Tom Cruise: హాలీవుడ్ లో సాహసాలకు కేంద్ర బిందువు గా మారిన హీరో ఎవరు అంటే మన అందరికి టక్కుమని గుర్తుకు వచ్చే పేరు టామ్ క్రూజ్..ఈ హాలీవుడ్ యాక్షన్ హీరో చేసే రిస్కీ స్తంట్స్ మరియు ప్రాణాలకు తెగించి చేసిన ఎన్నో యాక్షన్ సినిమాలు చూస్తే మన రోమాలు నిక్కపొడుచుకుంటాయి..ఈయన చేసే డేంజర్ స్తంట్స్ ప్రపంచం లో ఎవ్వరు చెయ్యలేరు అని అనడం లో ఎలాంటి సందేహం లేదు..ప్రస్తుతం ఆయన వయస్సు 60 ఏళ్ళు..ఇటీవల ఆయన హీరో గా నటించిన ‘టాప్ గాన్ మావెరిక్’ చిత్రం ఎంత పెద్ద సెన్సషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికి తెలిసిందే..ఈ చిత్రం ఇప్పటికి హైదరాబాద్ వంటి మెట్రోపాలిటన్ సిటీస్ లో ఆడుతూనే ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా ఎంత పెద్ద సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అనేది..ఈ చిత్రం టామ్ క్రూజ్ చేసిన సాహసోపేతమైన యాక్షన్ సన్నివేశాలు చూస్తే ఆశ్చర్యపోక తప్పదు..60 ఏళ్ళ వయస్సు లో కూడా ఇలాంటి సాహసాలు చెయ్యడం ఎవరి వల్ల కాదు ఒక్క టామ్ క్రూజ్ కి తప్ప.

Tom Cruise
ఎల్లపుడు అనితర సాధ్యమైనటువంటి సాహసాలు చేసి తనకు తానే సాటి అని నిరూపించుకున్న టామ్ క్రూజ్..ఇప్పుడు ప్రపంచం సైంటిస్టులు తప్ప ఎవ్వరు చెయ్యలేని మరో సాహసం చెయ్యబోతున్నాడు..ఇక అసలు విషయానికి వస్తే టామ్ క్రూజ్ తన తదుపరి చిత్రాన్ని ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు డగ్ లీమన్ తో ఒక సినిమా చేయనున్నాడు..ఈ చిత్రం షూటింగ్ భూమి మీద కాదు..అంతరిక్షం లో జరగబోతుందట..ఇప్పటి వరుకు అంతరిక్షం కాళ్ళు మోపిన వాళ్ళు సైంటిస్ట్ లు మాత్రమే.

Tom Cruise
కానీ మొట్టమొదటి సారిగా ఒక సినిమా షూటింగ్ కోసం అంతరిక్షం లోకి అడుగుపెట్టబోతున్న ఏకైక హీరో తమ్ క్రూజ్ మాత్రమేనట..ఈ చిత్రానికి సుమారు 200 మిలియన్ డాలర్లు బడ్జెట్ ఖర్చు చేయనున్నారట..అందులో కేవలం టామ్ క్రూజ్ పారితోషికమే 60 మిలియన్ డాలర్లు ఉంటుందట..అంతే కాకుండా ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ లోనే తెరకెక్కిస్తారట..నాసా కేంద్రం మరియు ఎలాన్ మస్క్ ఈ సినిమాని స్వయంగా నిర్మిస్తున్నారు..ప్రేక్షకులకు ఎప్పుడు థ్రిల్ ఫీలింగ్ ఇవ్వాలని చూసే టామ్ క్రూజ్, ఈ సినిమాతో ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తాడో చూడాలి.