Tollywood Box Office Collections: ప్రస్తుత ఓటీటీ యుగంలో ఒక సూపర్ హిట్ సినిమా వీకెండ్ దాటి మామూలు వర్కింగ్ డేస్ లో లాంగ్ రన్ ని సొంతం చేసుకోవడం అంటే అద్భుతం అనే చెప్పాలి. కానీ కొన్ని సినిమాలు మాత్రం 2 వ వారం లో కూడా భారీ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించాయి. అందులో రీసెంట్ గా విడుదలైన ‘పెద్ది’ చిత్రం కూడా ఉంది. ఈ సినిమాకు రెండవ వారం లో మంచి వసూళ్లే వచ్చాయి కానీ , ఊహించిన వసూళ్లు మాత్రం రాలేదు. 20 కోట్ల రూపాయలకు పైగానే షేర్ వసూళ్లు వస్తుందని ఆశించారు. కానీ తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి కేవలం 18 కోట్ల రూపాయిలు మాత్రమే నమోదైంది. అయితే ‘పెద్ది’ తో పాటు , రీసెంట్ గా విడుదలైన పాన్ ఇండియన్ సినిమాలకు మరియు సంక్రాంతి బ్లాక్ బస్టర్ చిత్రాలకు రెండవ వారం ఎంత షేర్ వసూళ్లు వచ్చాయి అనేది చూద్దాం.
ముందుగా మనం #RRR గురించి మాట్లాడుకోవాలి. ఈ చిత్రానికి 2 వ వారం లో తెలుగు రాష్ట్రాల నుండి 61 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఆ తర్వాతి స్థానం లో ‘బాహుబలి 2’ చిత్రం నిల్చింది. 7 ఏళ్ళ క్రితం విడుదలైన ఈ సినిమాకు 2 వ వారం లో తెలుగు రాష్ట్రాల నుండి 40 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ చిత్రానికి 35 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు నమోదు అవ్వగా, కల్కి చిత్రానికి 32 కోట్లు , సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి 28 కోట్లు , హనుమాన్ చిత్రానికి 27 కోట్లు , వాల్తేరు వీరయ్య చిత్రానికి 24 కోట్లు , మన శంకర వరప్రసాద్ గారు చిత్రానికి 22 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు నమోదు అయ్యాయి.
అదే విధంగా గత ఏడాది విడుదలైన ‘దేవర’ చిత్రానికి 19 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రెండవ వారం లో నమోదు అవ్వగా, ప్రభాస్ ‘సలార్’ చిత్రానికి 19 కోట్లు , పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రానికి 18 కోట్లు వచ్చాయి. ‘పెద్ది’ చిత్రానికి ఉన్నటువంటి ట్రెండ్ ని చూసి 20 కోట్ల రూపాయలకు పైగా కచ్చితంగా వస్తుందని అనుకున్నారు , ఆదిమవారం రోజున మంచి వసూళ్లు వచ్చాయి, శనివారం రోజున కాస్త వసూళ్లు తగ్గాయి, ఆ కారణం చేతనే ఈ చిత్రానికి 18 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు నమోదు అయ్యాయి. అంతే కాకుండా పైన చెప్పిన చిత్రాలన్నిటికీ ఫెస్టివల్ హాలిడేస్ బాగా కలిసొచ్చాయి , కానీ పెద్ది చిత్రానికి ఒక్క హాలిడే కూడా కలిసి రాలేదు , అందుకే ఈ సినిమాకు రెండవ వారంలో ఊహించిన వసూళ్లు రాలేదని అంటున్నారు.
