Anasuya Bharadwaj: నాలో మార్పు మొదలైంది.. అనసూయ ఆసక్తికర వ్యాఖ్యలు
బుల్లితెర షో జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ, ఆ తర్వాత సినిమా అవకాశాలు పొంది తన కెరీర్ ని పరుగులు పెట్టిస్తుంది. ఈ క్రమంలో తాను ఎదిగిన బుల్లితెరను సైతం పక్కన పెట్టినట్లు తెలుస్తుంది.

Anasuya Bharadwaj: హాట్ బ్యూటీ అనసూయా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా లో పెడుతున్న పోస్టులు గమనిస్తే చాలా లోతైన భావాలు కనిపిస్తున్నాయి. వివాదాలు కావచ్చు, హాట్ హాట్ ఫోటోలు కావచ్చు, సినిమాలు కావచ్చు, టీవీ షో లు కావచ్చు, ఎప్పుడు కూడా ఏదో ఒక విధంగా మీడియా లో కనిపించే అనసూయ తాజాగా తాను పెట్టే పోస్టులు వలన హైలైట్ కావడం విశేషం.
బుల్లితెర షో జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ, ఆ తర్వాత సినిమా అవకాశాలు పొంది తన కెరీర్ ని పరుగులు పెట్టిస్తుంది. ఈ క్రమంలో తాను ఎదిగిన బుల్లితెరను సైతం పక్కన పెట్టినట్లు తెలుస్తుంది. గత కొద్ది నెలలుగా అనసూయ ఎక్కడ కూడా బుల్లితెర మీద కనిపించిన దాఖలాలు లేవని చెప్పాలి. తన ఫోకస్ పూర్తిగా సినిమాల మీద పెట్టినట్టు దీనిని బట్టి తెలుస్తుంది.
రీసెంట్ వచ్చి రీసెంట్ హిట్ గా నిలిచిన విమానం సినిమాలో మంచి పాత్ర పోషించిన అనసూయ వుల్ఫ్ సినిమాతో రాబోతుంది. ఇదిలా ఉంటే
తనలో మార్పులు వచ్చాయంటూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. గత కొద్ది రోజులుగా ఫ్యామిలీతో కలిసి విహార యాత్రలో ఉన్న అనసూయ అక్కడ దిగిన ఫోటోలు అప్లోడ్ చేస్తూ వాటికీ తగ్గట్టు పోస్టులు పెడుతుంది. తాజాగా అప్లోడ్ చేసిన ఫొటోస్ కి నువ్వు వెనుకకు వెళ్లి ప్రారంభాన్ని మార్చలేవు.. కానీ నువ్వు ఇప్పుడు నీ ముగింపును మార్చుకోవచ్చు.. అంటూ రాసుకొచ్చింది.
గతంలో సోషల్ మీడియా లో ఆంటీ అనే వివాదం, ది విజయ్ దేవరకొండ అనే వివాదాల్లో అనసూయ పేరు ఎక్కువగా వినిపించింది. రీసెంట్ గా వాటికీ ముంగిపు పలుకుతున్నట్లు హింట్ ఇచ్చింది అనసూయ. దీన్ని బట్టి చూస్తే… అనసూయ పై వచ్చిన వివాదాలను వెనక్కి వెళ్లి మార్చుకోలేదు.. కాబట్టి.. ఇప్పుడు అలాంటి వివాదాస్పద విషయాల్లో అనసూయ జోక్యం చేసుకోకుండా ఉండోచ్చు. అనే అర్ధం వచ్చేలా ఈ పోస్టు పెట్టిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
అదే విధంగా కేవలం ఈ ఒక్క విషయం లోనే కాదు, అందాల ఆరబోత విషయంలో కూడా అనసూయతో మార్పు వచ్చినట్లు నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఆమె ఈ మధ్య కాలంలో పోస్ట్ చేసిన ఫోటోలు గమనిస్తే కొంచెం గ్లామర్ డోస్ తగ్గించినట్లు కనిపిస్తుంది. బహుశా అనసూయ లో వచ్చిన మార్పులు ఇవే కావచ్చు.
View this post on Instagram
