ABN Radhakrishna : ఇవే కొంచెం తగ్గించుకుంటే మంచిది రాధాకృష్ణా!

ఇలాంటి వార్తలు రాస్తే ఉపయోగం ఏమీ ఉండదు. నిప్పులు చిమ్మేలాగా రాసే రాధాకృష్ణకు ఏమైంది? తన గురువు జైల్లోకి వెళ్లిన తర్వాత పూర్తిగా గాడి తప్పాడు. పాపమ్ శమించు గాక!

  • Written By: NARESH
  • Published On:
ABN Radhakrishna : ఇవే కొంచెం తగ్గించుకుంటే మంచిది రాధాకృష్ణా!

ABN Radhakrishna : జగన్ ఉరుముతున్నాడు. ఏ అండ చూసుకోనో తెలియదు గాని.. చంద్రబాబుపై కేసుల విషయంలో మరింత దూకుడుగా ఉంటున్నాడు. లండన్ నుంచి రాగానే ఏపీ సిఐడి చీఫ్, ప్రభుత్వం తరఫున వాదించే లాయర్ తో భేటీ అయ్యాడు. ఇంకా ఏమైనా కేసులు ఉంటే తవ్వండి అంటూ ఆదేశాలు ఇచ్చాడు. అంటే ఏ లెక్కన చూసుకున్నా చంద్రబాబును విడిచి పెట్టే సవాల్ లేదంటూ జగన్ డైరెక్ట్ గా చెప్పేస్తున్నాడు. ఇలాంటప్పుడు టిడిపి గట్టి కౌంటర్ ప్లాన్ చేయాలి. టిడిపికి వంతపాడే మీడియా మరింత లోతుగా కథనాలను ప్రచురించాలి. అంతేగాని ప్రజల్లో సానుభూతి పొందేందుకు నేల విడిచి సాము చేయకూడదు.

చంద్రబాబు ఆస్థాన పత్రికగా పేరుపొందిన ఆంధ్రజ్యోతి ఇవాళ అదే చేసింది. చంద్రబాబు అరెస్ట్ అయిన నాటి నుంచి ఆంధ్రజ్యోతి ఓనర్ రాధాకృష్ణ శోకాలు పెడుతూనే ఉన్నాడు. ఏపీ విజినరీ చంద్రబాబును ఇలా అరెస్టు చేస్తారా అంటూ జగన్ మీద గుడ్లు ఉరుముతున్నాడు. అయితే చంద్రబాబును స్వాతిముత్యం అని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో రాధాకృష్ణ పప్పులో కాలేస్తున్నాడు. తన పత్రికలో కూడా అచ్చం సాక్షి రాసుకొచ్చినట్టే ఏవేవో వార్తలు రాసుకోస్తున్నాడు. ఈ విషయంలో ఈనాడు కాస్త నయం. అందుకే అది పీవీ రమేష్ తో ఇంటర్వ్యూ చేసింది. చాలా వివరణాత్మకమైన ప్రశ్నలు అడిగి.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయాలకు అనుగుణంగా సమాధానాలు ప్రచురించింది. చంద్రబాబుపై సిఐడి స్కిల్ స్కాం ఆరోపణలకు రమేష్ ఇంటర్వ్యూ పూర్తి కౌంటర్ కాకపోయినప్పటికీ.. ఒక కోణంలో మాత్రం అది పూర్తి వివరణ. చేతనైతే ఆయన మేఘా నుంచి రాజీనామా తో ఎందుకు బయటపడాల్సి వచ్చిందో రాయాలి. డిజైన్ టెక్ ఎండి వికాస్ ఖన్వే ల్కర్ వివరణ పబ్లిష్ చేయడంలో అర్థం ఉంది. ఎందుకంటే ఈ స్కామ్ లో వాళ్ళదే ప్రధాన పాత్ర అని సిఐడి ఆరోపిస్తోంది కాబట్టి.. ఒక లోకేష్, ఒక భువనేశ్వరి, ఒక బాలయ్య వ్యాఖ్యలను, విమర్శలని పబ్లిష్ చేయొచ్చు. ఎందుకంటే వారు చంద్రబాబు కుటుంబ సభ్యులు కాబట్టి. ఒకవేళ రాధాకృష్ణ నిజంగా రాయాలి అనుకుంటే చంద్రబాబు సీట్లో బాలయ్య కూర్చొని.. ఇక నేను వస్తాను అని కేడర్ కు పిలుపునివ్వడాన్ని రాయాలి. తను కట్టిన భవనంలోనే తనను కట్టిపడేశారు అని భువనేశ్వరి వ్యాఖ్యల్ని రాయాలి. అక్కడికి రాజమండ్రి జైలు బిల్డింగ్ చంద్రబాబు కట్టినట్టు? అదొక పురాతనమైన జైలు. తను జైలు కడితే ఇక ఆ జైలులోకి పంపించ వద్దా? ఇదేం వాదన?

