Chandrababu and Jagan’s jail life : నాడు జగన్, నేడు చంద్రబాబు జైల్లో ఎలా ఉన్నారంటే?
ఇక జైల్లో జగన్ ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా నవ్వుతూ ఉండగా.. తనను అన్యాయంగా ఇరికించారని చంద్రబాబు ఆవేదన, కంటనీరు పెట్టుకుంటున్నట్టు సమాచారం.

Chandrababu and Jagan’s jail life : ఇప్పుడు నేతలు అన్నాక జైలుకు వెళ్లాలి. జైలు నుంచి బయటకు రావాలి. తర్వాత ప్రజల్లో సానుభూతి పొంది సీఎం కావాలి. అప్పుడే వారికి విలువ. ఇప్పటికే ఇలా జైలుకు వెళ్లివచ్చిన జగన్ ఏకంగా ప్రజాదరణ పొంది సీఎం అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు సైతం వ్యూహాత్మకంగా జగన్ జైలుకు పంపగానే వెళ్లిపోయారు. మొదట్లో బెయిల్ పిటీషన్ వేయలేదు. సానుభూతి వచ్చాక కోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకుందామని ప్లాన్ చేశాడు. కానీ జగన్ పట్టుదలతో పాత కేసులన్నీ తవ్వి మరీ చంద్రబాబుపై మోపి ఆయన జైలు నుంచి బయటకు రాకుండా పకడ్బందీగా ప్లాన్ చేశారు. తాజాగా కోర్టుల్లోనూ చంద్రబాబుకు చుక్కెదురైంది. క్వాష్ పిటీషన్ కొట్టుడుపోయింది. రెండు రోజుల కస్టడీ కూడా విధించి బాబుకు షాకిచ్చింది. నిజానికి చంద్రబాబు, జగన్ ల కేసులు చూస్తే ఇదంతా పగలు ప్రతీకారంతోనే నడుస్తున్నాయని అర్థమవుతోంది. నాడు జగన్ ను కాంగ్రెస్ తో కలిసి చంద్రబాబు జైలుకు పంపితే.. నేడు అధికారంలోకి వచ్చాక చంద్రబాబు పాలన అవినీతిని తవ్వి జగన్ జైలుకు పంపాడు. సో ఈ ప్రతీకార రాజకీయంలో తప్పు ఒప్పులను పక్కనపెట్టి వీరిద్దరూ జైలు పాలు కావడానికి ఆ అధికార దాహమే కారణం అయ్యింది. మరి ఈ ఇద్దరి జైలు జీవితం ఎలా గడిచిందన్నది ఒక్కసారి తరిచి చూస్తే..
-జగన్ 16 నెలల జైలు జీవితం ఎలా గడిచింది.?
వైఎస్ఆర్ చనిపోయాక ఆయన మరణంతో గుండెపోటుతో మృతిచెందిన అభిమానులను ఓదార్చాలని జగన్ నిర్ణయించాడు. కాంగ్రెస్ అధిష్టానం వద్దంటున్నా ప్రజల్లోకి వెళ్లాడు. సీఎం పీఠాన్ని జగన్ కు ఇవ్వకుండా రోశయ్యను సీఎం చేశారు. దీంతో జగన్ ఏకు మేకుగా అవుతాడని ముందుగా కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ రావుతో హైకోర్టుకు లేఖ రాయించారు. సుమోటాగా జగన్ అక్రమాస్తుల కేసును బయటపెట్టి అరెస్ట్ చేశారు. ధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) రాజకీయ కుట్రలో జగన్ ఈ అక్రమాస్తుల కేసులో జైలుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. జగన్ మరియు ఇతరులపై ఛార్జ్ షీట్లు దాఖలు చేసిన సిబిఐ, క్విడ్ ప్రోకో ఒప్పందాల ప్రకారం తన వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలు మరియు వ్యక్తులకు అనుకూలంగా వ్యవహరించడానికి తన తండ్రి వైఎస్ఆర్ తో కలిసి నేరపూరిత కుట్రకు జగన్ పాల్పడ్డారని అభియోగాలు మోపింది.అనేక సందర్భాల్లో జగన్‌కు బెయిల్ మంజూరు చేసేందుకు కోర్టులు నిరాకరించాయి. 2010లో కాంగ్రెస్ కు, పదవులకు రాజీనామా చేసిన జగన్, విజయమ్మతో కలిసి ‘వైఎస్ఆర్ కాంగ్రెస్’ను ఏర్పాటు చేశారు. 2012లో అవినీతి అక్రమాస్తుల కేసులతో కలిపి మొత్తం 31 కేసుల్లో జగన్ ఏ1 ముద్దాయిగా అరెస్ట్ చేసి 16 నెలలు జైలు జీవితం గడిపారు. అప్పట్లో వీఐపీ ఖైదీల్లో జగన్ ఖైదీ నంబర్ 6093. హైదరాబాద్ లోని చంచల్ గూడ జైల్లో శిక్షను జగన్ అనుభవించాడు. వీఐపీ ఖైదీల్లోకెల్లా ఈయన బిజీగా ఉండేవారట.. ఇక చంద్రబాబు అంత లగ్జరీ కాదు కానీ.. జైల్లోని భోజనమే తినేవారు. ఈ దోమల బాధలు జగన్ అనుభవించారు. వీఐపీ ఖైదీగా సపరేట్ రూం, పేపర్లు చదువుకోవడాలు.. సాదాసీదా సౌకర్యాలతోనే 16 నెలలు ఉన్నాడు..
-చంద్రబాబు జైలు జీవితం
ఏపీ స్కిల్ డెవెలప్‌మెంట్ స్కామ్ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఏపీ సీఐటీ అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు బాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే కోర్టు ఆదేశాలతో ఆయనకు జైలులో స్పెషల్ క్లాస్ కేటగిరీ వసతులు కల్పించారు. జైలులో చంద్రబాబుకు రిమాండ్ ఖైదీగా 7691 నంబర్ కేటాయించారు. చంద్రబాబు వయస్సు.. అనారోగ్యం దృష్ట్యా ఇంటి నుంచి భోజనం తెప్పించుకునేందుకు కోర్టు స్పెషల్ పర్మిషన్ ఇచ్చింది. దీంతో రాజమండ్రి రూరల్ సీనియర్ టీడీపీ నాయకుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇంటి నుంచి చంద్రబాబుకు భోజనం పంపిస్తున్నారు. నారా భువనేశ్వరి అక్కడే ఉండి భర్త చంద్రబాబు కోసం రోజూ భోజనం వండి తీసుకెళుతోంది.. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే ఇంటి నుంచే చంద్రబాబుకు భోజనాన్ని తీసుకెళ్తున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు తొలిరోజు అల్పాహారంగా ఫ్రూట్ సలాడ్ ఇచ్చారు. అల్పాహారం తర్వాత తాగేందుకు వేడినీళ్లు, బ్లాక్ కాఫీ తీసుకెళ్లారు. ఇక మధ్యాహ్నం భోజనంలోకి బ్రౌన్ రైస్, బెండకాయ వేపుడు, పన్నీరు కూర, పెరుగును ఇంటి నుంచి తయారు చేసి చంద్రబాబు కోసం పంపించారు. మధ్యాహ్నం కాఫీ తాగేందుకు వేడి నీటిని కుటుంబ సభ్యులు పంపించారు. రాత్రికి చపాతీలు, పుల్కాలు, ఫ్రూట్ జ్యూస్ తీసుకెళ్లారు.
ఓవరాల్ గా జగన్ జైల్లో కల్పించే వసతులను వినియోగించుకున్నారు. వీఐపీ ఖైదీల్లో జైల్లో పెట్టినవే తిన్నారు. లభించిన వాటితోనే సర్దుకున్నారు. కానీ చంద్రబాబుకు బయట నుంచి నచ్చిన భోజనం.. ఇతర సౌకర్యాలు కల్పించారు. కానీ దోమల బెడదతోనే చంద్రబాబు బాగా సతమతమవుతున్నాడట.. ఇక జైల్లో జగన్ ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా నవ్వుతూ ఉండగా.. తనను అన్యాయంగా ఇరికించారని చంద్రబాబు ఆవేదన, కంటనీరు పెట్టుకుంటున్నట్టు సమాచారం.
