Nara Brahmani: బాలకృష్ణ పై కుమార్తె బ్రాహ్మణిని ప్రయోగించిన ఏబీఎన్ రాధాకృష్ణ

చంద్రబాబు అరెస్టు తర్వాత బాలకృష్ణ రంగంలోకి దిగారు. టిడిపి కేంద్ర కార్యాలయంలో ఏకంగా చంద్రబాబు సీట్లో కూర్చొని అందర్నీ ఆశ్చర్య పరిచారు. ఎవరు భయపడొద్దని.. తాను వస్తున్నానని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.

  • Written By: Dharma Raj
  • Published On:
Nara Brahmani: బాలకృష్ణ పై కుమార్తె బ్రాహ్మణిని ప్రయోగించిన ఏబీఎన్ రాధాకృష్ణ

Nara Brahmani: నందమూరి, నారా కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందా? అందుకు ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ కారణమా? బాలకృష్ణ పై కుమార్తె బ్రాహ్మణిని ప్రయోగిస్తున్నారా? ఇదంతా చంద్రబాబుకు తెలిసే జరుగుతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనకు రెండు మూడు రోజుల్లో బెయిల్ లభిస్తుందని వార్తలు వస్తున్నాయి. గత కేసులు తిరగదొడి మరో రెండు నెలల పాటు బెయిల్ లేకుండా చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలియదు గానీ.. ఇప్పుడు టిడిపి పగ్గాలు విషయంలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అసలు సిసలు రాజకీయానికి తెర తీసినట్లు వార్తలు వస్తున్నాయి.

చంద్రబాబు అరెస్టు తర్వాత బాలకృష్ణ రంగంలోకి దిగారు. టిడిపి కేంద్ర కార్యాలయంలో ఏకంగా చంద్రబాబు సీట్లో కూర్చొని అందర్నీ ఆశ్చర్య పరిచారు. ఎవరు భయపడొద్దని.. తాను వస్తున్నానని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ప్రత్యర్థుల అంతు చూస్తానని కూడా వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు తర్వాత పార్టీని నడిపేది తానేనని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. అటు పవన్ తో పాటు హడావిడి చేశారు. దీంతో టీడీపీ శ్రేణులకు కొంత స్వాంతన చేకూరింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో బాలకృష్ణ వార్తలు ఆంధ్రజ్యోతిలో కనిపించలేదు. ఎండి రాధాకృష్ణ తో ఉన్న విభేదాల కారణంతోనే అలా జరిగిందని వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఆంధ్రజ్యోతిలో బ్రాహ్మణికి త్వరలో టిడిపి పగ్గాలు అని ప్రత్యేక కథనం వచ్చింది. ఇది నందమూరి అభిమానులకు నిరాశపరిచింది.

ఎన్టీఆర్ స్థాపించిన టిడిపి పై.. ఆయన వారసుడైన బాలకృష్ణ నాయకత్వాన్ని కూడా జీర్ణించుకోలేని పరిస్థితి వచ్చిందా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. టిడిపి పై బాలయ్య పెత్తనాన్ని సహించలేక ఏబీఎన్ రాధాకృష్ణ ఆయనపై కూతురైన బ్రాహ్మణిని ప్రయోగిస్తున్నారు అన్న టాక్ నడుస్తోంది. ఇప్పటికే హిందూపురం నియోజకవర్గం నుంచి బాలకృష్ణ రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలన్న ఆలోచనతో ఉన్నారు. టిడిపి పగ్గాలు తీసుకోవాలని ఉత్సాహం చూపిస్తున్నారు. సరిగ్గా ఇటువంటి తరుణంలోనే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అడ్డం తిరగడం పై నందమూరి అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

సహజంగా ఆంధ్రజ్యోతి అంటేనే తెలుగుదేశం పార్టీ పత్రిక అన్న ముద్ర ఉంది. అటు టిడిపి శ్రేణులు సైతం ఆంధ్రజ్యోతిని అక్కున చేర్చుకుంటాయి. అటువంటి ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ బాలకృష్ణ తొక్కేయాలని చూడడం చర్చనీయాంశంగా మారింది. ఆయన చంద్రబాబుకి భక్తుడు అన్న పేరు ఉంది. చంద్రబాబు ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తారని తెలుస్తోంది. ఈ తరుణంలో చంద్రబాబు ఆదేశాల మేరకే ఆర్కే బ్రాహ్మణిని తెరపైకి తెచ్చారని ప్రచారం ఊపొందుకుంటుంది. తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్న ఇటువంటి సమయంలో ఈ రాజకీయాలు అవసరమా? టిడిపి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read Today's Latest Ap politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు