Nayanatara : ఆ పాత హీరోయిన్ కి నయనతార సూపర్ స్టార్ కాదట..

నయనతారను తాను లేడీ సూపర్ స్టార్ గా ఒప్పుకోలేనని తెలిపింది. ఓ ఇంటర్వ్యూలో సూపర్ స్టార్ ఎవరు అనగా.. చిన్న పిల్లలు అడిగినా చెబుతారు రజనీకాంత్ అని. ఆ పేరుకు ఆయనే యాప్ట్ అని అన్నారు.

  • Written By: Vishnupriya
  • Published On:
Nayanatara : ఆ పాత హీరోయిన్ కి నయనతార సూపర్ స్టార్ కాదట..

Nayanatara : నయనతార గురించి సౌత్ ఇండియా ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. అనేక సూపర్ హిట్లు, లేడి ఓరియెంటెడ్ సినిమాలలో నటించి లేడీస్ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది ఈ హీరోయిన్. ముఖ్యంగా తమిళనాడులో ఈ హీరోయిన్ ని అమితంగా ఆరాధించే ఫ్యాన్స్ ఎంతోమంది ఉన్నారు.

ఇప్పుడు ఈ హీరోయిన్ జవాన్ సినిమాతో నార్త్ ఇండియా వారికి కూడా దగ్గర కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక పాత హీరోయిన్ అసలు నయనతార సూపర్ స్టార్ కాదు అనడంతో ఆ వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి.

భారతీయుడు చిత్రంలో ఒక ముఖ్య పాత్రలో కనిపించిన హీరోయిన్ కస్తూరి మీకు గుర్తుండే ఉంటుంది. కొన్ని సినిమాలలో హీరోయిన్ గా చేసిన కస్తూరి, ఆ తరువాత కొంచెం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మరలా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొన్ని సినిమాలలో నటిస్తోంది. అంతేకాదు తెలుగులో సీరియల్స్ లో కూడా కనిపిస్తూ అల్లరిస్తోంది. అయితే ఈ మధ్య తాను ప్రస్తుతం ఉన్న నటి నటుల పైన చేస్తున్న కామెంట్ సోషల్ మీడియాలో అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటున్నాయి.ఇటీవల ఆదిపురుష్ సినిమాపై కూడా విమర్శలు చేసిన సంగతి విదితమే. రాముడికి మీసాలు ఉంటాయా అంటూ దర్శకుడిని చెడామడా తిట్టేసింది. అంతేకాదు ప్రముఖ హీరోయిన్ శ్రీయ ని కూడా విమర్శించింది. ఇప్పుడు ఈ నటి దృష్టి నయనతార వైపు మళ్ళింది.

నయనతారకు లేడీ సూపర్ స్టార్ అన్న బిరుదు ఉన్న సంగతి తెలిసిందే. నయనతారను తాను లేడీ సూపర్ స్టార్ గా ఒప్పుకోలేనని తెలిపింది. ఓ ఇంటర్వ్యూలో సూపర్ స్టార్ ఎవరు అనగా.. చిన్న పిల్లలు అడిగినా చెబుతారు రజనీకాంత్ అని. ఆ పేరుకు ఆయనే యాప్ట్ అని అన్నారు. ఆ తర్వాతే.. కమల్, విజయ్, అజిత్‌లని పేర్కొంది. ఇక లేడీ సూపర్ స్టార్ అన్న ప్రశ్నకు.. కెపి సుందరాంబల్, విజయశాంతి పేర్లను ప్రస్తావించింది. తాను నయన్ ఫ్యాన్ అంటూనే.. ఆమెను లేడీ సూపర్ స్టార్ అనలేనని చెప్పింది.

మరి ఈ వ్యాఖ్యలకు నయనతార అభిమానులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Read Today's Latest Entertainment News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు