Gadwal Private Hospital: వీడి దుంపతెగ.. తలపగిలి ఆసుపత్రికి వస్తే ఫెవిక్విక్ పూశారు.. వైరల్ వీడియో
ఐజ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కొడుకు ఆడుకుంటుండగా కిందపడ్డాడు. అతడి తలకు తీవ్రంగా గాయమైంది. రక్తస్రావం కూడా జరిగింది. దీంతో కంగారుపడిన సదరు వ్యక్తి తన కొడుకుని రెయిన్ బో అనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు.

Gadwal Private Hospital: ఏదైనా ప్రమాదం జరిగి గాయమైతే, రక్తస్రావం తీవ్రంగా జరిగితే మనం ఎక్కడికి వెళ్తాం? కచ్చితంగా ఆసుపత్రికే కదా! అక్కడ మన ఆరోగ్య పరిస్థితి చూసి డాక్టర్ కుట్లు, సూది మందు వేస్తాడు. నాలుగు మంది పిల్లలు రాసిచ్చి వాడమంటాడు. కానీ జోగులాంబ గద్వాల జిల్లా ఐజ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి మాత్రం కొత్తరకం వైద్య విధానాన్ని ప్రవేశపెట్టింది.
ఫెవిక్విక్ పూశారు
ఐజ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కొడుకు ఆడుకుంటుండగా కిందపడ్డాడు. అతడి తలకు తీవ్రంగా గాయమైంది. రక్తస్రావం కూడా జరిగింది. దీంతో కంగారుపడిన సదరు వ్యక్తి తన కొడుకుని రెయిన్ బో అనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరీక్షించిన డాక్టర్ గాయానికి కుట్లు వేశాడు. అప్పటికి ఆసుపత్రిలో కరెంటు పోయింది. సెల్ టార్చ్ లైట్ ద్వారానే ఆ బాలుడికి ఆసుపత్రిలో కుట్లు వేశారు. కుట్లు వేసిన తర్వాత గాయం త్వరగా మానేందుకు బయోసిన్ అనే ఔషధం పూయాలని ఆ బాలుడి తండ్రి అక్కడి వైద్య సిబ్బందికి చెప్పాడు. కానీ వారు అతని మాటలు లెక్కపెట్టలేదు. బయోసిన్ కు బదులు ఆ గాయానికి ఫెవిక్విక్ పూశారు. దీంతో ఆ బాలుడు మంటతో ఇబ్బంది పడ్డాడు. బాలుడు కేకలు చూసి వచ్చిన అతడి తండ్రి అక్కడి దృశ్యం చూసి వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసాడు.
రోజు ఇలాగే చేస్తారట
అయితే దీనిపై ఆ బాలుడి తండ్రి వైద్య సిబ్బందిని నిలదీశాడు. డాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.. ఇలానేనా వైద్యం చేసేది అంటూ ప్రశ్నించాడు. అక్కడ వైద్యుడు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం విశేషం. ఈ క్రమంలో ఆ బాలుడు తండ్రి అక్కడి ఆసుపత్రిలో తనకు ఎదురైన పరిస్థితులను ఒక సెల్ఫీ వీడియో ద్వారా చిత్రీకరించి జిల్లా వైద్యాధికారులకు పంపించాడు.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. అన్నట్టు గాయాల మీద ఫెవిక్విక్ పోస్తే అది సెప్టిక్ గా మారుతుందని వైద్యాధికారులు అంటున్నారు.
View this post on Instagram
