MI Vs LSG 2023 Eliminator: కోహ్లీతో ఫైట్.. నవీన్ ఉల్ హక్ ను ‘మామిడిపండ్ల’తో కొట్టిన ముంబై ఆటగాళ్లు

ముంబై ఆటగాళ్లు షేర్ చేసిన ఈ ఫోటోలో ముగ్గురు ప్లేయర్లు ఒక టేబుల్ వద్ద కూర్చున్నారు. వీరిలో సందీప్, విష్ణు వినోద్ తోపాటు మరో ఆటగాడు ఉన్నారు. టేబుల్ పై మూడు మామిడి పండ్లను పెట్టి..

  • Written By: BS Naidu
  • Published On:
MI Vs LSG 2023 Eliminator: కోహ్లీతో ఫైట్.. నవీన్ ఉల్ హక్ ను ‘మామిడిపండ్ల’తో కొట్టిన ముంబై ఆటగాళ్లు

MI Vs LSG 2023 Eliminator: లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ అనంతరం స్వీట్ మ్యాంగోస్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. స్వీట్ సీజన్ ఆఫ్ మ్యాంగోస్ అంటూ ముంబై ప్లేయర్స్ సందీప్, విష్ణు వినోద్ ఒక ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఇది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతోంది. ఈ ఫోటోను లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయర్ నవీన్ ఉల్ హక్ కు కౌంటర్ గా పోస్ట్ చేసినట్టు నెటిజన్లు చెప్పుకుంటున్నారు.

ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు సందీప్, విష్ణు వినోద్ షేర్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. స్వీట్ మ్యాంగోస్ అనే హ్యాష్ టాగ్ తో ఒక ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. దీన్ని లక్నో ప్లేయర్ నవీన్ ఉల్ హక్ కు కౌంటర్ గా పోస్ట్ చేసినట్లు భావిస్తున్నారు. ఎందుకంటే గతంలో కోహ్లీతో గొడవ జరిగినప్పుడు నవీన్ ఉల్ హక్ ఆర్సిబి బాగా ఆడినప్పుడల్లా.. స్వీట్ మ్యాంగోస్ అంటూ ఇన్ స్టాలో స్టోరీస్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబై ఆటగాళ్లు పెట్టిన ఈ ఫోటో ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. కోహ్లీని ఆ విధంగా అన్నందుకు ప్రతిగానే ముంబై ఆటగాళ్లు ఈ పోస్ట్ చేశారని అంతా భావిస్తున్నారు. స్వీట్ మ్యాంగోస్ పేరుతో హక్ లో పెట్టిన పోస్ట్ కు కౌంటర్ గానే ముంబై ఆటగాళ్లు ఇప్పుడు మామిడి పండ్లతో రివెంజ్ తీర్చుకున్నట్లు పలువురు చెబుతున్నారు.

ఈ ఫోటోలో ఏముందంటే..?

ముంబై ఆటగాళ్లు షేర్ చేసిన ఈ ఫోటోలో ముగ్గురు ప్లేయర్లు ఒక టేబుల్ వద్ద కూర్చున్నారు. వీరిలో సందీప్, విష్ణు వినోద్ తోపాటు మరో ఆటగాడు ఉన్నారు. టేబుల్ పై మూడు మామిడి పండ్లను పెట్టి.. ఒకరు కళ్ళు మూసుకుని, మరొకరు నోరు మూసుకుని, ఇంకొకరు చెవులు మూసుకుని ఉన్నట్లు ఒక ఫోటోను షేర్ చేశారు. అంటే చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడు వినొద్దు అనే రీతిలో ఈ ఫోటో కనిపిస్తోంది. అయితే, ఈ ఫోటోకు పెట్టిన హ్యాష్ ట్యాగ్ మాత్రం భిన్నంగా ఉండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. స్వీట్ మ్యాంగోస్ హ్యష్ ట్యాగ్ పేరుతో ఇది ట్రెండ్ అవుతోంది. ఈ హ్యాష్ ట్యాగ్ ఎందుకు ఇచ్చారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

పెద్ద ఎత్తున షేర్ చేస్తున్న అభిమానులు..

ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ పై పలు ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు. ఈ సీజన్ లో మంచి మామిడి పండ్లు తినండి అంటూ కొంత మంది చెబుతుండగా, నవీన్ ఉల్ హక్ కు మ్యాంగో ఇవ్వండి అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ముందు మామిడి పళ్ళు పెట్టుకొని తినకుండా ఏం చేస్తున్నారంటూ మరి కొంతమంది వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ముంబై ప్లేయర్స్ పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారడం గమనార్హం.

సంబంధిత వార్తలు