Artificial Intelligence: ఏఐ..మార్కెట్ అస్థిరత కారణంగా 83 మిలియన్ ఉద్యోగాలకు కోత..
వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలిపిన ప్రకారం వచ్చే ఐదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 14మిలియన్ల ఉద్యోగాలు ఊడుతాయని పేర్కొంది. ఇదే సమయంలో 69 మిలియన్ల కొత్త ఉద్యోగాలు సృష్టించబడుతాయని తెలిపింది.

Artificial Intelligence: ఓవైపు ప్రపంచం ఆర్థిక మాంద్యంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతోంది.. మరో వైపు కృత్రిమమేధ రోజురోజకు విస్తరిస్తోంది.. ఈ కారణంగా రానున్న కాలంలో ఉద్యోగాలు మరింత కొత పడే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే చాలా కంపెనీలో ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ) మాలంగా చాలా మంది రోడ్డున పడ్డారు. లేటేస్టుగా దిగ్గజ ఐటీ సంస్థ ఐబీఎం సీఈవో అరవింద్ మాట్లాడుతూ సుమారు 7,800 ఉద్యోగాలను ఏఐతో భర్తీ చేయొచ్చని సంచలన కామెంట్స్ చేశారు. ఈ తరుణంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం తాజాగా సంచలన నివేదిక బయటపెట్టింది. 2027 నాటికి 83 మిలియన్ల ఉద్యోగాలు కోతపడే అవకాశం ఉందని తెలిపింది.
వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలిపిన ప్రకారం వచ్చే ఐదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 14మిలియన్ల ఉద్యోగాలు ఊడుతాయని పేర్కొంది. ఇదే సమయంలో 69 మిలియన్ల కొత్త ఉద్యోగాలు సృష్టించబడుతాయని తెలిపింది. డబ్లూఈఎఫ్ నిర్వహించిన ఈ సర్వేలో 800 కంపెనీలను తీసుకుంది. ఈ కంపెనీలను పరిశీలించిన తరువాత వాటి ఆర్థిక వ్యవస్థ బలహీనత, ఏఐ కోసం ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది.
ప్రపంచ ఆర్థిక వేదిక అయిన స్విట్జర్లాండ్ లోని దావోస్ లో గ్లోబర్ లీడర్ల వార్షిక సమావేశాన్ని నిర్వహిస్తారు. తాజాగా నిర్వహించిన సమావేశంలో ఈ నివేదికను బయటపెటట్ారు. 2027 నాటికి ప్రస్తుత ఉన్న ఉపాధిలో 2 శాతం కోత విధిస్తారని తెలిపింది. లేబర్ మార్కెట్ అంశాలు, మార్కెట్ అస్థిరత కారణాలు ఉద్యోగాలు పోవడానికి కారణంగా మారుతాయి. అలాగే కృత్రిమ మేధస్సు అమలు ఉద్యోగుల మెడపై కత్తిలాగా మారింది. ఏఐ సాధనాల అమలు, నిర్వహణలో కంపెనీలు ఆసక్తి చూపుతుండడం ఉద్యోగాలను ఆందోళనకు గురి చేస్తోంది.
అయితే కొన్ని కంపెనీలు మాత్రం మెషీన్ మార్కెట్లో పరిస్థితి ఎలా ఉన్నా మానవ వనరునుల నియమించుకోవడానికి ఇంట్రెస్టు పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఈ కారణంగా ఐదేళ్లలో 30 శాతం ఉపాధి సృష్టించబడుతుందని చెబుతున్నారు. కృత్రిమ మేధ అన్ని సమయాల్లో ఉపయోగపడే అవకాశం లేదని భావిస్తున్నారు. అయితే ఏఐ యజమానులుగా మారితే మాత్రం మానవ వినియోగం తక్కువే అంటున్నారు.
ఈ దశాబ్దం ప్రారంభంలో ఆటోమేషన్ క్రమంగా పురోగమిస్తోంది. ప్రస్తుత వ్యాపార సంబంధిత పనులన్నింటిలో 34 శాతం ఇదే ఉంది. ఇది 2020 నాటి కంటే ఎక్కువే అని డబ్లూఈఎఫ్ ద్వారా తెలుస్తోంది. ఇది 2025 నాటికి 47 శాతం పెరగుతుంది. ఆ తరువాత 2027 నాటికి 42 శాతం పెరిగే ఛాన్స్ ఉందని ఫోరం తెలుపుతోంది. ఇప్పుడంతా పూర్తిగా డిజిటలైజేషన్ కావడంతో ఏఐ విలువ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
