Peddi 5 Days Box Office Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం రోజురోజుకి బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త అద్భుతాలను సృష్టిస్తూ, కరువులో ఉన్న టాలీవుడ్ థియేటర్స్ కి సరికొత్త జోష్ ని తీసుకొచ్చింది. వర్కింగ్ డేస్ లో హౌస్ ఫుల్స్ నమోదు అవ్వడం అనేది చాలా అరుదు. అది కూడా భారీ రేంజ్ లో ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోస్ వేసి , లాంగ్ వీకెండ్ చూసిన తర్వాత , మొదటి సోమవారం హోల్డ్ సాధించడం అనేది అసాధారణమైన టాస్క్. కానీ ‘పెద్ది’ ఈ టాస్క్ ని అవలీలగా ఛేదించి , కేవలం 5 రోజుల్లోనే రామ్ చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిల్చింది. మొదటి సోమవారం రోజున ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 7 కోట్ల 61 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
అంతే కాకుండా బుక్ మై షో , డిస్ట్రిక్ట్ యాప్స్ కలిపి ఈ చిత్రానికి 55 లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయినట్టు సమాచారం. హిందీ వెర్షన్ నుండి భారీ రేంజ్ లో వసూళ్లు రాకపోయినప్పటికీ కూడా , ఈ రేంజ్ లో టిక్కెట్స్ అమ్ముడుపోవడం అనేది సాధారణమైన విషయం కాదు. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి ప్రాంతాల వారీగా ఎంత గ్రాస్ వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం.
నైజాం ప్రాంతం నుండి ఈ చిత్రానికి 5 వ రోజున 2 కోట్ల 54 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా 5 రోజుల్లో నైజాం ప్రాంతం నుండి ఈ చిత్రానికి 43.66 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా సీడెడ్ ప్రాంతం నుండి 5 రోజుల్లో 16 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. 5 వ రోజున 1 కోటి రూపాయలకు పైగా షేర్ వచ్చినట్టు సమాచారం. సీడెడ్ ప్రాంతం కంటే ఉత్తరాంధ్ర నుండి ఈ చిత్రానికి ఎక్కువ షేర్ రావడం గమనార్హం. ఈ ప్రాంతం లో ఈ చిత్రానికి 5 రోజుల్లో 16 కోట్ల 31 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. 5 వ రోజు అయితే ఏకంగా 1 కోటి 56 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
అదే విధంగా తూర్పు గోదావరి జిల్లా నుండి 10 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లా నుండి 6 కోట్ల 93 లక్షలు , గుంటూరు జిల్లా నుండి 10 కోట్ల 55 లక్షలు , కృష్ణ జిల్లా నుండి 8 కోట్లు , నెల్లూరు జిల్లా నుండి 4 కోట్ల 48 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 115 కోట్ల 93 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 171 కోట్ల 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక ప్రాంతం నుండి 11 కోట్ల 80 లక్షలు , తమిళనాడు + కేరళ నుండి 1 కోటి 80 లక్షలు, హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 8 కోట్లు , ఓవర్సీస్ నుండి 20 కోట్ల 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా 157 కోట్ల 78 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 260 కోట్ల 45 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
