Nithyananda Kailasa Country: నువ్వు తోపు స్వామీ.. తన ఆస్థాన ప్రేయసి రంజితను ఏకంగా దేశ ప్రధానిని చేసేసిన నిత్యానంద

ఇటీవల ఐక్యరాజ్యసమితి సమావేశంలో కైలాస దేశం తరఫున మహిళా రాయబారులు పాల్గొన్న విషయం తెలిసిందే. దేశ ప్రతినిధుల మని సమావేశానికి హాజరై ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి సంచలనం సృష్టించారు. తర్వాత ఐక్యరాజ్య సమితి దీనికి వివరణ ఇచ్చింది. కైలాస దేశాన్ని తాము గుర్తించలేదని, సాంస్కృతిక ప్రతినిధులుగా మాత్రమే వారు సమావేశానికి వచ్చారని తెలిపింది.

  • Written By: Raj Shekar
  • Published On:
Nithyananda Kailasa Country: నువ్వు తోపు స్వామీ.. తన ఆస్థాన ప్రేయసి రంజితను ఏకంగా దేశ ప్రధానిని చేసేసిన నిత్యానంద

Nithyananda Kailasa Country: దేశం నుంచి పరారైన వివాదాస్పద స్వామి నిత్యానంద.. తాను సృష్టించుకున్న ‘కైలాస దేశ’ దీవికి తన ప్రియ శిష్యురాలైన మాజీ నటి రంజితను ప్రధానిగా ప్రకావచీరు. ఈమేరకు ఓ ప్రముఖ తమిళ పత్రిక కథనం ప్రచురించింది. ఈ విషయాన్ని నిత్యానంద వెబ్‌సైట్‌లోనూ ప్రకటించారని పేర్కొనడం కలకలం రేపుతోంది. ఆ వెబ్‌సైట్‌లో రంజిత చిత్రం దిగువన ‘నిత్యానందమయి స్వామి’ అనే పేరుందని, దాని దిగువనే హిందువుల కోసమే ఏర్పాటైన కైలాసదేశ ప్రధానిగా పేర్కొని ఉందని వివరించింది.

ఇటీవలే ఐక్యరాజ్య సమితిలో..
ఇటీవల ఐక్యరాజ్యసమితి సమావేశంలో కైలాస దేశం తరఫున మహిళా రాయబారులు పాల్గొన్న విషయం తెలిసిందే. దేశ ప్రతినిధుల మని సమావేశానికి హాజరై ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి సంచలనం సృష్టించారు. తర్వాత ఐక్యరాజ్య సమితి దీనికి వివరణ ఇచ్చింది. కైలాస దేశాన్ని తాము గుర్తించలేదని, సాంస్కృతిక ప్రతినిధులుగా మాత్రమే వారు సమావేశానికి వచ్చారని తెలిపింది.

తాజాగా ప్రధానిగా ప్రకటన..
తాజాగా తన ఆస్థాన ప్రేయసి రంజితను కైలాస దేశానికి ప్రధానిగా ప్రకటించారు. ఇప్పటికే ఆ దేశానికి తానను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. తాజాగా రంజితను ప్రధానిని చేశారు. మరోవైపు కైసాల సదేశానికి ప్రత్యేక కరెన్సీ ఉందని, రిజర్వు బ్యాంకు కూడా గుర్తింపు ఇచ్చిందని వెల్లడించారు. ఈమేరకు లావాదేవీలు జరుపుతున్నామని తెలిపారు.

మొదటి నుంచి రంజితతో..
నిత్యానంద స్వామి సినీనటి రంజితతో ఉంటున్నాడు. రంజిత స్వామీజీకి వ్యక్తిగతంగా సేవ చేస్తున్న వీడియోలు కూడా అప్పట్లో బయటకు వచ్చాయి. అయితే దీనిని రంజిత ఖండించింది. తాను వ్యక్తిగత సహాయకురాలినని, శిష్యురాలినని చెప్పుకుంది. తర్వాత నిత్యానందపై లైంగికదాడి ఆరోపణలు వచ్చాయి.

లైంగికదాడి కేసులో అరెస్ట్‌..
నిత్యానంద స్వామి తన ఆశ్రమంలో మహిళలపై లైంగికదాడి చేసినట్లు ఫిర్యాదు రావడంతో అరెస్ట్‌ అయ్యారు. కోర్టు రిమాండ్‌కు పంపడంతో జైలుకు వెళ్లారు. బెయిల్‌పై వచ్చి కొన్నాళ్లు ఇండియాలోనే ఉన్నారు. ఈ క్రమంలో తాను లైంగిక దాడి చేయలేదని నిరూపించుకునేందుకు తాను నపుంసకుడిని అని ప్రకటించుకున్నాడు. దీంతో కోర్సు సెక్స్‌ సామర్థ్య పరీక్షకు ఆదేశించడంతో దేశం నుంచి రహస్యంగా పారిపోయాడు.

Read Today's Latest Pratyekam News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు