హైదరాబాద్ పరిధిలో మందుబాబులకు కీలక సూచన

డ్రంకెన్ డ్రైవ్. ఇప్పుడు ఈ పేరు చెబితేనే అందరూ హడలి చస్తున్నారు. ఈరోజుల్లో తాగడం కామన్. తాగి ఇంటికి వెళ్లాల్సిందే. అయితే మధ్యలో డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు చేస్తూ ప్రయాణికులు, ప్రజలకు పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో మందుకొట్టి వాహనాలను నడుపుతూ పట్టుబడుతున్న వారి సంఖ్య వేలల్లో ఉంటోంది. ఎందుకంటే హైదరాబాద్ లో సాయంత్రం నుంచే డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు పెరిగిపోతున్నాయి. పోలీసులు పదే పదే తనిఖీలు చేస్తూ ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయాలు […]

  • Written By: NARESH
  • Published On:
హైదరాబాద్ పరిధిలో మందుబాబులకు కీలక సూచన

డ్రంకెన్ డ్రైవ్. ఇప్పుడు ఈ పేరు చెబితేనే అందరూ హడలి చస్తున్నారు. ఈరోజుల్లో తాగడం కామన్. తాగి ఇంటికి వెళ్లాల్సిందే. అయితే మధ్యలో డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు చేస్తూ ప్రయాణికులు, ప్రజలకు పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు.

అయితే ఇటీవల కాలంలో మందుకొట్టి వాహనాలను నడుపుతూ పట్టుబడుతున్న వారి సంఖ్య వేలల్లో ఉంటోంది. ఎందుకంటే హైదరాబాద్ లో సాయంత్రం నుంచే డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు పెరిగిపోతున్నాయి. పోలీసులు పదే పదే తనిఖీలు చేస్తూ ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయాలు కలిగిస్తున్నారు. ఈ విషయంలో తమ ఇబ్బందుల గురించి వాహనదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువవవెత్తాయి.

వాహనదారుల ఇబ్బందులపై ఉన్నతాధికారులు స్పందించారు. రాత్రి 9 గంటలలోపు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించేందుకు సరైన సమయం కాదని భావించిన ట్రాఫిక్ విభాగం 7 తర్వాత ఎక్కడెక్కడ డ్రైవ్ లను జరిపారన్న విషయాన్ని ఆరాతీశారు.

కొంతమంది ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహంతో ఈ పనిచేసి ఉంటారని భావిస్తూ రాత్రి 9.30 గంటల తరువాతనే పరీక్షలు చేయాలని గురువారం ఆదేశాలు జారీ చేశారు.

మందుబాబులు కూడా 10 గంటల తరువాతనే రోడ్లపైకి వస్తారన్న అంచనాతోనే అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో రాత్రి 9.30 తరువాతే డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలను నిర్వహించాలని ఆదేశించామని ఉన్నతాధికారులు వెల్లడించాయి.

Read Today's Latest Most popular News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు