Actor Ravikrishna- Navyaswamy: తనంటే నాకు ఎంతో ఇష్టం… నవ్యస్వామితో ఎఫైర్ పై ఫైనల్లీ ఓపెన్ అయిన యాక్టర్ రవికృష్ణ!
ఈ వార్తలను బలపరిచే విధంగా నవ్య స్వామి-రవికృష్ణ ప్రవర్తన ఉంటుంది. పలు టెలివిజన్ షోలలో ఇద్దరూ రొమాన్స్ కురిపించారు. అత్యంత సన్నిహితంగా మెలుగుతారు. అయితే ఓ సందేహం అయితే కొనసాగుతుంది.

Actor Ravikrishna- Navyaswamy: లేటెస్ట్ బ్లాక్ బస్టర్ విరూపాక్ష మూవీలో రవికృష్ణ కీలక రోల్ చేశారు. సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఈ సస్పెన్సు థ్రిల్లర్ ఆకట్టుకుంది. సాఫ్ట్ గా కనిపించే రవికృష్ణ మొదటిసారి నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేశారు. క్లైమాక్స్ లో రవికృష్ణ రోల్ లోని ట్విస్ట్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. విరూపాక్ష విజయం సాధించిన నేపథ్యంలో రవికృష్ణకు ఆఫర్స్ పెరిగే సూచనలు కలవు. కాగా ఎప్పటి నుండో రవికృష్ణ మీద ఓ రూమర్ ఉంది. ఆయన సీరియల్ నటి నవ్యస్వామితో ఎఫైర్ లో నడుపుతున్నారని పలువురి వాదన. ఓ సీరియల్ లో కలిసి నటించిన రవికృష్ణ-నవ్యస్వామి ఒకరినొకరు ఇష్టపడ్డారు. ప్రేమించుకున్నారంటూ కథనాలు వెలువడ్డాయి.
ఈ వార్తలను బలపరిచే విధంగా నవ్య స్వామి-రవికృష్ణ ప్రవర్తన ఉంటుంది. పలు టెలివిజన్ షోలలో ఇద్దరూ రొమాన్స్ కురిపించారు. అత్యంత సన్నిహితంగా మెలుగుతారు. అయితే ఓ సందేహం అయితే కొనసాగుతుంది. ఈ క్రమంలో రవికృష్ణ నేరుగా స్పందించారు. తమ మధ్య ఉన్న రిలేషన్ ఏమిటో బయటపెట్టారు. ”నేను చివరిగా చేసిన సీరియల్ నవ్యస్వామితోనే. సీరియల్స్ మానేసి సినిమాలపై దృష్టి పెట్టాను. విరూపాక్ష మూవీతో నాకు మంచి గుర్తింపు వచ్చింది.
నవ్యస్వామి నాకు మంచి ఫ్రెండ్. ఆమెతో నా కెమిస్ట్రీ స్క్రీన్ మీద బాగా పండుతుంది. అందుకే పలు షోస్ కి మా ఇద్దరినీ పిలుస్తూ ఉంటారు. అలా మేము పాపులర్ జంట అయ్యాము. ఒక ఫ్రెండ్ గా నవ్యస్వామి అంటే ఇష్టం. అంతకు మించి మా మధ్య ఏం లేదు. మా గురించి ఎఫైర్ వార్తలు చదివినప్పుడు ఇద్దరం నవ్వుకుంటాము” అని రవికృష్ణ అన్నారు. మేము మిత్రులం మాత్రమే అని రవికృష్ణ తేల్చి చెప్పారు.
అలాగే అప్పుడే నాకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని ఆయన అన్నారు. రవికృష్ణ బిగ్ బాస్ సీజన్ 3లో సైతం పాల్గొన్నారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పది వారాలు హౌస్లో ఉన్నాడు. తన మార్క్ గేమ్ తో ఆకట్టుకున్నాడు. రవికృష్ణను ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి ఇష్టపడటం విశేషం. కోపంలో తమన్నా రవికృష్ణపై అనుచిత కామెంట్స్ చేసింది. అప్పట్లో తామన్నత్ తీరు వివాదాస్పదం అయ్యింది.
