Hyderabad: అమ్మాయిలూ.. ఇల్లు అద్దెకు తీసుకుంటున్నారా? ఇలాంటి ఓనర్లు ఉంటారు జాగ్రత్త!!

చదువు, ఉద్యోగం చేయాలనుకునే యువతులు ఇల్లు వదిలి పట్టణాలు, నగరాలకు వస్తుంటారు. అయితే ఇక్కడి వారి కోసం చాలా మంది హాస్టళ్లు ఏర్పాటు చేసి వారికి షెల్డర్ ఇస్తుంటారు. కానీ వసతి గృహాల్లో సరైన భోజనం, ఇతర సౌకర్యాలు లేనందున ప్రత్యేకంగా గదిని అద్దెకు తీసుకొని ఉంటున్నారు. అద్దె గృహాల్లో సౌకర్యాలు ఉన్నా భద్రత కరువైందని తెలుస్తోంది. నెలనెలా వారికి అద్దెను కడుతున్నా.. యువతులకు మాత్రం రక్షణ ఉండడం లేదు. అయితే ఇలాంటి పరిణమాలు ఇతరుల నుంచి కాకుండా ఓనర్ల నుంచే ఎదురవడం ఆందోళన కలిగిస్తోంది.

  • Written By: Chai Muchhata
  • Published On:
Hyderabad: అమ్మాయిలూ.. ఇల్లు అద్దెకు తీసుకుంటున్నారా? ఇలాంటి ఓనర్లు ఉంటారు జాగ్రత్త!!

Hyderabad: నేటి మహిళాలోకం అన్ని రంగాల్లో రాణిస్తోంది. పురుషులతో సమానంగా పోటీపడుతూ లక్ష్యాన్ని చేరుతోంది. కానీ భద్రత విషయంలో మాత్రం ఇంకా ఆందోళనకరమైన విషయాలే వెలుగులోకి వస్తున్నాయి. అర్ధరాత్రి ఆడవాళ్లు ఒంటరిగా ఇంటికి చేరినప్పుడే స్వాతంత్ర్యం వచ్చినట్లు అని మహానుభావుడు గాంధీజీ కన్న కల ఇప్పటికీ నెరవేరడం లేదు. ఎక్కడికి వెళ్లినా యువతులు, మహిళలపై లైంగిక వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటివి మొన్నటి వరకు కార్యాలయాల్లో,బహిరంగ ప్రదేశాల్లోనే జరిగేవి. కానీ ఇప్పుడు నివాసగృహాల్లోనూ కొనసాగుతున్నారు. ముఖ్యంగా నగరాల్లో అద్దెకు ఉంటున్న అమ్మాయిల ఇంట్లో కొందరు రహస్య కెమెరాలు ఉంచుతూ వారికి సంబంధించిన ప్రైవేట్ వీడియోలను చిత్రీకరిస్తున్నారు. ఇలాంటి సంఘటన తాజాగా ఒకటి వెలుగులోకి వచ్చింది.

చదువు, ఉద్యోగం చేయాలనుకునే యువతులు ఇల్లు వదిలి పట్టణాలు, నగరాలకు వస్తుంటారు. అయితే ఇక్కడి వారి కోసం చాలా మంది హాస్టళ్లు ఏర్పాటు చేసి వారికి షెల్డర్ ఇస్తుంటారు. కానీ వసతి గృహాల్లో సరైన భోజనం, ఇతర సౌకర్యాలు లేనందున ప్రత్యేకంగా గదిని అద్దెకు తీసుకొని ఉంటున్నారు. అద్దె గృహాల్లో సౌకర్యాలు ఉన్నా భద్రత కరువైందని తెలుస్తోంది. నెలనెలా వారికి అద్దెను కడుతున్నా.. యువతులకు మాత్రం రక్షణ ఉండడం లేదు. అయితే ఇలాంటి పరిణమాలు ఇతరుల నుంచి కాకుండా ఓనర్ల నుంచే ఎదురవడం ఆందోళన కలిగిస్తోంది.

తాజాగా నగరంలోని జూబ్లీహిల్స్ సమీపంలో ఓ కాలనీలో ఐదు ప్లోర్లు కలిగిన ఓ భవనం ఉంది. ఇందులో ఓ గదిలో కొందరు యువతులు కలిసి అద్దెకు ఉంటున్నారు. అయితే కొన్ని రోజుల కిందట ఇద్దరు యువతులు, ఓ యువకుడు ఆ గదిలోకి వచ్చి కరెంట్ మీటర్ బాక్స్ పెట్టాలంటూ ఓ బాక్స్ ను పెట్టాడు. ఇది కరెంట్ హెచ్చు తగ్గులను నియంత్రిస్తుందని తెలిపాడు. ఆ యువతులు నిజమే కావొచ్చని ఒప్పుకున్నారు. కానీ కొన్ని రోజుల తరువాత ఆ గదిలో ఉంటున్న ఓ యువతికి బాక్స్ ను చూసే సరికి అనుమానం వచ్చింది. ఎందుకైనా మంచిదని తన సోదరుడిని తీసుకొచ్చి ఆ మీటర్ ను పరిశీలించింది.

అందులో ఓ రహస్య కెమెరా బయటపడింది. ఈ కెమెరా ఏదో కంప్యూటర్ కు కనెక్ట్ చేశారు. ఇక్కడ యువతులు చేసే పనులన్నీ ఆ కమెరా ద్వారా రికార్డు చేసినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులను సంప్రదించగా సలీం అనే యువకుడిని అరెస్టు చేశారు. ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించగా రెండు డీవీఆర్ లు లభించాయి. వాటిని పరిశీలించగా.. యువతులకు సంబంధించిన వీడియోలు బయటపడ్డాయి. వీటిని ఆధారం చేసుకొని సలీం అనే యువకుడిని అరెస్టు చేశారు.

అద్దెకు దిగుతున్న ఇంట్లో యువతులు జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఓనర్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న తరువాత అద్దెకు దిగాలని అంటున్నారు. ముఖ్యంగా అమ్మాయలు ఉంటున్న గదిలో కొందరు ఇలాంటి వాళ్లు వచ్చి గదిలో ఏదో పెడుతామంటే అస్సలు నమ్మవద్దని అంటున్నారు.అలాగే ప్రత్యేక ప్రదేశాల్లోఏమైనా రహస్య కెమెరాలు ఉన్నాయా? అనేది తెలుసుకోవాలని అంటున్నారు.

Read Today's Latest Viral news News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు