Mahesh-Rajamouli Movie: 1500 కోట్ల రూపాయిల బడ్జెట్..ముగ్గురు బాలీవుడ్ బడా సూపర్ స్టార్స్..మహేష్- రాజమౌళి ప్రాజెక్ట్ పై అదిరిపోయే అప్డేట్!

హీరోయిన్ కూడా బాలీవుడ్ కి సంబంధించిన వాళ్ళే అని తెలుస్తుంది. యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాని సుమారుగా 1500 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నాడట. ఇది ఇండియా లో హైయెస్ట్ బడ్జెట్ గా చెప్పుకోవచ్చు. చూడాలి మరి ఈ సినిమాతో రాజమౌళి ఎలాంటి అద్భుతాలు సృష్టించబోతున్నాడు అనేది.

  • Written By: Vicky
  • Published On:
Mahesh-Rajamouli Movie: 1500 కోట్ల రూపాయిల బడ్జెట్..ముగ్గురు బాలీవుడ్ బడా సూపర్ స్టార్స్..మహేష్- రాజమౌళి ప్రాజెక్ట్ పై అదిరిపోయే అప్డేట్!

Mahesh-Rajamouli Movie: అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన కాంబినేషన్స్ చాలా అరుదుగా ఉంటాయి. ఈ కాంబినేషన్ లో సినిమా వచ్చిందంటే వెయ్యి రూపాయిలు టికెట్ పెట్టి పోవడానికి కూడా ఏమాత్రం వెనకాడరు. అలాంటి కాంబినేషన్స్ లో ఒకటి మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్. వీళ్లిద్దరి కలయిక ఒక సినిమా వస్తుందని పదేళ్ల క్రితమే తెలుసు, కానీ ఎవరి ప్రాజెక్ట్స్ తో వాళ్ళు బిజీ అవ్వడం వల్ల ఈ క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా పడుతూ వచ్చింది.

అయితే ఇప్పుడు బాహుబలి సిరీస్ మరియు #RRR చిత్రం ద్వారా రాజమౌళి పాన్ వరల్డ్ మార్కెట్ వచ్చింది. ఆయన సినిమాలు ఇక హాలీవుడ్ మూవీస్ తో పోటీ పడుతాయి. ఆ స్థాయికి చేరుకున్న సమయం లో మహేష్ తగిలాడు. స్టార్ డైరెక్టర్స్ మరియు టాక్ తో సంబంధం లేకుండా కళ్ళు చెదిరే కలెక్షన్స్ ని కొల్లగొట్టే మహేష్ బాబు, రాజమౌళి లాంటి డైరెక్టర్ తో జతకడితే బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలే అన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అందుకే ఈ ప్రాజెక్ట్ ని కనీవినీ ఎరుగని రేంజ్ లో తీర్చి దిద్దబోతున్నాడట రాజమౌళి. ఇటీవలే ఫ్యామిలీ తో కలిసి టూర్ కి వెళ్లి చిల్ అయిన రాజమౌళి , ఈ సినిమాకి సంబంధించిన వర్క్ షాప్ ని ఏర్పాటు చేసే పనిలో పడ్డాడట. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో ముగ్గురు బాలీవుడ్ బడా సూపర్ స్టార్స్ వివిధ పాత్రల్లో కనిపించబోతున్నట్టు సమాచారం. ఇది వరకే అమిర్ ఖాన్ పేరు మనకి బాగా వినిపించింది.దీనిపై ఇప్పటికీ ఎలాంటి స్పష్టత రాలేదు, కానీ ఈ సినిమాలో ముగ్గురు బాలీవుడ్ బడా సూపర్ స్టార్స్ అయితే కచ్చితంగా ఉన్నారట.

హీరోయిన్ కూడా బాలీవుడ్ కి సంబంధించిన వాళ్ళే అని తెలుస్తుంది. యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాని సుమారుగా 1500 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నాడట. ఇది ఇండియా లో హైయెస్ట్ బడ్జెట్ గా చెప్పుకోవచ్చు. చూడాలి మరి ఈ సినిమాతో రాజమౌళి ఎలాంటి అద్భుతాలు సృష్టించబోతున్నాడు అనేది.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు