Uttar Pradesh: శోభనం గదిలోనే కన్నుమూసిన కొత్తజంట.. షాకింగ్ కు కారణమేంటంటే?
ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ సంఘటన కలకలం రేపింది. ఇటీవల రెండు కుటుంబాలు బంధం ఏర్పరుచుకున్నాయి. ఈ కుటుంబాలకు చెందిన ఇద్దరు వ్యక్తులకు పెళ్లి చేశారు. అతిథులు, చుట్టాలను పిలిచి పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించారు.

Uttar Pradesh: కొన్ని బంధాలను చూస్తే ఆసక్తికరంగా ఉంటుంది.. ఒకరి కోసం ఒకరు పుట్టినట్లుగా అనిపిస్తుంది.. కలిసి జీవించిన వాళ్లు.. కలిసే మరణిస్తారు.. స్నేహితులు, భార్య భర్తలు, అన్నాచెల్లెళ్లు.. ఇలా కొన్ని బంధాలు ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోతారు. ఒకరు మరణిస్తే.. వారిపై అభిమానం ఉన్నవాళ్లు వెంటనే ఈ లోకాన్ని విడిచి వెళ్తుంటారు.. అయితే కొత్తగా పెళ్లయిన ఓ జంట కలిసి మరణించడం చర్చనీయాంశంగా మారింది. వందేళ్ల జీవితం కొనసాగించేందుకు బంధువులు, స్నేహితుల మధ్య ఎంతో వైభవంగా వివాహం జరుపుకున్న ఆ జంట కలకాలం వర్దిల్లాలని పెళ్లికి వచ్చిన ప్రతీ ఒక్కరూ ఆశీర్వదించారు. కానీ వారి ఆశీర్వాదం ఫలించలేదు. వందేళ్లు కాదు కదా.. ఒక్కరోజు కూడా కలిసి ఉండలేకపోయారు.. అసలేం జరిగింది?
ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ సంఘటన కలకలం రేపింది. ఇటీవల రెండు కుటుంబాలు బంధం ఏర్పరుచుకున్నాయి. ఈ కుటుంబాలకు చెందిన ఇద్దరు వ్యక్తులకు పెళ్లి చేశారు. అతిథులు, చుట్టాలను పిలిచి పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించారు. పెళ్లికూతురు, పెళ్లికొడుకు సైతం వేడుకలో సంతోషంగా కనిపించారు. దీంతో వారి కొత్త జీవితంపై అందరూ ఆసక్తిగా చర్చించుకున్నారు. వారి భవిష్యత్ పై అంచనాలు వేసుకున్నారు.
కానీ అంతలోనే విషాదం. శోభనం గదిలోకి వెళ్లిన ఆ జంట తిరిగి రాలేదు. ఉత్తరప్రదేశ్ కు చెందిన బహ్రెచ్ జిల్లాలోని ఓ పట్టణంలో ఇటీవల ఓ పెళ్లి జరిగింది. ప్రతాప్ యాదవ్, పుష్పలు వధూ వరులు. పెళ్లి తంతు జరిగేంత వరకు వీరు సంతోషంగానే ఉన్నారు. అందరితో కలిసిమెలిసి ఉన్నారు. ఆనందంగా ఫొటోలకు ఫోజులిచ్చారు. పెళ్లి వేడుకు పూర్తి కాగానే ఆ తరువాత జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు సంతోషంగా గదిలోకి వెళ్లారు. అప్పటి వరకు ఉల్లాసంగా కనిపించిన ఆ జంట తెల్లారి ఎంతకీ బయటకు రాలేదు.
దీంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి డోర్లను కొట్టారు. ఆతరువాత పోలీసులను పిలిచి తలుపులు బద్దలు కొట్టారు. కానీ శోభనం పడకపై విగతజీవులుగా కనిపించారు. పెళ్లి కొడుకుతో పాటు పెళ్లికూతురూ మరణించింది. ఆ తరువాత పోస్టు మార్టం నిర్వహించిన తరువాత వీరిద్దరికి గుండెపోటు వచ్చిందని వైద్యులు తెలిపారు. అయితే ఇలా పెళ్లయిన మరుసటిరోజు ఒకరికి మరొకరు తోడు అన్నట్లుగా ఇద్దూ ఒకేసారి చనిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
