Groundwater Level On Telangana: తెలంగాణ భూగర్భం జల సిరులతో తొనికిసలాడుతోంది. 680 టీఎంసీల నీళ్లున్నాయని గ్రౌండ్ వాటర్ అట్లాస్ వెల్లడించింది. ఇది రాష్ట్రానికి ఉన్న కృష్ణా నది నికర జలాల రెట్టింపు కంటే ఎక్కువని పేర్కొంది. 2020తో పోల్చితే 2022 లో భూగర్భ జలవినియోగం 8 శాతం తగ్గిందని తెలిపింది. హైదరాబాద్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్ ఈ అట్లాస్‌ను విడుదల చేశారు.

Groundwater Level On Telangana
నీటి సమస్య తీరినట్టే..
వందల గజాలలోతు బోర్లు వేసినా నీరు లేని పరిస్థితిని తెలంగాణ అధిగమించింది. రాష్ట్ర జలవిధానాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. భూగర్భంలో పాతాళ గంగ పొంగిపొరలుతూ సగటున 4.26 మీటర్ల ఎత్తుకు భూగ్భ జలమట్టం చేరుకుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన అనంతరం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన జలవిధానాలు, నిర్మించిన ప్రాజెక్టులు భూగర్భ జలాలను పెంచడంతో పాటుగా ప్లోరోసిస్‌ను కూడా క్రమేణ తగ్గిస్తున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణతో ఉపరితలంలో నీటి ఎత్తిపోతలతో పాటుగా వరుణి కటాక్షంతో ఉపరితలంతోపాటుగా భూగర్భంలో జలం సిరులై ప్రవహిస్తుంది. తెలంగాణ ఆవిర్భవించిన అనతికాలంలోనే భూగర్భజలాలు పైపైకి వస్తుండటంతోపాటుగా వందల టీఎంసీల నీరు భూగర్భంలో సిద్ధంగా ఉంది.
దేశంలోనే ఆదర్శం..
భూగర్భజలాల పెరుగుదలలో తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. బోర్లపై ఆధారపడి వ్యవసాయం చేసే రైతులంతా దాదాపుగా ఉపరితల నీటియోగంతో వ్యవసాయాన్ని పండుగగా చేస్తున్నారు. పెరిగిన భూగర్భజలాలు, నిర్మించిన ప్రాజెక్టులతో 40 లక్షల ఎకరాల సాగునుంచి 1.25 కోట్ల ఎకరాల సాగుకు తెలంగాణ రైతాంగం చేరుకుని చరిత్ర çసృష్టిస్తుంది. తెలంగాణ డైనమిక్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ నివేదిక మేరకు తెలంగాణ పరిధిలోని భూగర్భంలో ప్రస్తుతం 680 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని స్పష్టం చేసింది. గతంలో అడుగంటిన జలవనరులు ప్రస్తుతం పైకి చేరుకున్నాయని తెలిపారు. దీనికి ప్రధాన కారణం రైతులు బోరుపంపుల వినియోగం తగ్గించి ఉపరితల నీటి వినియోగం పెంచడమేనని నిపుణులు తెలిపారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో తెలంగాణకు కేటాయించిన నీరు 299 టీఎంసీలైతే తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో భూగర్భంలో మనం పొదుపుగా దాచుకున్న నీరు 680 టీఎంసీలు. రాష్ట్రంలోని 83 మండలాల్లో ఈ పెరుగుదల అధికంగా ఉంది.

Groundwater Level On Telangana
చెరువుల పునరుద్ధరణతో..
కాతీయులు నిర్మించిన చెరువుల్లో 26,700 చెరువుల పునరుద్ధరణ, కుంటలు, చిన్న చెరువులు, నీటీ ఊటల పునరుద్ధరణ ప్రేరకాలుగా నిలిచాయి. అలాగే 1,375 చెక్ డ్యాంల నిర్మాణాలతో పాటుగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో నీటి పొదుపు తదితర అంశాలు తెలంగాణలో భూగర్భ జలాలను పెంచేందుకు ప్రధాన అంశాలుగా నిలిచాయి. అయితే నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి అయితే భూగర్భజలాలు మరింతగా అందుబాటులో ఉండటంతోపాటుగా నీటి ఊటలు పెరిగే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయని జలనిపుణులు పేర్కొంటున్నారు.