Malli Pelli : ‘మళ్ళీ పెళ్లి’ కి సీక్వెల్ అట..నరేష్ పిచ్చి పరాకాష్ట కి చేరింది గా!

మరో పక్క ఈ వార్త విని నరేష్ కి పిచ్చి పరాకాష్ట కి పోయినట్టు ఉంది, ఇండస్ట్రీ లో మంచి డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్స్ లో ఒకరైన నరేష్ చివరికి ఇలా అయిపోవడం బాధాకరం అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

  • Written By: Vicky
  • Published On:
Malli Pelli : ‘మళ్ళీ పెళ్లి’ కి సీక్వెల్ అట..నరేష్ పిచ్చి పరాకాష్ట కి చేరింది గా!

Malli Pelli : గత కొంత కాలం నుండి మీడియా లో ట్రెండింగ్ అవుతున్న టాపిక్ నరేష్ పవిత్ర ప్రేమ వ్యవహారం. ఈ ముదురు జంట మీద సోషల్ మీడియా లో ఎన్ని ట్రోల్ల్స్ వచ్చినా పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ ముందుకు పోతున్నారు. నరేష్ అయితే తమపై వస్తున్న నెగటివిటీ ని కమర్షియల్ గా వాడుకొని ‘మళ్ళీ పెళ్లి’ అనే సినిమా తీసాడు. రీసెంట్ గానే విడుదలైన ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

వాళ్ళు చెప్పిన కథ నిజమో కాదో పక్కన పెడితే, సినిమాని చక్కటి ఎమోషన్స్ తో ప్రతీ ఒక్కరు ఒకసారి చూసే విధంగా డైరెక్టర్ MS రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మొదటి రోజు ఓపెనింగ్ పర్వాలేదు అనే రేంజ్ లో వచ్చినప్పటికీ రెండవ రోజు వసూళ్లు మాత్రం బాగా పడిపోయాయి. అయితే ఈ చిత్రం థియేట్రికల్ గా వసూళ్లను రాబట్టిన , రాబట్టకపోయిన నరేష్ కి నిర్మాతగా వచ్చే నష్టం ఏమీ లేదు.

ఎందుకంటే ఆయన డిజిటల్ + సాటిలైట్ రైట్స్ ద్వారా ఈ చిత్రానికి నరేష్ పెట్టిన బడ్జెట్ మొత్తం రికవర్ అయిపోయింది. థియేటర్ నుండి వచ్చేది మొత్తం బోనస్ అన్నమాట.ఇలాంటి సినిమాలను జనాలు థియేటర్స్ లో ఆదరించకపోయినా, ఓటీటీ లో మాత్రం ఎగబడి చూస్తారు. ఇది క్యాష్ చేసుకునేందుకు నరేష్ త్వరలోనే ఈ చిత్రానికి సీక్వెల్ తియ్యబోతున్నాడట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు.

మొదటి భాగం లో నరేష్ పవిత్ర ఎలా కలిశారు, నరేష్ మూడవ భార్య రమ్య తో వచ్చిన సమస్యలు ఏమిటి అనే దాని పై చూపించారు. ఇప్పుడు రెండవ భాగం లో ఏమి చూపించబోతున్నారు అనేది తెలియాలి. రెండవ భాగానికి కూడా MS రాజు దర్శకత్వం వహించబోతున్నట్టు సమాచారం. మరో పక్క ఈ వార్త విని నరేష్ కి పిచ్చి పరాకాష్ట కి పోయినట్టు ఉంది, ఇండస్ట్రీ లో మంచి డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్స్ లో ఒకరైన నరేష్ చివరికి ఇలా అయిపోవడం బాధాకరం అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Read Today's Latest Entertainment News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు