Pentagon Explosion: కృత్రిమ మేధ ప్రమాద ఘంటికలు… ఈసారి అమెరికా స్టాక్ మార్కెట్లో మోగాయి
ఇప్పుడు ప్రపంచాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక ఊపు ఊపేస్తోంది. మనకు తెలియని ఊహాలోకాన్ని మన కళ్ళ ముందు ఉంచి మాయ చేస్తోంది. జరగనివి జరిగినట్టు, చిత్ర విచిత్రమైన భ్రమలకు గురిచేస్తోంది.

Pentagon Explosion: పెంటగాన్.. అమెరికా రక్షణ కోట. అమెరికాకు సంబంధించి పోలీసు నుంచి ఇతర రక్షణ విభాగాలు అన్నీ కూడా ఈ ప్రాంతంలో కేంద్రీకృతం అయి ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే దీనిని అమెరికా అమ్ముల పొది అని చెప్పవచ్చు. అలాంటి పెంటగాన్ లో పేలుడు జరిగితే ఎలా ఉంటుంది? మొన్ననే కదా అమెరికా చైనా నిఘా బెలూన్ పంపింది..దీనిపై అమెరికా గాయి గాయి చేసింది. మరి అలాంటి అమెరికాకు గుండెకాయ లాంటి పెంటగాన్ లో పేలుడు జరిగితే ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు కదా! కానీ అంతటి పెంటగాన్ లో పేలుడు జరిగితే ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కొద్దిసేపటి వరకు క్రాష్ అయ్యాయి. కానీ అంతలోనే అసలు విషయం తెలిసి నోరు వెళ్లబెట్టడం అందరివంతయింది. ఇంతకీ ఏం జరిగిందో మీరూ చదివేయండి.
కృత్రిమ మేధ మాయాజాలం
ఇప్పుడు ప్రపంచాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక ఊపు ఊపేస్తోంది. మనకు తెలియని ఊహాలోకాన్ని మన కళ్ళ ముందు ఉంచి మాయ చేస్తోంది. జరగనివి జరిగినట్టు, చిత్ర విచిత్రమైన భ్రమలకు గురిచేస్తోంది. అంతేకాదు కంప్యూటర్ మన జీవితంలోకి ప్రవేశించిన తొలినాళ్లలో ఎలాంటి మార్పులు అయితే చవి చూసామో.. ఇప్పటి సాంకేతిక కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అంతకుమించి అనేలాగా మార్పులకు అవుతున్నాం.. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అమెరికా రక్షణకు గుండెకాయ లాంటి పెంటగాన్ లో పేలుడు జరిగిందని కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. అది నిజమో కాదో అని నిర్ధారణ చేసుకోకుండా కొన్ని మీడియా సంస్థలు దాన్ని ప్రచారం చేయడంతో ప్రపంచమంతా ఒక్కసారిగా షేక్ అయిపోయింది. దీంతో స్టాక్ మార్కెట్ లు షేక్ అయ్యాయి.. తర్వాత అసలు నిజం తెలిసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అసలు విషయం తెలిసింది ఇలా
అయితే చాలామంది పెంటగాన్ లో పేలుడు జరిగిందంటే మొదట నమ్మారు. తర్వాత దాని మూలం తెలుసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తే వారికి అప్పుడు అసలు విషయం తెలిసింది. ఇది కృత్రిమ మేథ ద్వారా రూపొందించిన చిత్రమని తెలిసింది. పెంటగాన్ రక్షణ అధికారులు కూడా ఎటువంటి పేలుడు జరగలేదని దృవీకరించడంతో మార్కెట్లో మళ్లీ యధావిధిగా పని చేయడం ప్రారంభించాయి. ఈ పేలుడుకు సంబంధించి వార్తలు దావనం లాగా వ్యాపించడంతో అర్లింగ్టన్, వర్జినియా ప్రాంతాల నుంచి అగ్నిమాపక బృందాలు కూడా వచ్చాయి.
ట్రంప్ అరెస్ట్ అయ్యాడు
పైగా ఆ పేలుడుకు సంబంధించిన ఫోటోలు మాత్రమే కాకుండా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ అరెస్టు కావడం, పోప్ ఫ్రాన్సిస్ పఫర్ జాకెట్ లో ఉన్న ఫోటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి.. అయితే పెంటగాన్ లో పేలుడు సంభవించిన ఫోటోలను “ఏఈపీ” కనుగొన్నది. ఇది “క్యూ ఏఎన్ఓఎన్” అనే ట్విట్టర్ ఖాతా నుంచి వచ్చినట్టు గుర్తించింది. ఈ ఖాతా నిర్వాహకులు గతంలో కూడా ఇలాంటి తరహా ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి తప్పుడు సమాచార వ్యాప్తికి కారణమయ్యారు. అయితే ఎమర్జింగ్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎటువంటి ఫోటోషాప్, ప్రోగ్రామ్స్ అవసరం లేకుండానే కొన్ని క్షణాల్లో నమ్మదగిన చిత్రాలను రూపొందించవచ్చు.. అయితే వీటిపై ఎటువంటి అజ మాయిషి లేకపోవడంతో ఇష్టారాజ్యంగా ఇటువంటి చిత్రాలను వదులుతున్నారు. ఇక పెంటగాన్ పేలుడుకు సంబంధించి విడుదలైన ఫోటోలు కొన్ని నిమిషాల పాటు స్టాక్ మార్కెట్లను హడలెత్తించాయి. కేవలం ఈ ఫోటోలు క్షణాల్లో స్టాక్ మార్కెట్ ను అంతకు ముందు రోజు ముగింపుతో పోలిస్తే 0.29% విలువ తగ్గడం విశేషం