Bandi Sanjay: ‘బండి’కి జాక్ పాట్.. కేబినెట్ మినిస్ట్రీ కన్‌ఫామ్.. ఏపీకి దక్కేది అనుమానమే!?
లోక్‌సభ ఎన్నికలు వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార ఎన్‌డీఏ, విపక్ష యూపీఏ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. దీంతో కేంద్రం రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.

Bandi Sanjay: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి పోయింది. అయితే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిన బండి సంజయ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు జాతీయ స్థాయి పదవి దక్కనుంది. ఈ వారంలో జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో బండి సంజయ్‌కు కేంద్ర కేబినెట్ పదవి ఖాయమైందని సమాచారం. కీలక మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. ఈక్రమంలో ఏపీ నుంచి కేబినెట్‌లో స్థానం దక్కేదెవరికనేది ఆసక్తి కరంగా మారుతోంది.
మారుతున్న రాజకీయ సమీకరణలు..
లోక్‌సభ ఎన్నికలు వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార ఎన్‌డీఏ, విపక్ష యూపీఏ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. దీంతో కేంద్రం రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. విపక్షాలు ప్రధాని మోదీ లక్ష్యంగా ఏకం అవుతున్నాయి. ఈ సమయంలోనే ప్రధాని మోదీ తన హ్యాట్రిక్ విజయం కోసం వేగంగా అడుగులు వేస్తున్నారు. పాలనా పరంగా.. పార్టీలోనూ భారీ ప్రక్షాళన ప్రారంభించారు. ఈ క్రమంలో ఇప్పటికే పలు రాష్ట్రాల పార్టీ అధ్యక్షులను మార్చారు. అందులో ఏపీ, తెలంగాణ ఉన్నాయి. తెలంగాణలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించారు.
కేంద్ర మంత్రిగా సంజయ్..
ఇప్పటి వరకు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ తొలిగింపు కార్యకర్తలకు రుచించటం లేదు. బండి సంజయ్ అధ్యక్షుడిగా పార్టీలో జోష్ పెంచారనే అభిప్రాయం ముఖ్య నేతలు అంగకరిస్తున్నారు. ఈ సమయంలో బండి సంజయ్‌కు సముచిత ప్రాధాన్యత దక్కుతుందని బీజేపీ ముఖ్య నేతలు చెబుతున్నారు. తాజాగా కేంద్ర కేబినెట్ మార్పులు..చేర్పులపైన ప్రధాని నివాసంలో సుదీర్ఘ సమావేశం జరిగింది. అందులో తెలంగాణ నుంచి బండి సంజయ్‌కు కేబినెట్ లోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. కేబినెట్ మంత్రిగానే అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయ్యారని.. కీలక శాఖ దక్కుతందని చెబుతున్నారు. ఇక కిషన్‌రెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించటంతో ఆయనను కేబినెట్ నుంచి తొలిగింపు తప్పదని చర్చ సాగుతోంది. ఒక వ్యక్తికి ఒకే పదవి అనేది పార్టీ విధానం కావటంతో కిషన్‌రెడ్డిని మంత్రి పదవిలో కొనసాగించే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఇదే సమయంలో తెలంగాణ నుంచి మరో నేతకు కేబినెట్‌లో అవకాశం దక్కుతుందనే ప్రచారం ఉన్నా.. సమీకరణాల కారణంగా ప్రస్తుతానికి పెండింగ్‌లో పెట్టారని సమాచారం.
ఏపీలో ఎవరికో…
ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు పురందేశ్వరికి అప్పగించటంతో.. కేబినెట్‌లో ఎవరికి స్థానం కల్పిస్తారనే లెక్కలు మొదలయ్యాయి. ఏపీకి చెందని జీవీఎల్, సీఎం రమేష్ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఎవరు ఏ స్థానాలు గెలిచినా.. పరోక్షంగా బీజేపీకి మద్దతుగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. దీంతో, ఏపీకి అసలు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కుతుందా లేదా అనే చర్చ ఆసక్తి కరంగా మారుతోంది.
