హీరో శ్రీకాంత్ ఇంట విషాదం
ప్రముఖ నటుడు శ్రీకాంత్ కు పితృవియోగం కలిగింది. గతకొంతకాలంగా శ్రీకాంత్ తండ్రి మేక పరమేశ్వరరావు(70) అనారోగ్యంతో ఆసుప్రతిలో చికిత్స పొందుతున్నాడు. ఆదివారం రాత్రి ఆయన పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో శ్రీకాంత్ ఇంటా విషాదం నెలకొంది. కృష్ణా జిల్లా మేకావారిపాలెంలో పరమేశ్వరరావు 1948 మార్చి 16న జన్మించారు. ఆ తర్వాత కర్ణాటకలోనని గంగావతి జిల్లా బసవపాలెంకు వలస వెళ్లారు. కొంతకాలంగా పరమేశ్వరరావు ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నాడు. నాలుగునెలలుగా స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆదివారం […]

ప్రముఖ నటుడు శ్రీకాంత్ కు పితృవియోగం కలిగింది. గతకొంతకాలంగా శ్రీకాంత్ తండ్రి మేక పరమేశ్వరరావు(70) అనారోగ్యంతో ఆసుప్రతిలో చికిత్స పొందుతున్నాడు. ఆదివారం రాత్రి ఆయన పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో శ్రీకాంత్ ఇంటా విషాదం నెలకొంది.
కృష్ణా జిల్లా మేకావారిపాలెంలో పరమేశ్వరరావు 1948 మార్చి 16న జన్మించారు. ఆ తర్వాత కర్ణాటకలోనని గంగావతి జిల్లా బసవపాలెంకు వలస వెళ్లారు. కొంతకాలంగా పరమేశ్వరరావు ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నాడు. నాలుగునెలలుగా స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆదివారం రాత్రి పరిస్థితి విషమించడంలో పరమేశ్వరరావు తుదిశ్వాస విడిచారు. పరమేశ్వర్ రావుకు భార్య ఝాన్సీ లక్ష్మి, కుమార్తె నిర్మల, కుమారులు శ్రీకాంత్, అనిల్ ఉన్నారు.
శ్రీకాంత్ దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించారు. టాలీవుడ్లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అందరితో కలివిడిగా ఉండే శ్రీకాంత్ ఇంట్లో విషాదం నెలకొలడంతో పలువురు సీని ప్రముఖులు ఆయన ఇంటికి చేరుకొని సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 2గంటల తర్వాత మహాప్రస్థానంలో పరమేశ్వర్ రావు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.