Israel Iran Mutual Attacks: మధ్యప్రాచ్యంలో మరోసారి మంట పుట్టింది. యుద్ధం ఉధృతమవుతోంది. ఏప్రిల్ 8న జరిగిన సున్నితమైన సీజ్ఫైర్ తర్వాత కొంతకాలం ఉద్రిక్తత తగ్గినట్లు కనిపించినా, ఇప్పుడు పరిస్థితి వేగంగా మారుతోంది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడికి ప్రతీకారంగా ఆదివారం అర్థరాత్రి ఇరాన్ ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడి చేసింది. దీనికి ఇజ్రాయెల్ సోమవారం ఉదయం భారీ ప్రతిదాడితో స్పందించింది. ఈ ఘటనలు ఏప్రిల్ సీజ్‌ఫైర్‌ను పూర్తిగా ప్రమాదంలో పడేస్తున్నాయి.
ఇరాన్ దాడికి ప్రతీకారం..
ఇరాన్ ఉత్తర ఇజ్రాయెల్‌పై దాదాపు 10 క్షిపణులను ప్రయోగించింది. అదే సమయంలో ఇరాక్‌లోని కొన్ని ప్రాంతాలపై కూడా దాడులు జరిపినట్లు టెహ్రాన్ ప్రకటించింది. ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) ఈ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు తెలిపాయి. గణనీయమైన నష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం. అయితే ఇజ్రాయెల్ ఇక్కడ ఆగలేదు. సోమవారం ఉదయం ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ఇరాన్‌లోని పశ్చిమ, మధ్య భాగాల్లోని సైనిక స్థావరాలు, రక్షణ సంబంధిత లక్ష్యాలపై భారీ ఎయిర్ స్ట్రైక్స్ చేపట్టింది. టెహ్రాన్, ఇస్పహాన్, తబ్రిజ్ నగరాల పరిసరాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఇరాన్ ఈ దాడుల్లో ఇజ్రాయెల్ ఎయిర్ లాంచ్డ్ బాలిస్టిక్ క్షిపణులను ఉపయోగించినట్లు ఆరోపించింది.
ట్రంప్ హెచ్చరికను ధిక్కరించిన ఇజ్రాయెల్
ఈ పరిణామాలపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఫోన్ చేసి స్పష్టమైన సందేశం ఇచ్చారు. ‘మనం శాంతి ఒప్పందానికి చాలా దగ్గరలో ఉన్నాం. ఇప్పటికే రెండు వైపులా దాడులు జరిగాయి. ఇక చర్చల వైపు మొగ్గు చూపండి’ అని వారించారు. ‘ఎవరికీ గణనీయమైన నష్టం జరగలేదు కాబట్టి ఎదురుదాడి అవసరం లేదు’ అని ట్రంప్ స్పష్టం చేశారు. ‘నేను షాట్స్ కాల్ చేస్తాను, బీబీ కాదు’ అని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
ట్రంప్‌ను పట్టించుకోని ఇజ్రాయెల్..
ట్రంప్ సలహాను ఇజ్రాయెల్ పట్టించుకోలేదు. తన జాతీయ భద్రతను తన చేతుల్లోనే ఉంచుకోవాలనే నిర్ణయంతో ఇజ్రాయెల్ ప్రతిదాడి చేపట్టింది. ఈ ఘటనలు ఏప్రిల్ సీజ్ఫైర్ తర్వాత మధ్యప్రాచ్యంలో వచ్చిన అత్యంత తీవ్రమైన ఎస్కలేషన్. ట్రంప్ పాలనలో ఇరాన్‌తో ఒక పెద్ద ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ చేసిన ఈ చర్య, అమెరికా–ఇజ్రాయెల్ మధ్య సంబంధాల్లో కూడా ఉద్రిక్తతను సష్టించింది.
ఇజ్రాయెల్ మాత్రం తన భద్రతకు ఎలాంటి బెదిరింపు వచ్చినా తగిన స్పందన ఇస్తుంది. ఇరాన్, దాని మద్దతు గ్రూపులు హెజ్బొల్లా, హౌతీలు ఇజ్రాయెల్‌ను చుట్టుముట్టి ఉండటం వల్ల ఇజ్రాయెల్ ఎప్పుడూ ‘ఎదురు దెబ్బ’ విధానాన్ని అనుసరిస్తుంది. అయితే ఈ విధానం ప్రస్తుతం ట్రంప్ యొక్క డీల్–మేకింగ్ దక్పథంతో తీవ్రంగా ఢీకొంటోంది. ఈ ఘర్షణలు 47 ఏళ్ల చక్రంను మళ్లీ గుర్తు చేస్తున్నాయి. ఇరు వైపులా దాడులు జరిగిన తర్వాత చర్చలకు రావాలని ట్రంప్ చెబుతున్నా, ఇజ్రాయెల్ భద్రతా ఆందోళనలు ఆయన సలహాలను కొట్టేస్తున్నాయి.
ఇరాన్ గగనతలం మూసివేసింది. ఖతార్, సిరియా కూడా తమ ఎయిర్‌స్పేస్‌ను మూసేశాయి. ఇంధన ధరలు పెరగడం, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా ఆయిల్ రవాణా సమస్యలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి ఇవన్నీ రాబోయే రోజుల్లో వాస్తవం కావచ్చు. ప్రస్తుతం రెండు వైపులా ఉన్న ధైర్యం, అసహనం మధ్యప్రాచ్య శాంతిని మళ్లీ దూరం చేస్తున్నాయి. ఇరు వైపులా సంయమనం చూపిస్తే మాత్రమే ఈ మంటలను అరికట్టవచ్చు.
