Himaja: కొండ చిలువలతో హిమజ.. మొత్తం చుట్టేసుకొని షాకింగ్ పిక్
స్వయంవరం, కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం.. అనే టీవీ సీరియళ్ల ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది హిమజ. ఆ తరువాత ఆమెకు బిగ్ బాస్ హౌస్ లో కి వెళ్లే అవకాశం వచ్చింది. ఇక్కడే ఆమె అసలు రూపం బయటపడింది. హిమజ అంటే అప్పటి వరకు సాఫ్ట్ కార్నర్ అని అనుకున్నారు.

Himaja: సినీ రంగంలో స్పెషల్ గా నిలవాలంటే ఈరోజుల్లో చాలా సినిమాల్లో నటించాల్సిన పనిలేదు. మిగతా వారికంటే భిన్నంగా ఉంటే చాలు.. సినీ జనాలకు ఆసక్తి కలుగుతుంది. ఇండస్ట్రీలో కొందరు అందరిలా కామన్ గా ఉండకుండా ప్రత్యేకంగా ఉంటూ తమకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంటారు. తన మాటలు, చేష్టలతో డేరింగ్ అండ్ డాషింగ్ గర్ల్ అని పేరు తెచ్చుకున్నారు హిమజ. టీవీ తెరపై కొన్ని సిరియళ్ల ద్వారా కనిపించిన హిమజ ఆ తరువాత వెండితెరపై కూడా మెరిశారు. కానీ ఈమెకు స్టార్ హీరోయిన్ రేంజ్ లో పాపులారిటీ ఉండడం విశేషం. అందుకు కారణం మిగతా వారికంటే ఆమె భిన్నంగా ఉండడమే. కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరమైన ఆమె ఇప్పుడు లేటేస్టుగా ఓ ఆనకొండతో సయ్యాటలాడుతూ కనిపించింది.
స్వయంవరం, కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం.. అనే టీవీ సీరియళ్ల ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది హిమజ. ఆ తరువాత ఆమెకు బిగ్ బాస్ హౌస్ లో కి వెళ్లే అవకాశం వచ్చింది. ఇక్కడే ఆమె అసలు రూపం బయటపడింది. హిమజ అంటే అప్పటి వరకు సాఫ్ట్ కార్నర్ అని అనుకున్నారు. కానీ హౌస్ లో ఆమె ప్రతీ విషయాన్ని ముక్కుసూటిగా మాట్లాడేస్తూ డేరింగ్ అండ్ డాషింగ్ గర్ల్ గా పేరు తెచ్చుకున్నారు. అప్పటి నుంచి హిమజ తో వాదించడానికి చాలా మంది ముందకు రావడం లేదు.
ఈ క్రమంలో ఆమెకు కొన్ని సినిమాల్లోనూ అవకాశం వచ్చింది. త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన అ,ఆ సినిమాలో ఆమె కామెడీ నటన విపరీతంగా ఆకట్టుకుంటుంది. అలాగే చాలా సినిమాల్లో నటించిన హిమజ కరోనా సమయంలో గర్భవతి అయిన విషయం తెలిసిందే. ఈ సమాచారాన్ని ఆమే ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేది. తాను గర్భవతిగా ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి అందరినీ ఆకర్షించేది. ఆ తరువాత పండండి బిడ్డకు జన్మనిచ్చింది హిమజ.
బిడ్డను కనే సమయంలో అమెరికాలోనే ఉంది హిమజ. ప్రస్తుతం న్యూయార్క్ వీధుల్లో ఎంజాయ్ చేస్తూ కనిపించింది. అయితే ఓ చోట గోధుమ రంగులో ఉన్న ఆనకొండను మెడలో వేసుకొని కనిపించింది. సాధారణంగా పామును చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది. కానీ ఈమె తన మెడలో వేసుకొని దానితో సయ్యాటలు ఆడడం చూసి అంతా షాక్ అవుతున్నారు. హిమజ డేరింగ్ అండ్ డాషింగ్ గర్ల అనడానికి ఇదికదా నిదర్శనం అని కొనియాడుతున్నారు.
