Chiranjeevi And Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్నాడు. చిరంజీవి ‘ప్రజా రాజ్యం ‘ అనే రాజకీయ పార్టీ పెట్టి ఒక పదేళ్ల పాటు సినిమా ఇండస్ట్రీకి దూరమైన విషయం మనకు తెలిసిందే. కానీ ఎట్టకేలకు మరోసారి సినిమా ఇండస్ట్రీకి వచ్చి తన సత్తా ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నం చేశాడు. తను అనుకున్నట్టుగానే సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. చిరంజీవి తమ్ముడు ఆయన పవన్ కళ్యాణ్ సైతం కెరియర్ స్టార్టింగ్ లోనే పవర్ స్టార్ అనే ఇమేజ్ ను తెచ్చుకున్నాడు.
అప్పటినుంచి తనకంటూ ఒక ఓన్ స్టైల్ ని ఏర్పాటు చేసుకుని ఆ స్టైల్ లోనే ముందుకు దూసుకెళ్తూ ఉండడం విశేషం.. వీళ్ళిద్దరిని కలిపి ఒక సినిమా చేయాలని చాలామంది స్టార్ డైరెక్టర్లు ఆసక్తి చూపించారు. కానీ ఏదో ఒక అడ్డంకి ఎదురై అది మాత్రం వీలుపడలేదు. ఇక ఇంద్ర లాంటి సూపర్ డూపర్ సక్సెస్ ఫుల్ కథని రాసిన చిన్ని కృష్ణ సైతం చిరంజీవి పవన్ కళ్యాణ్ ని కలుపుతు ఒక మంచి కథనైతే రెడీ చేశాడట.
కానీ అది అనుకోని కారణాలవల్ల సెట్స్ మీదికైతే రాలేదు… ఇక దానికిగల కారణమేంటంటే ఆ కథ ఫైనల అయిన సమయంలోనే దానికి ముత్యాల సుబ్బయ్య ను దర్శకుడిగా నిర్ణయించారు. కానీ అతను ఆ సినిమాను అంత ఎఫెక్టివ్ గా తీయలేడని భావించిన ప్రొడ్యూసర్లు అతన్ని పక్కన పెట్టి మరో దర్శకుడిని తీసుకోవాలనే ప్రయత్నం చేశారు.
ఇక అది అలా రెండు మూడు దర్శకుల చేతులు మారడం వల్ల ఆ సినిమా చేయాలనే ఇంట్రెస్ట్ అందరికి పోయింది. దాంతో చిరంజీవి, పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. నిజానికి ఇద్దరు బ్రదర్స్ ని సినిమా మొత్తం ఒకే ఫ్రేమ్ లో చూస్తే వచ్చే కిక్కు వేరే లెవల్లో ఉండేది. కానీ చివరి నిమిషంలో అది మిస్ అయిందంటూ మెగా అభిమానులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…
