Cricketers Artificial Intelligence: పురుష క్రికెటర్లకు స్త్రీ రూపం: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసిన మాయాజాలం

ప్రస్తుతం ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు తరఫున ఆడుతున్న శుభ్ మన్ గిల్ ను ఏఐ ఎక్స్ పర్ట్ షాహిద్ అందమైన అమ్మాయిగా మార్చేశాడు. పైగా గిల్ స్త్రీ రూపానికి శుభద్ర గిల్ అని పేరు పెట్టాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న టీం ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని ఏఐ సహాయంతో విద్యా కోహ్లీ ని చేసేశాడు.

  • Written By: Bhaskar
  • Published On:
Cricketers Artificial Intelligence: పురుష క్రికెటర్లకు స్త్రీ రూపం: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసిన మాయాజాలం

Cricketers Artificial Intelligence: సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. కొత్త కొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటున్నది. మొన్నటిదాకా మనకు ఏదైనా సమాచారం కావాలంటే గూగుల్ మీద ఆధారపడేవాళ్ళం.. కొత్తగా వచ్చిన చాట్ జిపిటి అంతకు మించిన సాలభ్యాలు మనకు ఇస్తున్నది. ఇది పూర్తి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడి పనిచేస్తుంది.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కృత్రిమ మేథ కాబట్టి మన మెదడు ఎలా అయితే ఆలోచిస్తుందో.. అలాంటి వాటిని మన కళ్ళ ముందు ఉంచుతుంది. అలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు మరింత కొత్త పుంతలు తొక్కుతోంది. మొన్నటిదాకా ఏదైనా అడిగితే ఇలా టక్కున చెప్పేసేది. ఇప్పుడు అంతకుమించి అనేలాగా కొత్త కొత్త ఫీచర్లతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.. మనం కలలో కూడా ఊహించని దానిని మన కళ్ళ ముందు ఉంచుతోంది.

కళ్ళ ముందు ఉంచేసింది

మనం మనుషులం కాబట్టి.. చిత్రవిచిత్రమైన సందేహాలు, అంతకుమించిన కోరికలు ఉంటాయి. మన దాంట్లో చాలామంది టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిని అభిమానిస్తారు. ఆరాధిస్తారు. అలాంటి ధోని ఒక ఆడపిల్లగా మారితే ఎలా ఉంటుంది? టీం ఇండియా చిచ్చరపిడుగు గిల్ అందమైన యువతి లాగా కనిపిస్తే ఆ అనుభూతి ఎలా ఉంటుంది? మిస్టర్ యాంగ్రీ యంగ్ మాన్ విరాట్ కోహ్లీ అచ్చం అనుష్క శర్మ లాగా తయారైతే మన ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఇదంతా చదువుతుంటే వీళ్ళకి ఏమైంది అని అనుకుంటున్నారా? మాకు ఏం కాలేదు. బేషుగ్గానే ఉన్నాం. కానీ ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్సే మన క్రికెటర్లను ఆడవాళ్లను చేసింది.

ఇలా మార్చేసింది

ప్రస్తుతం ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు తరఫున ఆడుతున్న శుభ్ మన్ గిల్ ను ఏఐ ఎక్స్ పర్ట్ షాహిద్ అందమైన అమ్మాయిగా మార్చేశాడు. పైగా గిల్ స్త్రీ రూపానికి శుభద్ర గిల్ అని పేరు పెట్టాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న టీం ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని ఏఐ సహాయంతో విద్యా కోహ్లీ ని చేసేశాడు. పైగా ఆ రూపానికి విద్యా కోహ్లీ అని పేరు పెట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిని కూడా ఏఐ సహాయంతో అమ్మాయిగా రూపొందించాడు. ఆ రూపానికి మహి సింగ్ ధోని అని పేరు పెట్టాడు.

హార్థిక్ పాండ్యా ఏకంగా..

ఇక గుజరాత్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ఏఐ సహాయంతో నీలి కలువగా మార్చేశాడు. ఆ రూపానికి హర్షాలి పాండ్యా అని పేరు పెట్టాడు. ఇక టీమిండియా ఒకప్పటి ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ స్త్రీ రూపం అయితే కళ్ళు జిగేల్ మనిపించేలా ఉంది. అతగాడి ఓర చూపు ఈ చిత్రంలో పూర్తిగా ప్రతిబింబించింది. ఇక యువరాజ్ సింగ్ స్త్రీ రూపానికి యువరాణి సింగ్ అని పెట్టడం విశేషం. ప్రస్తుత టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఐపీఎల్ లో ముంబై జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అతని మహిళా రూపం భలే అందంగా ఉంది. ఇక అతడి స్త్రీ రూపానికి రోహిణి శర్మ అని పేరు పెట్టాడు.

అమాయకమైన చూపులతో గౌతమ్ గంభీర్

టీం ఇండియా ఆల్ రౌండర్ ప్లేయర్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కీలక ఆటగాడు రవీంద్ర జడేజా స్త్రీ రూపంలో భలే అందంగా ఉన్నాడు. ఏఐ లో అతడి స్త్రీ రూపానికి రవీనా జడేజా అనే పేరు పెట్టాడు. పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్టు ఆటగాడు శిఖర్ ధావన్ ఏఐ ద్వారా రూపొందించిన స్త్రీ అవతారంలో కొత్తగా ఉన్నాడు. ఈ విధానం ద్వారా రూపొందించిన అతడి స్త్రీ రూపానికి శిఖా ధావన్ అని పేరు పెట్టాడు. ఇక టీమ్ ఇండియా ఒకప్పటి లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్, ఐపీఎల్ లక్నో జట్టు మెంటర్ గౌతమ్ గంభీర్ ఏఐ ద్వారా రూపొందించిన స్త్రీ రూపంలో అమాయకంగా కనిపించాడు. అతడి చూపు నిర్మలత్వానికి ప్రతీకగా ఉంది. ఇక అతడి పేరు గౌతమి గంభీర్ గా నామకరణం చేశాడు.. ఇలా చెప్పుకుంటూపోతే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ ద్వారా చేస్తున్న అద్భుతాలకు ఒక లిమిట్ అంటూ ఉండదు.

 

Read Today's Latest Sports news News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు