ABN RK Vs Jagan: తాడేపల్లిలో అడుగడుగునా రాధాకృష్ణ సీక్రెట్ కెమెరాలు.. జగన్ ప్రతి అడుగు తెలుస్తోంది అందుకే!

ఈరోజు ఏపీ ఎడిషన్ లో ప్రచురితమైన వార్తను చూస్తే అచ్చం అలాగే అనిపిస్తుంది. “లోకేష్, రామోజీరావును లోపల వేసేయండి. మీకేం కాదబ్బా.. నేను చూసుకుంటాను.

  • Written By: Bhaskar
  • Published On:
ABN RK Vs Jagan: తాడేపల్లిలో అడుగడుగునా రాధాకృష్ణ సీక్రెట్ కెమెరాలు.. జగన్ ప్రతి అడుగు తెలుస్తోంది అందుకే!

ABN RK Vs Jagan: బిగ్ బాస్ షోలో అణువణువూ సీక్రెట్ కెమెరాలు ఉంటాయి. షోలో పార్టిసిపేట్ చేస్తున్నవారి కదలికలు నిర్వాహకులకు తెలిసిపోతాయి. అదంటే ఒక షో కాబట్టి.. ముందుగానే పార్టిసిపెంట్లు రూల్స్ అండ్ రెగ్యులైజేషన్స్ తెలిసి అందులోకి వస్తారు కాబట్టి.. పెద్దగా ఇబ్బంది ఉండదు. బిగ్ బాస్ నుంచి ప్రేరణ పొందాడో, లేకుంటే తన గురువు చంద్రబాబు దగ్గర మరిన్ని మంచి మార్కులు కొట్టేయాలన్న తాపత్రయమో తెలియదు గాని రాధాకృష్ణ రెచ్చిపోతున్నాడు. తన వేగుల ద్వారా తాడేపల్లి ప్యాలెస్ లో ఏం జరుగుతుందో వెంట వెంటనే తెలుసుకుంటున్నాడు. చదువుతుంటే ఆశ్చర్యం అనిపించినప్పటికీ ఇది నిజం అనే లాగా తన పత్రికలో వార్తలు రాస్తున్నాడు.

ఈరోజు ఏపీ ఎడిషన్ లో ప్రచురితమైన వార్తను చూస్తే అచ్చం అలాగే అనిపిస్తుంది. “లోకేష్, రామోజీరావును లోపల వేసేయండి. మీకేం కాదబ్బా.. నేను చూసుకుంటాను. అలాగే ఆ దేవినేని ఉమను, కొలికపూడి శ్రీనివాస్ ను కూడా అరెస్టు చేయండి” ఇలా జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు..వారు ఎస్ బాస్ తల వంచారు. ముఖ్యంగా ఒక అధికారి తనకు ఇంకా సర్వీస్ ఉందని చెబితే, నీకేం కాదబ్బా నేను చూసుకుంటాను అని జగన్ హామీ ఇచ్చారు.. ఇలా రాసుకొచ్చింది ఆంధ్రజ్యోతి.

ఇప్పుడే కాదు గతంలో షర్మిలకు, జగన్మోహన్ రెడ్డికి మధ్య గ్యాప్ పెరిగినప్పుడు ఇలానే ఆంధ్రజ్యోతి రాసింది. ఆస్తుల వివాదాలకు సంబంధించి అన్నాచెల్లెలికి మధ్య పూడ్చలేనంత గ్యాప్ ఏర్పడిందని, ఇక ఎవరి దారి వారు చూసుకుంటారని తేల్చేసింది. సరే వ్యవహారంలో ఆంధ్రజ్యోతి రాసింది కొంత నిజం అనుకున్నప్పటికీ.. బయటికి కనిపించే అన్ని వివాదాలు జగన్, షర్మిల మధ్య ఉన్నాయి అంటే అది అంత ఈజీగా నమ్మే విషయం కాదు. సరే ఇప్పుడు జగన్ వేసే ప్రతి అడుగుకు సంబంధించి ఆంధ్రజ్యోతి తాటికాయంత అక్షరాలతో రాస్తున్నది. చూశారా మా చంద్రబాబును ఎంత ఇబ్బంది పెడుతున్నారో అని శోకాలు పెడుతోంది. జగన్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. కొద్దిరోజులపాటు ఆయన లండన్ వెళ్లొచ్చారు. ముఖ్యమంత్రి తిరిగివచ్చిన తర్వాత కీలకమైన అధికారులు ఆయనను కలుస్తారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వివరిస్తారు. జగన్ తాడేపల్లి కి వచ్చిన తర్వాత అధికారులు కలిశారు. ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అరెస్టు అయ్యారు కాబట్టి.. రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి జగన్ వాకబు చేసినట్టున్నాడు. వారు అతడికి వివరించినట్టున్నారు.

