World Longest Kiss: ముద్దు పెట్టుకోవడానికి ప్రేమికులు సిద్ధపడుతుంటారు. ఇద్దరు ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తం చేసేందుకు అనువైన మార్గం ముద్దే. దీంతో ముద్దు పెట్టుకోవడానికి వారు నిరంతరం ప్రయత్నిస్తుంటారు. ముద్దు ప్రేమకు చిహ్నం. ముద్దు మీద ఎన్నో పాటలు కూడా ఉన్నాయి. ముద్దును వర్ణించడం కవులకు ఎంతో ఇష్టం. అందుకే ముద్దు మీద ఎన్నో పాటలు ఉన్న సంగతి విధితమే. మొదటి సారి ముద్దు పెడితే ఎలాగుంటది అని అన్నారో సినీకవి. ముద్దు పెట్టుకోవడానికి భర్త అయితే ప్రేమ ఒకలా ఉంటుంది. కొడుకు అయితే మరోలా వ్యక్తం చేయాలి.

World Longest Kiss
థాయిలాండ్ లోని పట్టాయాలో జరిగిన సంఘటన అందరిలో ఆశ్చర్యం కలిగించింది. ఓ జంట ఏకంగా 58 గంటల పాటు ముద్దు పెట్టుకుని సంచలనం కలిగించారు. ఎవరు చేయని పనిని వారు సుసాధ్యం చేశారు. ఏకంగా 58 గంటల పాటు హత్తుకుని ముద్దు పెట్టుకుని అందరికి ఉత్సాహం రేపారు. ఒకసారి హత్తకున్న తరువాత అలాగే ఉండిపోయారు. పోటీ పడిన వారందరు మధ్యలోనే నిష్ర్కమించి వెళ్లిపోయారు. దీంతో ఆ జంట చూపిన ఉత్సాహం అందరికి ఉత్తేజం నింపింది.
కచాయ్, లక్సన అనే జంట ముద్దు పెట్టుకోవడంలో రికార్డు సృష్టించారు. పోటీలో పాల్గొన్న వారు మధ్యలోనే కాదని వెళ్లిపోయినా వారు మాత్రం చివరి దాకా ముద్దు పెట్టుకుని ప్రపంచ రికార్డు క్రియేట్ చేశారు. ముద్దు పెట్టుకోవడంలో గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. 2013లో జరిగిన పోటీ అయినా దాని వీడియో ఇప్పుడు వైరల్ కావడం గమనార్హం. దీంతో ముద్దు పెట్టుకోవడంలో ఆ జంట చేసిన ట్రెండ్ ఇప్పటికి అందరిలో ఎంతో ఉల్లాసం కల్పించింది.

World Longest Kiss
లిప్ టు లిప్ కిస్ పెట్టుకోవడం వారికి ఎంతో మజా కలిగించింది. ప్రేయసి ప్రియులు ముద్దు పెట్టుకోవడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తుంటారు. ఇక్కడ ఈ జంట మాత్రం తమ అన్ని గంటలు ముద్దు పెట్టుకుని చరిత్ర సృష్టించారు. పాత దృశ్యాలే అయినా వారు చేసిన సాహసం ఎంతో కొత్తదనంగా అనిపించింది. ఈ నేపథ్యంలో ముద్దు పెట్టుకోవడంలో వారు చేసిన వండర్ ఎంతో ముచ్చటేసింది. ఈ జంట చేసిన హంగామా నూతన చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఇద్దరు పెదాలు కలుపుకుని విడిపోకుండా కంటిన్యూగా ఉండటంతో విజేతలుగా మారారు.