Kodi Ramakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మూస ధోరణి కథలను అలాగే రొటీన్ మేకింగ్ తో ముందుకు సాగుతున్న సినిమాలకు స్వస్తి పలికిన దర్శకుడు కోడి రామకృష్ణ… ఆయన గ్రాఫిక్స్ తో మనం వండర్స్ క్రియేట్ చేయవచ్చు అని ప్రూవ్ చేశాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి గ్రాఫిక్స్ ను పరిచయం చేసిన ఘనత కూడా రాజన్ దక్కింది. అమ్మోరు సినిమాలో అతను వాడిన గ్రాఫిక్స్ తెలుగు ప్రేక్షకులందరిని మెస్మరైజ్ చేసింది. అలాంటి సినిమాని అంతకు ముందు మేము ఎప్పుడు చూడలేదు అంటూ ఆ సినిమాని చూడడానికి జనాలు నీరాజనం పట్టారు…
అలాంటి కోడి రామకృష్ణ అప్పట్లోనే విజువల్ వండర్స్ ని తెరకెక్కించాడు. ఇక ఆ తర్వాత దేవి, దేవి పుత్రుడు, అంజి లాంటి సినిమాలతో తన గ్రాఫిక్స్ ఏ లెవెల్ లో ఉంటుందో చూపించాడు. అలాగే తన విజువలైజేషన్ ఎక్కడి వరకు ఉంది అనేది సగటు ప్రేక్షకులందరికీ పరిచయం చేశాడు. ఇక ఆ తర్వాత అనుష్కతో చేసిన అరుంధతి సినిమా నెక్స్ట్ లెవెల్లో నిలిచిందనే చెప్పాలి…
ఒక హీరోయిన్ ను పెట్టుకొని ఇండస్ట్రీ హిట్ సాధించడం అంటే మామూలు విషయం కాదు. అది కోడి రామకృష్ణ కే సాధ్యమైంది. అలాంటి దర్శకుడు తో పోలిస్తే ఇప్పుడున్న దర్శకులు ఏం చేస్తున్నారు అంటూ పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. ఎలాంటి టెక్నాలజీ లేని సమయంలోనే ఆయన అంతటి విజువల్లైజెషన్స్ చేసి దాన్ని స్క్రీన్ మీద పర్ఫెక్ట్ గా ప్రెసెంట్ చేశాడు అంటే తనకున్న క్లారిటీ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు…
కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళందరు హై టెక్నాలజీ ఉన్నప్పటికి వాళ్లు చూపించే గ్రాఫిక్స్ అంత పర్ఫెక్ట్ గా ఉండడం లేదంటూ పలువురు విమర్శకులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కోడి రామకృష్ణ ముందు వీళ్లంతా చిన్నవాళ్లే అంటూ మరికొంతమంది భావిస్తూ ఉండడం విశేషం…ఇప్పటి వరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కోడి రామకృష్ణ చేసిన వండర్స్ ముందు అవేమీ పనికి రావు అంటూ సోషల్ మీడియాలో అతని గురించి చాలా గొప్పగా చెబుతున్నారు…