అయితే అక్కడ జరిగింది ఒకటైతే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసుకొచ్చింది మరొకటి. అధికారుల నిర్వాకం వల్లనే మార్గదర్శి శైలజ అమెరికా వెళ్లిపోయిందని, రామోజీరావు అరెస్టు ఆగిపోయిందని, లోకేష్ ను అరెస్టు చేయాలని, శ్రీనివాస్, ఉమాను జైల్లో పెట్టాలని అనేతీరుగా జగన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారని.. ఇది తనకు మాత్రమే తెలుసు అని రాధాకృష్ణ తన పత్రికలో ఫస్ట్ పేజీ బ్యానర్ వార్తగా ప్రచురించాడు.. పోనీ జగన్ ఈ విషయాలే మాట్లాడాడు అనుకుందాం.. గత కొంతకాలంగా ఆయన పార్టీ వర్గాలు చెబుతోంది ఇదే కదా. రోజా నుంచి కొడాలి నాని వరకు అందరూ అంటున్నది ఇదే కదా. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారులతో చర్చించాల్సిన అవసరం ఏముంటుంది? ఒకవేళ అక్రమంగా అరెస్టు చేస్తే వారు కోర్టులకు వెళ్లొచ్చు. బెయిలు తీసుకోవచ్చు. అధికారులు జగన్మోహన్ రెడ్డికి తల వంచినంతమాత్రాన.. కోర్టులు తలవంచవు కదా. కోర్టుల్లోనూ చంద్రబాబు మనుషులు పాతుకు పోయారు అనే ఆరోపణ కూడా ఎప్పటినుంచే ఉంది కదా. అలాంటప్పుడు జగన్ అధికారులతో కేవలం మీ విషయాల గురించే చర్చించాల్సిన అవసరం ఏముంది. ఒకవేళ జగన్ మోహన్ రెడ్డి రామోజీరావును అరెస్టు చేయాలంటే మొన్ననే చేసేవాడు కదా. అతడు కోర్టుకు వెళ్లాడు కాబట్టి, కోర్టు అతనిపై చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది కాబట్టి.. మార్గదర్శి విషయంలో ఏపీ ప్రభుత్వం తదుపరి అడుగులు వేయలేకపోతోంది. మరి అంత సాధన సంపత్తి ఉన్న జగన్ ఎందుకు వెనకాడుతున్నట్టు? దేవినేని ఉమాను, శ్రీనివాస్ మీద ఎలాంటి అభియోగాలు లేనప్పుడు ప్రభుత్వం ఎలా అరెస్టు చేస్తుంది? అరెస్టు చేసినా రేపు కోర్టుకు ఎలాంటి సమాధానం చెబుతుంది? ఇన్ని ప్రశ్నలు తలెత్తుతున్నప్పుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇలా బ్యానర్ వార్త ఎలా రాశాడు? చంద్రబాబుకు డప్పు కొట్టే విషయంలో శృతి మర్చిపోయి ఏదేదో రాస్తున్నాడు. నిప్పులు చిమ్మేలాగా వార్తలు రాసిన రాధాకృష్ణ చివరికి ఇలా అయిపోయాడు ఏంటి పాపం?!

Read Today's Latest Ap politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు