The D’Cruz Family: 12 మంది తోబుట్టువులు. అందరూ బతికే ఉన్నారు. పెద్దవాడికి ఇప్పుడు 113 ఏళ్లు, గిన్నిస్ లో చోటు
ఇక్కడ మనం చూస్తే ఓ కుటుంబంలో తోబుట్టువులు 12 మంది ఇంకా జీవించే ఉన్నారు. అందులో పెద్ద వాడికి 113 ఏళ్లు. చిన్న వాడికి 93 ఏళ్లు. వారి ఆరోగ్యాన్ని చూస్తే అందరికి షాకే. ఈ వయసులో కూడా వారు ముచ్చటగా నడుస్తున్నారు. ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. అందరు జీవించి ఉండటం కూడా ఒక అరుదైన రికార్డే. ఇప్పుడు వీరి కుటుంబం ఆ ఘనతను సాధించడం విశేషం.

The D’Cruz Family: ఆరోగ్యమే మహాభాగ్యం. మన దేహం ఆరోగ్యంగా ఉంటే ఏదీ అవసరం లేదు. మన ఆరోగ్యమే మనకు శ్రీరామరక్ష. పూర్వం రోజుల్లో మన పెద్దవారు వందేళ్లు బతికారని చెబుతుంటారు. కాలక్రమంలో మనిషి సగటు ఆయుర్దాయం కుంచించుకుపోతోంది. దీనికి మన ఆహార అలవాట్లే కారణం. సరైన విధంగా మనం ఆహారం తీసుకుంటే మన శరీరం దాదాపు 150 ఏళ్లు బతుకుతుందట. కానీ మనం మాత్రం మన శరీరానికి అలుపు అనేదే లేకుండా పనులు కల్పించి కొద్ది సంవత్సరాల్లోనే మూలపడేలా చేస్తున్నాం.
పాతికేళ్లకే..
దీంతో 150 ఏళ్లు ఉండాల్సిన శరీరం కనీసం యాభై ఏళ్లు కూడా ఉండటం లేదు. పాతికేళ్లకే మధుమేహం, రక్తపోటు, గుండెపోటు, థైరాయిడ్ వంటి సమస్యలతో సతమతమవుతున్నాం. ఫలితంగా మన దేహం జబ్బులకు నిలయంగా మారుతోంది. సరిగా కాపాడుకుంటే మన శరీరం బతికే కాలం కూడా ఎక్కువగానే ఉంటుంది. విచ్చలవిడి తిండితో మనకు రోగాలు కూడా అలాగే వస్తన్నాయి.
12 మంది తోబుట్టువులు
ఇక్కడ మనం చూస్తే ఓ కుటుంబంలో తోబుట్టువులు 12 మంది ఇంకా జీవించే ఉన్నారు. అందులో పెద్ద వాడికి 113 ఏళ్లు. చిన్న వాడికి 93 ఏళ్లు. వారి ఆరోగ్యాన్ని చూస్తే అందరికి షాకే. ఈ వయసులో కూడా వారు ముచ్చటగా నడుస్తున్నారు. ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. అందరు జీవించి ఉండటం కూడా ఒక అరుదైన రికార్డే. ఇప్పుడు వీరి కుటుంబం ఆ ఘనతను సాధించడం విశేషం.
వారి ఆరోగ్య రహస్యమేంటో?
ఆ కుటుంబం జన్యువులు బాగా ఉన్నాయని అర్థమవుతుంది. ఒకే కుటుంబంలో అంత మంది జీవించి ఉండి అది కూడా ఆరోగ్యంగా ఉండటమే ఆశ్చర్యకరం. ఇప్పుడు వారి కుటుంబ సభ్యులు వారికి సన్మానం కూడా చేశారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇన్నేళ్లయినా వారి ఆరోగ్యం నిలకడగా ఉండటానికి కారణాలు ఏమై ఉంటాయనే ఆసక్తి అందరిలో కలుగుతోంది.
ప్రస్తుత కాలంలో..
ప్రస్తుత కాలంలో కూడా వారి జీవనం ఇంత ముచ్చట గొలుపుతోంది. ఏకంగా 12 మంది వందేళ్లు దాటే వరకు జీవించడం నిజంగా గొప్ప విషయమే. మనిషి ఆయుర్దాయం యాభై ఏళ్లకు పడిపోయిన నేపథ్యంలో వారు ఇన్నేళ్లు ఆరోగ్యంగా ఉండటంతో వారి ఆరోగ్య రహస్యం ఏమై ఉంటుందనే వాదనలు వస్తున్నాయి. ఏదిఏమైనా అందరు వారిలా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు.
