Bihar Bridge Collapse: అందరూ చూస్తుండగానే కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జి.. బీజేపీ సర్కార్ పాలనకు ఇది అపఖ్యాతి

దేశంలో ఉన్న ప్రముఖ నదుల్లో గంగానది ఒకటి. బీహార్ రాష్ట్రంలో ఖగారియా, అగువాని ప్రాంతాల మధ్య ఖగారియా జిల్లాలో గంగానదిపై బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. దీనికి సుల్తాన్ గంజ్ అని పేరు పెట్టారు.

  • Written By: SS
  • Published On:
Bihar Bridge Collapse: అందరూ చూస్తుండగానే కుప్పకూలిన  కేబుల్ బ్రిడ్జి.. బీజేపీ సర్కార్ పాలనకు ఇది అపఖ్యాతి

Bihar Bridge Collapse: నదిపై నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి కూలిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. కానీ రెండు వైపులా ఏర్పాటు చేస్తున్న ఈ మార్గం ధ్వంసం కావడంతో భారీ నష్టమే జరిగింది. అయితే ఇలా బ్రిడ్జి కూలిపోవడం ఇదే మొదటిసారి కాదు.. గతంలోనూ ఇలాగే జరిగింది. దీంతో ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణాలపై ఎంత శ్రద్ధ వహిస్తుందో చూడండి.. అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. దీంతో ఆ రాష్ట్ర సీఎం విచారణకు ఆదేశించారు. ఇక ఈ బ్రిడ్జి కూలుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై చేస్తున్నా కామెంట్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే?

దేశంలో ఉన్న ప్రముఖ నదుల్లో గంగానది ఒకటి. బీహార్ రాష్ట్రంలో ఖగారియా, అగువాని ప్రాంతాల మధ్య ఖగారియా జిల్లాలో గంగానదిపై బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. దీనికి సుల్తాన్ గంజ్ అని పేరు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.1,717 కోట్లు కేటాయించింది. 2015లో ఈ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2020 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఐదేళ్లు పూర్తయినా బ్రిడ్జి నిర్మాణం కంప్లీట్ కాలేదు. పైగా ఇప్పటికీ రెండు సార్లు బ్రిడ్జి కూలిపోవడం చర్చనీయాంశంగా మారింది.

2023 ఏప్రిల్ నెలలో తుఫాను కారణంగా ఈ బ్రిడ్జికి సంబంధించిన పిల్లర్లు దెబ్బతిన్నాయి. ఇప్పుడు మారోసారి ఈ వంతెన మొత్తం నదిలో కూలిపోయింది. ఈ బ్రిడ్జి కూలిపోతుండగా.. కొందరు అక్కడే ఉన్నారు. వెంటనే ఆ దృశ్యాలను సెల్ ఫోన్లతో వీడియో తీశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో అది వైరల్ గా మారింది. మరో విషయమేంటంటే బిహార్ రాష్ట్రంలోనే బెగుసరాయ్ ప్రాంతంలో బుర్హిగండక్ నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జి ఇలాగే కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఓ కూలీ మరణించాడు.

కిషన్ గంజ్, సహర్సా జిల్లాలో కూడా రెండు వంతెనలు ప్రారంభానికి ముందే కూలిపోయాయి. ఇలా నిర్మాణంలో బ్రిడ్జిలు కూలిపోతుండడంపై ప్రజలు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నితిష్ ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ఈ సంఘటనలు జరుగుతున్నాయని కొందరు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో పాలన పక్కనబెట్టి ప్రతిపక్షాల ఐక్యత కోసం ముఖ్యమంత్రి దేశంలో తిరుగుతున్నారని విమర్శిస్తున్నారు. అయితే బ్రిడ్జి కూలిపోవడంపై తీవ్ర విమర్శలు రావడంతో నితీష్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

Read Today's Latest National politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు