Megastar Chiranjeevi: ‘ఊరికే అయిపోతారా మెగాస్టార్’..ఓ నిర్మాత కామెంట్స్…
సినిమా ఇండస్ట్రీలో AVM ప్రొడక్షన్ గురించి తెలియని వారుండరు. ఈ బ్యానర్ నుంచి దాదాపు 300కు పైగా సినిమాలు వచ్చాయి. 1970ల్లోనే చిత్ర సీమలో అడుగుపెట్టి పలు చిత్రాలను తీసింది

Megastar Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి జరిగే సంఘటనలు ఎమోషనల్ తెప్పిస్తాయి. కొందరు నటులు చేసే చిన్న సాయంతో కొన్ని సంస్థలు, ఆ సంస్థలను నమ్మకున్న చాలా మంది జీవితాలు మారిపోతాయి. అలనాటి నటులు తమ సినిమాలు హిట్టు, ఫట్టుతో సంబంధం లేకుండా అడిగిన ప్రతీవారితో చేసేవారు. ముఖ్యంగా కొందరు నిర్మాతలు స్టార్ హీరోల వద్దకు వెళ్లి సినిమా చేయమని అడిగితే కాదనకుండా వారి అవసరాన్నిఅర్థం చేసుకుని వెంటనే ఒప్పేసుకునేవారు. అలా మెగాస్టార్ చిరంజీవి వద్దకు కొందరు వచ్చి సినిమా చేయమని అడిగితే కాదనలేకపోయారు. అయితే వారు అప్పటికే తీవ్రంగా నష్టపోయారు. అందులోనూ వారితో సినిమా తీస్తే సక్సెస్ అవుతుందున్న నమ్మకం లేదు. కానీ వాళ్లు ప్రత్యేకంగా మెగాస్టార్ ను రిక్వెస్ట్ చేయడంతో వారి అభ్యర్థనను అర్థం చేసుకొని నటించారు. అలా చిరంజీవి ఒప్పుకున్న ఆ సినిమా బ్లాక్ బస్టరయింది. అంతేకాదు ఆ నిర్మాణ సంస్థకు లాభాలు తెచ్చిపెట్టింది. ఇంతకీ ఆ స్టోరీ ఎంటో చూద్దామా..
సినిమా ఇండస్ట్రీలో AVM ప్రొడక్షన్ గురించి తెలియని వారుండరు. ఈ బ్యానర్ నుంచి దాదాపు 300కు పైగా సినిమాలు వచ్చాయి. 1970ల్లోనే చిత్ర సీమలో అడుగుపెట్టి పలు చిత్రాలను తీసింది. అయితే దీని వ్యవస్థాపకుడు A.V.మెయ్యప్పన్ దురదృష్టవశాత్తూ 1979లో మరణించారు. అయితే తన వారసత్వాన్ని కుమారులు కొనసాగించాలని అనుకున్నారు. కానీ వారికి అలా కలిసి రాలేదు. ఇలా సంవత్సరం పాటు ఈ బ్యానర్ నుంచి సినిమాలు రాలేదు. అయితే A.V.మెయ్యప్పన్ సంవత్సరీకం సందర్భంగా ఓ సినిమా తీయాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా ఆయన కుమారులు మెగాస్టార్ చిరంజీవిని కలిసి సినిమా తీయాలని అడిగారు. అయితే అప్పటికే చిరంజీవి పలు చిత్రాలతో బిజీగా ఉండడంతో పాటు అప్పుడే పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. దీంతో కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకొని ఆ తరువాత సినిమాల్లో నటించాలని అనుకున్నాడు. కానీ A.V.మెయ్యప్పన్ కుమారులు అడగగా వారి అభ్యర్థనను కాదనలేకపోయారు. ఎందుకంటే వారు తమ తండ్రి ఆశయాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో AVM బ్యానర్ పై సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు.
ఈ పరిస్థితిని బాగా అర్థం చేసుకున్న చిరంజీవి వెంటనే ఒప్పేసుకున్నారు. అలా వారి కాంబినేషన్లో వచ్చిన మూవీ ‘పున్నమి నాగు’. ఆసక్తికర విషయమేంటంటే ఈ టైటిల్ ను మెగాస్టార్ చిరంజీవినే సూచించాడు. దీనికి వారు కూడా ఓకే చెప్పడం మరో విశేషం. అప్పటి వరకు తీవ్ర నష్టాల్లో ఉన్న AVM కు పున్నమి నాగు లాభాలను తెచ్చిపెట్టింది. ఈ సందర్భంగా సినిమా విజయోత్సవ ఫంక్షన్లో AVM కుమారుల్లో ఒకరైన అరుణ గుహన్ మాట్లాడుతూ చిరంజీవి గారు ఎంతో బిజీ ఉన్నప్పటికీ తమ కోసం ఈ సినిమా చేసినందుకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు. అంతేకాకుండా ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘ఊరికే అయిపోతారా మెగాస్టార్’లు అని కొనియాడారు.