వాస్తవానికి స్కిల్ చాలా సీరియస్ కేసు. ఒకప్పుడు జాతీయస్థాయిలో రాజకీయాలను నడిపించినవాడు ఈరోజు జైలులో ఒంటరిగా, 40 మంది ఉండాల్సిన రెండంతస్తుల స్నేహ బ్లాక్ లో బిక్కుబిక్కుమంటూ బందీ అయిపోయిన దురవస్థ లో ఉన్నాడు. ఈక్రమంలో ఎవరికి ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేస్తే అది చంద్రబాబుకే నష్టం. వాళ్ళు ఎవరో అంటున్నారు, అభివృద్ధి చేసిన నాయకుడిని జైలులో వేస్తారా? ఏదీ పోలవరం? ఏదీ అమరావతి? పోనీ అభివృద్ధి నిజమైతే అదేమైనా కేసుల నుంచి ఇమ్యూనిటీ ఇస్తుందా? అసలు రాజకీయాలే చాలా క్రూరమైనవి. ప్రత్యర్థులను కట్టడి చేసే ఉపాయాలు ఉంటాయి. అక్రమ అరెస్టు అని మరో గోల.. అరెస్టు, కేసు అక్రమమే అయితే ఏసీబీ కోర్టు తన రిమాండ్ రిపోర్టును తిరస్కరించి ఉండాలి కదా. మెరుపు ఉందనే కదా తనను జైలుకు పంపించింది. హౌస్ అరెస్ట్ పిటిషన్ కూడా తోసి పుచ్చింది. సిద్దార్థ లూథ్రా కాదు. ఇంటర్నేషనల్ కోర్టు లాయర్లు వచ్చినప్పటికీ ఫాయిదా ఏముంటుంది? జగన్ అక్రమాస్తుల కేసుల వెనుక కూడా రాజకీయాలు. తనను కట్టడి చేసే ఎత్తుగడలు కాక మరేమున్నాయి.. ఇదీ అంతే అనుకుందాం. తను విచారణకు అతీతుడని, నిప్పు అనే చంద్రబాబు సెల్ఫ్ ప్రచారాలను జగన్ బద్దలు కొట్టాడు. రేపొద్దున తనను అవినీతిపరుడు అన్న వారిని మరి చంద్రబాబు ఏమిటి అని అడిగే పరిస్థితికి తీసుకొచ్చాడు.

ఈ పరిస్థితిలో చంద్రబాబు అనుకూల మీడియా జాగ్రత్తగా కథనాలు ప్రచురించాలి..  కానీ అది మరిచి ఏది పడితే అది రాసేస్తోంది. ఇది అంతిమంగా చంద్రబాబు నాయుడుకి నష్టం.. నిన్ననేమో చంద్రబాబు ఏం తిన్నాడు? అన్నది హైలెట్ చేశారు. ఇవ్వాలేమో చంద్రబాబుతో తమ గోడు వెళ్ళబోసుకోవాలని రాజమండ్రిలో ఖైదీలు ఆత్రుతగా ఉన్నారట.. అని రాశారు.  జైలు గోడల బయటనుంచి గంజాయి, సిగరెట్లు, బీడీలు విసిరేస్తుంటారు అక్కడ ఖైదీలు.. చంద్రబాబుకు జైలు భద్రం కాదని తొలిరోజు రాశారు కదా… మరిప్పుడు ఖైదీలు చంద్రబాబును నేరుగా కలిస్తే ఆయనకేం ప్రమాదం కాదా? అసలు కేసుకు సంబంధించిన కౌంటర్లు ఏమైనా రాస్తే చంద్రబాబు పట్ల జనంలో కాస్త సానుభూతిని పెంపొందించే పని చేయవచ్చు తప్ప ఇలాంటి వార్తలు రాస్తే ఉపయోగం ఏమీ ఉండదు. నిప్పులు చిమ్మేలాగా రాసే రాధాకృష్ణకు ఏమైంది? తన గురువు జైల్లోకి వెళ్లిన తర్వాత పూర్తిగా గాడి తప్పాడు. పాపమ్ శమించు గాక!

Read Today's Latest Ap politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు