Simran: ఆమె ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. నిన్నటి తరం స్టార్ హీరోలందరితో ఆడిపాడింది. పైగా తమిళ్ కన్నడ తెలుగు మలయాళం ఇలా అన్నీ సౌత్ భాషలతో పాటు అటు హిందీ చిత్రసీమలోనూ హాట్ హాట్ ఫోజులతో అక్కడి ప్రేక్షకులకు తనదైన శైలిలో వేడిని పుట్టించింది. అయితే, పెరిగిన వయసు రీత్యా పెళ్లి చేసుకుని సినిమాలకు అయిష్టంగా దూరం అయింది. మధ్యమధ్యలో డబ్బుల కోసం చిన్నాచితకా పాత్రలు చేసింది. ఆమె నిన్నటి టాల్ క్రేజీ బ్యూటీ ‘సిమ్రాన్’.
ఈ మధ్య సిమ్రాన్ కి ఖాళీ టైం ఎక్కువ దొరుకుతుందట. పిల్లలు కూడా చదువుల్లో బిజీ కావడంతో ఇక తాను ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ సినిమాల్లో బిజీ అయి నాలుగు రాళ్లు మళ్ళీ వెనుక వేసుకోవాలని ఆరాటపడుతుంది. అందుకే ఈ క్రమంలో అవకాశాలు కోసం ముమ్మరంగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల కోసం బాగా ప్రయత్నాలు చేస్తోంది.
అయితే, ఆమెకు మాత్రం ప్రస్తుతానికి స్టార్ హీరోల సినిమా ఛాన్స్ లు రావడం లేదని తెలుస్తోంది. ఆమె గతంలో ఉన్నంత గ్లామర్ గా లేదు. పైగా సిమ్రాన్ ఫిజిక్ కూడా అటు ఇటుగా ఉంది. అందుకే ఆమెకు అవకాలు ఇవ్వడానికి భారీ చిత్రాల మేకర్స్ ఆలోచిస్తున్నారు. అందుకే, ఈ మధ్య సిమ్రాన్ సోషల్ మీడియాలో హడావిడి చేయడానికి ఆసక్తి చూపిస్తుంది.
ఇప్పటికీ తనలో నటి ఉందని, తనకు నటన పై తపన ఉందని ఇన్ డైరెక్ట్ గా మేకర్స్ కి సిగ్నల్స్ పాస్ చేయడానికి బాగా కష్టపడుతుంది. కాకపోతే సిమ్రాన్ కి చిన్న సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి. అప్పట్లో స్టార్ హీరోల సరసన ఆడిపాడింది. హీరోయిన్ గా ఫుల్ క్రేజ్ సంపాదించింది.ఇప్పుడు సైడ్ క్యారెక్టర్స్ కోసం కూడా ఇబ్బంది పడాల్సి వస్తోంది.
Also Read: Romantic: ‘రొమాంటిక్’ లో రామ్ మాస్ స్టెప్పులు అదిరిపోయాయి !
ఈ మధ్య కాలంలో ఒకప్పటి హీరోయిన్లు అందరూ మళ్ళీ సినిమాల్లో యాక్టివ్ కావడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే భారీ కాంపిటీషన్ మధ్య సిమ్రాన్ కు చెప్పుకోతగ్గ ఒక్క సినిమా కూడా రావడం లేదు. కనీసం సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా సిమ్రాన్ కి ఏ హీరో, ఏ దర్శకుడు ఆఫర్ ఇవ్వకపోవడం ఆశ్చర్యకరమే. అయినా సరే ఎలాగైనా మళ్ళీ సినిమాల్లో బిజీ కావాలని సిమ్రాన్ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. మరి ఆమె ప్రయత్నాలు ఫలిస్తాయా ?
Also Read: Radhe Shyam: ప్రపంచప్రఖ్యాత జ్యోతిష్కుడు చెయిరోగా ప్రభాస్.. కొత్త కోణంలో అంటూ టాక్..