Chandrababu Cid Custody : బిగ్ బ్రేకింగ్ : చంద్రబాబుకు కోర్టులో గట్టి షాక్.. సీఐడీ కస్టడీ
వెనువెంటనే పిటిషన్ వేసేందుకు సిద్ధపడుతున్నారు. ఇప్పుడు పిటిషన్ దాఖలు చేసినా సోమవారం విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.

Chandrababu Cid Custody : చంద్రబాబుకు కోర్టులో గట్టి షాక్ తగిలింది. బెయిల్ కోసం ఢిల్లీ నుంచి కోట్లు పెట్టి మరీ లాయర్లను దించినా వర్కవుట్ కాలేదు. తాజాగా చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇస్తూ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. చంద్రబాబును ఏపీ సిఐడి వెంటాడుతోంది. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబును విచారణ చేపట్టాల్సి ఉందని.. ఆయన ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిఐడి ఏసీబీ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబును రెండు రోజులు పాటు సిఐడి కస్టడీ కి ఇస్తూ ఏసీబీ కోర్టు తీర్పు చెప్పింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉదయం 9:30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. విచారణ సమయంలో చంద్రబాబు తరుపు లాయర్లు ఒకరిద్దరు అందుబాటులో ఉండేందుకు అనుమతి ఇచ్చారు. విచారణ జరిపే అధికారుల పేర్లు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. విచారణ సైతం రికార్డు చేయాలని సూచించారు.
హైకోర్టులో క్వాష్ పిటిషన్ కొట్టివేతతో చంద్రబాబు కస్టడీకి మార్గం సుగమం అయ్యింది. అయితే ఐదు రోజులపాటు సిఐడి కస్టడీ కోరగా.. ఏసీబీ కోర్టు రెండు రోజులు మాత్రమే కేటాయించింది. విచారణకు సంబంధించి వీడియోలు, ఫోటోలు బయటకు రాకూడదని స్పష్టం చేసింది. విచారణ వివరాలను సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించాలని ఆదేశాలు ఇచ్చింది. అలాగే చంద్రబాబు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై విచారణను సోమవారం చేస్తామని చెప్పుకొచ్చింది.
అయితే తాజా పరిణామాల నేపథ్యంలో చంద్రబాబుకు బెయిల్ లభిస్తుందని ఆశించిన టిడిపి శ్రేణులు నిరాశకు గురయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. చంద్రబాబుకు కోర్టులో వరుసుగా దెబ్బలు తగులుతుండడంతో పార్టీ శ్రేణులు సైతం ధైర్యాన్ని కోల్పోతున్నాయి. అసలు చంద్రబాబుకు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించుకోలేదని టిడిపి సీనియర్లు సైతం తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. తాజా పరిణామాలతో పాటు భవిష్యత్ కార్యాచరణ పై సీరియస్ గా ఆలోచిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ, ఆయన కుమార్తె బ్రాహ్మణి సేవలను ఉపయోగించుకోవాలని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు చంద్రబాబు తరుపు లాయర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధపడుతున్నారు. అసలు స్కిల్ డెవలప్మెంట్ స్కామే లేదని.. అందులో చంద్రబాబుకు అసలు ప్రమేయం లేదని గట్టిగా నమ్ముతున్న లాయర్లు సుప్రీం కోర్టుకు వెళితే ఫలితం ఉంటుందని ఆశిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న లోకేష్ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. వెనువెంటనే పిటిషన్ వేసేందుకు సిద్ధపడుతున్నారు. ఇప్పుడు పిటిషన్ దాఖలు చేసినా సోమవారం విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
