Acharya Release Date: కరోనా మూడో వేవ్ ఎఫెక్ట్ కు ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ వంటి భారీ సినిమాలు మళ్ళీ వాయిదా వైపు అడుగులు వేశాయి. అయితే, ఈ కోవిడ్ ఎఫెక్ట్ చిత్రాల్లో ఇప్పుడు ఆచార్య కూడా జాయిన్ అవుతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం గత మూడేళ్ళ నుంచి ప్రొడక్షన్ దశలోనే కొట్టుమిట్టాడుతూ ఉంది. ఈ సినిమా మొదలు పెట్టాక, రెండు సార్లు కోవిడ్ వేవ్స్ వచ్చి వెళ్లాయి. ఇప్పుడు మూడో వేవ్ కూడా వచ్చింది.
కాబట్టి, అన్నీ భారీ చిత్రాలు పోస్ట్ ఫోన్ అయినట్టే.. ఈ సినిమా కూడా పోస్ట్ ఫోన్ కానుంది. ఫిబ్రవరి 4, 2022న విడుదల చేయాలని మొదట టీమ్ నిర్ణయించింది. కానీ ఇప్పుడు ఆ రిలీజ్ డేట్ డౌట్ లో పడింది. కరోనా మళ్లీ దేశంలో విజృంభించేలా ఉంది కాబట్టి.. ఇక ఫిబ్రవరి 4న రిలీజ్ చేయడం మంచిది కాదు అని మెగా టీం అభిప్రాయ పడుతుంది.
చాలా రాష్ట్రాలలో థియేటర్లు కూడా మూతబడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీకెండ్ కర్ఫ్యూ, నైట్ కర్ఫ్యూ అంటూ ఇప్పటికే ప్రభుత్వాలు ఆదేశాలు కూడా జారీ చేస్తున్నాయి. అందుకే, ఆచార్య విడుదల వాయిదా ఖాయం అంటున్నారు. ఏది ఏమైనా ఈ కరోనా మూడో వేవ్ దెబ్బ కారణంగా భారీ సినిమాలు చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది.
Also Read: మెగాస్టార్ తో అనుష్క ఫస్ట్, శ్రుతి హాసన్ సెకండ్ !
కాగా ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమా పై మంచి బజ్ ఉంది. అలాగే చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. పైగా ‘కమర్షియల్ క్లాసిక్ డైరెక్టర్’ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ఆ అంచనాలకు తగ్గట్టుగానే మెగాస్టార్ ఈ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ కలిసి ఈ భారీ సినిమాని నిర్మిస్తున్నారు.
Also Read: చిక్కుల్లో ‘ఆర్ఆర్ఆర్’.. హైకోర్టులో పిటిషన్ వేసిన అల్లూరి వారసురాలు..