డైరెక్టర్ గా మారిన హీరోయిన్ కల్యాణి
టాలీవుడ్లో మహిళా డైరెక్టర్ల కొరత వేధిస్తుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మహిళా శక్తి అవార్డుల్లో సినీ పరిశ్రమకు చెందిన ఒక్క హీరోయిన్, ఒక్క డైరెక్టర్ పేరు కూడా లేదంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో ప్రభుత్వం చేసేదేమీలేక బుల్లితెర యాంకర్, సింగర్ మంగ్లీ, ఇస్మార్ట్ గంగవ్వలకు అవార్డులను ప్రకటించింది. తెలుగు చిత్ర పరిశ్రమలో విజయనిర్మల, బి.జయ, జీవితరాజశేఖర్, సుధ కొంగర, నందిని లాంటివాళ్ళు మాత్రమే మహిళా డైరెక్టర్లుగా రాణించారు. వీరి సంఖ్య […]

టాలీవుడ్లో మహిళా డైరెక్టర్ల కొరత వేధిస్తుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మహిళా శక్తి అవార్డుల్లో సినీ పరిశ్రమకు చెందిన ఒక్క హీరోయిన్, ఒక్క డైరెక్టర్ పేరు కూడా లేదంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో ప్రభుత్వం చేసేదేమీలేక బుల్లితెర యాంకర్, సింగర్ మంగ్లీ, ఇస్మార్ట్ గంగవ్వలకు అవార్డులను ప్రకటించింది.
తెలుగు చిత్ర పరిశ్రమలో విజయనిర్మల, బి.జయ, జీవితరాజశేఖర్, సుధ కొంగర, నందిని లాంటివాళ్ళు మాత్రమే మహిళా డైరెక్టర్లుగా రాణించారు. వీరి సంఖ్య పెరగాలని సినీ పెద్దలు కోరుకుంటున్నారు. ఒకప్పుడు హీరోయిన్ గా నటించిన కళ్యాణి తాజాగా దర్శకురాలుగా మారుతుంది. చేతన్ శీను హీరోగా కల్యాణి ఓ మూవీకి దర్శకత్వం వహిస్తుంది. దర్శకత్వంతోపాటు కే2కే ప్రొడక్షన్స్ బ్యానర్లో సొంతంగా మూవీని కల్యాణినే నిర్మిస్తుంది.
హోలీని పురస్కరించుకొని ఈ మూవీ ప్రీ లుక్, టీజర్ గ్లింప్స్‌ను డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన ట్విట్టర్ వెల్లడించారు. సినిమా మంచి విజయం సాధించాలని బెస్ట్ విషెస్ అందించారు. ఈ సినిమాలో సిద్ధి, సుహాసిని మణిరత్నం, రోహిత్ మురళి, శ్వేత ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. రాజశేఖర్ హీరోగా నటించిన ‘శేషు’ మూవీతో కల్యాణి తెలుగు ప్రేక్షకులకు పరిచమైంది. చివరిగా తెలుగులో ‘యాత్ర’ మూవీలో కల్యాణి నటించింది.