Uttar Pradesh Woman: పీఎఫ్ డబ్బుల కోసం.. కారుణ్య నియామకాల కోసం భర్త, తండ్రి చనిపోయినట్లు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించిన ఘటనలు చూశాం. బీమా డబ్బుల కోసం చంపేసిన ఘటనలు కూడా చూశాం. కానీ ఇక్కడ ఓ మహిళ మరణించిన తన తండ్రికి వచ్చే పెన్షన్ కోసం భార్యగా నటిస్తోంది. పదేళ్లుగా నెలకు రూ.10 వేల చొప్పున కుటుంబ పెన్షన్ తీసుకుంటోంది. చివరకు మహిళ భర్త ఈ విషయాన్ని బయటపెట్టాడు. అధికారులకు ఫిర్యాదు చేశాడు.
రిటైర్డ్ ఉద్యోగి పదేళ్ల క్రితం మృతి..
ఆగ్రాకు చెందిన వాజహత్ ఉల్లాఖాన్ రిటైర్డ్ రెవెన్యూ గుమస్తా. 2013, జనవరి 2న ఆయన మరణించాడు. అతని భార్య సబియా బేగం అప్పటికి చనిపోయింది. వాజహత్‌కు కుమార్తె మొహ్సినా పర్వేజ్(36) ఉంది. భార్య లేనందున తన తండ్రి పెన్షన్ ఇక రాదని తెలుసుకుంది. దీంతో తానే తండ్రికి భార్యగా నటించేందుకు సిద్ధపడింది. ఈమేరకు పత్రాలు రూపొందించింది. కుటుంబ పెన్షన్ పొందేందుకు అవసరమైన ఆమోదాలు కూడా పొందింది.
పదేళ్లుగా పెన్షన్..
అన్నీ అనుకున్నట్లు జరిగిపోవడంతో పదేళ్లుగా ఆమె నెలకు రూ10 వేల చొప్పున పెన్షన్ తీసుకుంటోంది. ఇప్పటి వరకు రూ.12 లక్షల పెన్షన్ పొందినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా మొహ్సినా 2017 లో ఫరూక్ అలీని వివాహం చేసుకుంది.
భర్తతో విభేదాలతో విషయం బయటకు..
కానీ కొన్ని రోజుల తర్వాత వారి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. మొహ్సినా చట్టవిరుద్ధంగా పెన్షన్ తీసుకుంటున్న విషయం తెలుసుకున్న ఫరూక్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అలీగాంజ్లోని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ కార్యాలయం నేతృత్వంలోని దర్యాప్తు చేసి మోహ్సినా పెన్షన్ అప్లికేషన్లో మోహ్సినా తెలివిగా తన తల్లి పేరును, ఆమె స్వంత ఫొటోను కూడా ఉపయోగించినట్లు గుర్తించారు. ఒక గుమస్తా, బీట్ కానిస్టేబుల్‌తో ఆమోదం పొంది చివరికి తుది క్లియరెన్స్ కోసం జిల్లా ఖజానాకు వెళ్లింది. చట్ట విరుద్ధంగా పెన్షన్ తీసుకుంటున్నట్లు నిర్ధారణ కావడంతో అలిగాంజ్ పోలీస్ స్టేషన్లో మోహ్సినాపై ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఆమోపై 420 (మోసం), 467 (విలువైన భద్రత యొక్క ఫోర్జరీ), 468 (మోసం కోసం ఫోర్జరీ), 471 జెన్యూన్ గా ఉపయోగించడం వంటి బహుళ అభియోగాలు మోపారు. 409 (ఒక ప్రజా సేవకుడు నమ్మకాన్ని ఉల్లంఘించడం). మహిళ దరఖాస్తును ఆమోదించిన అధికారుల పాత్రను దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అదనపు జిల్లా మేజిస్ట్రేట్ అలోక్ కుమార్ మాట్లాడుతూ, దర్యాప్తు నిందితుడి పెన్షన్ దరఖాస్తు యొక్క ధ్రువీకరణ మరియు ఆమోదం ప్రక్రియలో గణనీయమైన లోపాలను వెల్లడించింది. నిందితులతో సంబంధం కలిగి ఉన్నందుకు దోషిగా తేలిన సిబ్బందిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: A woman pretended to be the wife of her father who had been dead for 10 years and took a pension of rs 12 lakh
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com