YS Viveka Case: వివేక హత్య కేసులో కొత్త ట్విస్ట్.. బయటపెట్టిన ‘సాక్షి’

వాస్తవానికి సీబీఐ స్వతంత్ర సంస్థ. అధికారంలో ఉన్న పార్టీకి వత్తాసు పలుకుతుందనే విమర్శలు ఉన్నాయి. ఇలా చూసుకున్నా.. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది వైసీపీనే. కానీ, సీబీఐ అధికారులు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మాటలు ఎందుకు వింటారనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.

  • Written By: SHAIK SADIQ
  • Published On:
YS Viveka Case: వివేక హత్య కేసులో కొత్త ట్విస్ట్.. బయటపెట్టిన ‘సాక్షి’

YS Viveka Case: హాలీవుడ్ సినిమా సస్పెన్స్ ను తలపిస్తున్న వివేకా హత్య కేసు విచారణలో మరో కొత్త కోణం వినిపిస్తోంది. తాజాగా వైసీపీ మానస పుత్రిక సాక్షిలో ఒక కథనాన్ని ప్రధానంగా ప్రచురించింది. సిబిఐ కేవలం ఐపిడిఆర్ మీదనే ఆధారపడి విచారణ నిర్వహించడంపై అభ్యంతరాలను వ్యక్తం చేసింది. వివేకా హత్య కేసు విచారణ ఎల్లో స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుందని ఓ కథనాన్ని వండి మార్చేసింది.

సిబిఐ విచారణ తెలంగాణకు బదిలీ అయిన తర్వాత వేగం పుంజుకుంది. వివేక హత్య కేసులో అసలు నిందితులను త్వరగా తేల్చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పలువురిని అరెస్టు చేసింది. వీరిలో వైయస్ భాస్కర్ రెడ్డి కూడా ఉండడం సంచలనంగా మారింది. వైయస్ అవినాష్ రెడ్డి ని కూడా అరెస్టు చేస్తే కేసు కొలిక్కి వస్తుందని భావిస్తుంది. ఈ క్రమంలో సిబిఐ అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. కోర్టు అరెస్టు చేయలేమని తాము చెప్పలేమని తేల్చేసిన.. అవినాష్ రెడ్డి అరెస్టు మాత్రం ఇప్పటికీ జరగలేదు. సీబీఐ ఏకపక్షంగా వ్యవహరిస్తుందంటూ అవినాష్ రెడ్డి చేస్తున్న ఆరోపణలకు వైసిపి వంతపడుతుంది.

వాస్తవానికి సీబీఐ స్వతంత్ర సంస్థ. అధికారంలో ఉన్న పార్టీకి వత్తాసు పలుకుతుందనే విమర్శలు ఉన్నాయి. ఇలా చూసుకున్నా.. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది వైసీపీనే. కానీ, సీబీఐ అధికారులు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మాటలు ఎందుకు వింటారనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. గత టీడీపీ ప్రభుత్వంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నది. అప్పుడు కూడా కోర్టుల చుట్టూ తిరిగేందుకు అధికార పార్టీ చేసిన పన్నాగాలే కారణమని వైసీపీ ఆరోపించింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చినా, ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీదే చెల్లుబాటవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

సంక్లిష్టంగా మారిన వివేకా హత్య కేసు విచారణలో సీబీఐ అధికారులు గూగుల్ టేకోవర్, ఐపీడీఆర్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఙానాన్ని వాడుకుంటుంది. దీనిద్వారా అప్పుడు జరిగిన సంఘటనల ఇతివృత్తాలను సేకరించి, సమాచారాన్ని క్రోడీకరించి సీబీఐ ముందుకు వెళ్తుంది. దీనికి రాజకీయ రంగు పులుమేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తుంది. అవినాష్ రెడ్డి చుట్టూనే కేసును తిప్పకుండా, టీడీపీ నేతలు బీటెక్ రవి, వివేకా తనయురాలు సునీత ఫోన్ కాల్ రికార్డులను కూడా పరిశీలించాలని సాక్షి పత్రిక రాసుకొచ్చింది. జర్నలిజం విలువల గురించి మాట్లాడే సాక్షి పత్రిక కీలకమైన వివేకా హత్య కేసులో అభిప్రాయాన్ని వెలిబుచ్చుతూ కథనం రాయడంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Tags

    follow us