NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియా లెవల్లో తన సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళు తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు వినడానికి కూడా ఇష్టపడేవారు కాదు. ఎందుకంటే వాళ్ల సినిమాల కంటే తెలుగు సినిమాల్లో పెద్దగా వైవిధ్యం ఉండదని వాళ్లు సినిమాలు చేసిన కూడా అవి ఎందుకు పనికిరావనే ఒక ఉద్దేశ్యంతో ఉండేవారు. కానీ ఎప్పుడైతే రాజమౌళి బాహుబలి సినిమా చేశాడో అప్పటినుంచి తెలుగు సినిమాల స్థాయి పెరిగింది. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వెను తిరిగి చూడకుండా వరుస విజయాలను సాధిస్తూ మన స్టార్ హీరోలందరు ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సైతం సక్సెస్ ను సాధించడానికి సిద్ధమవుతున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న డ్రాగన్ సినిమాతో ఎలాగైనా సరే భారీ విజయాన్ని సాధించాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ఇక ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ కి ఒక స్టార్ డైరెక్టర్ వరుసగా మూడు కథలనైతే వినిపించాడు. వాటిని మిస్ చేసుకున్న ఎన్టీఆర్ సక్సెస్ ఫుల్ సినిమాలను చేయదలేకపోయాడని చాలామంది చెబుతూ ఉంటారు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అతనికి చెప్పిన కథలేంటి అంటే…
దర్శకుడు సురేందర్ రెడ్డి తాను చేసిన ‘అతనొక్కడే’ సినిమా కథని మొదట ఎంటైర్ కి వినిపించారట. కానీ దర్శకుడికి ఎక్స్పీరియన్స్ లేకపోవడంతో ఆ సినిమాని ఎన్టీఆర్ మిస్ చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత సురేందర్ రెడ్డి తో అశోక్, ఊసరవెల్లి అనే రెండు సినిమాలు చేసి డిజాస్టర్ లను మూటగట్టుకున్నాడు…
సురేందర్ రెడ్డి ఆ తర్వాత చేసిన కిక్ సినిమా కథను కూడా మొదట ఎన్టీఆర్ కే వినిపించాడు. కానీ దానికి ముందు సురేందర్ రెడ్డి కి అతిధి అనే ప్లాప్ సినిమా వచ్చింది. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ కిక్ సినిమాని కూడా వదిలేశాడు. ఇక ఆ తర్వాత రేసుగుర్రం సినిమా కథను కూడా జూనియర్ ఎన్టీఆర్ కి వినిపించారట.
తను ఆ సినిమా కథను కూడా రిజెక్ట్ చేయడంతో సురేందర్ రెడ్డి చెప్పిన మూడు కథలను ఎన్టీఆర్ రిజెక్ట్ చేసి సక్సెస్ ఫుల్ సినిమాలను మిస్ చేసుకున్నాడు. సురేందర్ రెడ్డి కథల విషయంలో తన జడ్జిమెంట్ చాలా వరకు రాంగ్ అని ఎన్టీఆర్ కూడా రియలైజ్ అయ్యాడు…