Dil Raju On Shaakuntalam: దిల్ రాజుకు భారీ దెబ్బ… శాకుంతలంతో ఎన్ని కోట్లు నష్టమంటే?
Dil Raju On Shaakuntalam: బలగం మూవీ ఇచ్చిన సంతోషాన్ని శాకుంతలం దూరం చేసింది. నిర్మాత దిల్ రాజుకు భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. శాకుంతలం పరాజయం నేపథ్యంలో దిల్ రాజుకు పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లినట్లు వార్తలు వస్తున్నాయి. శాకుంతలం చిత్ర బడ్జెట్ దాదాపు రూ. 50 కోట్లు. ఇతర ఖర్చులతో కలిపి రూ. 60 కోట్ల వరకు పెట్టారు. శాకుంతలం డిజిటల్ రైట్స్ రూ. 25 కోట్లకు అమ్మినట్లు సమాచారం. శాటిలైట్ రైట్స్ అలానే ఉన్నాయట. […]


Dil Raju On Shaakuntalam
Dil Raju On Shaakuntalam: బలగం మూవీ ఇచ్చిన సంతోషాన్ని శాకుంతలం దూరం చేసింది. నిర్మాత దిల్ రాజుకు భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. శాకుంతలం పరాజయం నేపథ్యంలో దిల్ రాజుకు పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లినట్లు వార్తలు వస్తున్నాయి. శాకుంతలం చిత్ర బడ్జెట్ దాదాపు రూ. 50 కోట్లు. ఇతర ఖర్చులతో కలిపి రూ. 60 కోట్ల వరకు పెట్టారు. శాకుంతలం డిజిటల్ రైట్స్ రూ. 25 కోట్లకు అమ్మినట్లు సమాచారం. శాటిలైట్ రైట్స్ అలానే ఉన్నాయట. దిల్ రాజు రూ. 15 కోట్లు డిమాండ్ చేయగా ఎవరూ ముందుకు రాలేదట. ఇప్పుడు అందులో నాలుగోవంతుకు కూడా కొనే పరిస్థితి లేదు.
ఇక శాకుంతలం చిత్రాన్ని దిల్ రాజు దాదాపు అన్ని ఏరియాల్లో సొంతగా విడుదల చేశారు. ఫస్ట్ వీక్ ముగియగా కనీసం చిల్లర కూడా రాలేదు. కలెక్షన్స్ గురించి మాట్లాడుకోవడం అనవసరం. సమంత గత చిత్రం యశోదకు శాకుంతలం ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ఏ విధంగా చూసినా శాకుంతలం తో దిల్ రాజు రూ. 25 కోట్లకు పైనే నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ప్రకటన సమయంలో దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ లో లేరు.
గుణ టీం వర్క్స్ బ్యానర్ లో దర్శకుడు గుణశేఖర్ సొంతగా నిర్మించాలనుకున్నారు. ఆయన కూతురు నీలిమ గుణ నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. తర్వాత ఎందుకో దిల్ రాజును సీన్ లోకి తెచ్చారు. ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి దిల్ రాజును నిర్మాణ భాగస్వామిగా పరిచయం చేశారు. శాకుంతలం చిత్రాన్ని దిల్ రాజు, నీలిమ గుణ నిర్మాణ భాగస్వాములుగా ఉండి తెరకెక్కించారు. ఫలితం దారుణంగా వచ్చింది. ఒక వేళ గుణశేఖర్ సోలోగా ఈ సినిమా నిర్మించి ఉంటే కోలుకోలేని దెబ్బతినేవారు.

Shaakuntalam
ఇప్పుడు మేజర్ లాస్ దిల్ రాజు భరించినట్లు అయ్యింది. కాగా శకుంతల సబ్జెక్టు ఎవరికీ కలిసి రాదని అర్థమైపోయింది. గతంలో ఎన్టీఆర్, బాలయ్యలు చేసిన శకుంతల, బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రాలు ఘోర పరాజయం పొందాయి. ఆ లిస్ట్ లో శాకుంతలం చేరింది. సెంటిమెంట్ పక్కన పెడితే గుణశేఖర్ అవుట్ ఫుట్ దారుణంగా ఉందని ప్రేక్షకుల అభిప్రాయం. నాలుగు సెట్స్ వేసి నాసిరకం గ్రాఫిక్స్ తో జనాల ముఖాన కొట్టాడని విమర్శిస్తున్నారు.
