలు అందుకుంటూ బిజీగా అవ్వాలని ఆమె అభిమానులు కోరుతున్నారు. నెగిటివ్ కామెంట్లు చేసేవారు ఆమె ఆవేదనను కూడా అర్థం చేసుకుంటే బాగుటుందంటూ సపోర్ట్ చేస్తున్నారు. మరి ఈమె కెరీర్ పరంగా ఇకనైనా మార్పు వచ్చి మంచి అవకాశాలు వస్తాయో లేదో చూడాల్సిందే.
