Coromandel Express Accident: రైలు ప్రమాదానికి కొద్ది నిమిషాల ముందు రైలులో షాకింగ్ ఘటన.. అది తెలిసి వణికిపోతున్నా జనాలు!
ప్రమాదం జరిగిన సమయంలో వెనుక ఉన్న బోగీలు ఒక్కసారిగా కుదుపుకు లోనయ్యాయి. సామగ్రి మొత్తం కిందపడిపోయాయి. ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడిపోయారు. ఏం జరిగిందని బయటకు చూస్తే ముందు ఉన్న బోగీలు నుజ్జునుజ్జయి కనిపించాయి.

Coromandel Express Accident: ఒడిశాలోని బాలాసోర్ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రైలు ప్రమాద తీరు నిపుణులను విస్మయానికి గురిచేస్తోంది. సాధారణంగా రైలు ఇంజిన్ పట్టాలు తప్పి కొంచెం పక్కకు వెళ్తేనే తిరిగి దాన్ని లైన్‌లోకి చేర్చేందుకు నానా తంటాలు పడతారు. 108 నుంచి 112.8 టన్నుల వరకూ బరువు ఉండే ఇంజిన్లను పట్టాలపై ఎక్కించడానికి భారీ క్రేన్ల సాయంతో గంటల తరబడి సిబ్బంది శ్రమిస్తారు. అంతటి భారీ బరువుండే రైలు ఇంజిన్.. అమాంతంగా దాదాపు 15 అడుగుల ఎత్తుకు ఎగసి గూడ్సుపైకి ఎక్కడం చూసి నిపుణులు షాక్ అవుతున్నారు.
130 కిలోమీటర్ల వేగం…
ప్రమాదానికి గురైన సమయంలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ వేగం దాదాపు 130 కిలోమీటర్లుగా ఉన్నట్టు సమాచారం. మెయిన్ లైన్ నుంచి లూప్‌లన్‌లోకి మళ్లించినప్పుడు దాని వేగం గణనీయంగా తగ్గుతుంది. కానీ కోరమాండల్ వేగం తగ్గలేదు. ప్రయాణికుల రైళ్లలో గరిష్టంగా 24 బోగీలు.. గూడ్సులో అయితే 40–58 వ్యాగన్లు ఉంటాయి. ఖాళీ వ్యాగ¯Œ 25–26 టన్నులు బరువు ఉంటే.. బొగ్గు, సిమెంటు వంటివి నింపితే మరో 54–60 టన్నుల అదనంగా ఉంటుంది. స్టేషనరీ సామాన్లతో ఉన్న గూడ్సును కోరమాండల్ రైలు ఢీకొట్టింది.
వెనుక బోగీల్లో కుదుపు..
ప్రమాదం జరిగిన సమయంలో వెనుక ఉన్న బోగీలు ఒక్కసారిగా కుదుపుకు లోనయ్యాయి. సామగ్రి మొత్తం కిందపడిపోయాయి. ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడిపోయారు. ఏం జరిగిందని బయటకు చూస్తే ముందు ఉన్న బోగీలు నుజ్జునుజ్జయి కనిపించాయి. కొన్ని బోగీల్లో సీట్లు కూడా కిందపడిపోయాయి. దీంతో ప్రమాదానికి గురికాకపోయినా బోగీల్లోని ప్రయాణికులు కూడా గాయపడ్డారు. ఒక్క కుదుపుతో రైలు ఆగిపోవడంతో అంతా భయంతో బయటకు పరుగులు తీశారు. సామగ్రి కూడా బోగీల్లోనే వదిలేశారు. బయటకు వచ్చి చూడగా ముందు బోగీల్లో ఆర్థనాదాలు వినిపించాయి. దట్టమైన పొగ కమ్మేసింది. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి. దీంతో ప్రయాణికులు భయంతో వణికిపోయారు. వెంటనే తమ బోగీల వద్దకు వెళ్లి ఏడుస్తూ కూర్చున్నారు. ఒకే లైన్‌లో మూడు రైళ్లు గుద్దుకున్నాయని వార్త తెలిసి వారిలో వణుకు మొదలైంది. ఇది తెలిసి రైళ్లో లేనివారు కూడా వణికిపోతున్నారు.
