Nagarjuna Sister Susheela: నాగార్జున చెల్లెలు పై క్రిమినల్ కేసు నమోదు!
నాగ సుశీల కొడుకు సుశాంత్ హీరోగా విడుదలైన కరెంట్, అడ్డా, కాళిదాసు చిత్రాల నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నారు.

Nagarjuna Sister Susheela: హీరో నాగార్జున చెల్లెలు నాగ సుశీల మీద కేసు నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి. చింతలపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి నాగ సుశీలతో పాటు ఆమె అనుచరులు మరొక 12 మంది మీద మోహినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చింతలపూడి శ్రీనివాస్-నాగ సుశీల మధ్య భూవివాదాలు నడుస్తుండగా తన అనుచరులతో దాడికి పాల్పడ్డారనేది ఆయన ఆరోపణ. శ్రీజ ప్రకృతి దర్శ పీఠం నిర్వాహకుడిగా చింతలపూడి శ్రీనివాస్ ఉన్నారు.
గతంలో నాగ సుశీల, చింతలపూడి శ్రీనివాస్ వ్యాపార భాగస్వాములుగా ఉన్నారు. శ్రీనాగ్ ప్రొడక్షన్స్, శ్రీనాగ్ కార్పొరేషన్స్ పేరుతో చిత్రాలు నిర్మించారు. నాగ సుశీల కొడుకు సుశాంత్ హీరోగా విడుదలైన కరెంట్, అడ్డా, కాళిదాసు చిత్రాల నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నారు. నాగ సుశీల, చింతలపూడి శ్రీనివాస్ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేసినట్లు సమాచారం.
కొన్నాళ్ల క్రితం వీరు విడిపోయారు. ఇద్దరి మధ్య వివాదాలు తలెత్తాయి. తనకు తెలియకుండా ఉమ్మడి ఆస్తులు అమ్మేశాడని నాగ సుశీల పార్ట్నర్ చింతలపూడి శ్రీనివాస్ పై 2017లో పంజాగుట్టా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నాగ సుశీల తనను బంధించి ఆస్తులు రాయించుకునే ప్రయత్నం చేసిందని చింతపూడి శ్రీనివాస్ ఆమె ఆరోపణలకు ప్రతిగా వాదించాడు.
ప్రధానంగా ఉమ్మడి ఆస్తుల విషయంలో ఒకప్పటి పార్ట్నర్స్ మధ్య ఏర్పడిన వివాదం అని తెలుస్తుంది. ఇక నాగ సుశీల కుమారుడు సుశాంత్ హీరోగా సక్సెస్ కాలేదు. ఈ మధ్య అతడు సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నాడు. అల వైకుంఠపురంలో, భోళా శంకర్ చిత్రాల్లో అతడు నటించాడు.
