Home అంతర్జాతీయం Pakistan: అట్టుడుకుతున్న పాకిస్తాన్.. ఏ క్షణమైనా కోలాప్స్

Pakistan: అట్టుడుకుతున్న పాకిస్తాన్.. ఏ క్షణమైనా కోలాప్స్

10
Pakistan
Pakistan

Pakistan: పాకిస్తాన్ ప్రస్తుతం పూర్తిగా అస్తవ్యస్త స్థితిలో ఉంది. చుట్టూ ఉన్న దేశాలతో సఖ్యత లేకుండా, తీవ్ర అంతర్గత ఉగ్రవాద దాడులతో విషమ పరిస్థితిని ఎదుర్కొంటోంది. అమెరికా, యురోపియన్ యూనియన్, తుర్కీ, అజర్‌బైజాన్ వంటి దేశాలతో సంబంధాలు ఉన్నప్పటికీ, పాకిస్తాన్ తన పొరుగు దేశాలతో సత్సంబంధాలు ఏర్పరచుకోలేకపోతున్నది. తజకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్, ఇరాన్ వంటి పొరుగు దేశాలతో పాకిస్తాన్‌కు సత్సంబంధాలు లేవు. ముఖ్యంగా ఇరాన్ పాక్ భూభాగం అమెరికా దాడులకు ఉపయోగించబడి ఉన్నట్టు భావిస్తూ సహకారం నివారిస్తున్నది. అయితే భారత్‌తో పాకిస్తాన్ మధ్య వైరం ఇంకా కొనసాగుతుంది, ప్రత్యేకంగా ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇరు దేశాల మద్య తీవ్ర మనోభావాలు ఏర్పడినవి. ఉగ్రవాదాన్ని అధ్యయనం చేసే సంస్థలు వెలువరించిన డేటాను ఐఎస్‌పీఆర్‌ నివేదిక విడుదల చేసింది. ఇది ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌, ఐఎస్‌ఐల పనితీరును అధ్యయనం చేస్తుంది. ఐఎస్‌పీఆర్‌ జారీ చేసే గణాంకాలు అధికారికమైనవి.

4,729 ఉగ్రవాద దాడులు..
2025 జనవరి నుండి నవంబర్ మధ్యకాలంలో ఖైబర్ ఫఖ్తూమ్ ఖ్వా, సింద్, బలూచిస్తాన్ ప్రాంతాల్లో 4,729 ఉగ్రదాడులు జరిగాయి. దాడుల భూవైశాల్యం పెరిగింది. ఆపరేషన్‌ల్‌ టెంపో పెరిగింది. వాళ్లు ఉపయోగించే ఆయుధాల పదును పెరిగింది. నిర్ధిష‍్ట లక్ష్యంతో దాడులు జరుగుతున్నాయి. ఇవన్నీ ఉగ్రదాడులే. రైళ్లు, ఆస్తులు, వ్యక్తులు, సైన్యం లక్ష్యంగా ఈ దాడులు చేశాయి. వీటిని అడ్డుకునేందుకు పాకిస్తాన్‌ 67 వేల ఆపరేషన్లు నిర్వహించింది. అయినా ఉగ్రవాదం తగ్గలేదు. ఖైబర్‌ ఫక్తూంఖ్వాలో 3,357 దాడులు జరిగాయి. బలూచిస్తాన్‌లో 1,346 దాడులు జరిగాయి. సింధ్‌, పంజాప్‌ తదతర ప్రాంతాల్లోనూ దాడులు జరిగాయి.

రోజుకు 233 ఆపరేన్లు..
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్తాన్‌ రోజుకు 233 మిలటరీ ఆపరేషన్లు నిర్వహిస్తోంది. ఇది ఇరాక్‌లో 2006-08 మధ్య అమెరికా చేసుకున్న రోజువారీ ఆపరేషన్ల కంటే ఎక్కువ. సోమాలియాలో రోజుకి 70 ఆపరేషన్లు జరిగితే, పాకిస్తాన్ ఉగ్రవాద దాడులను నియంత్రించడంలో విఫలమవుతోంది. ఖైంబర్‌ ఫఖ్తూంలోనే ఉగ్రవాదులను అణచివేసేందుకు 53 వేల ఆపరేషన్లు నిర్వహించింది. ఇక బలూచ్‌లో ఆపరేషన్లు చేసినా 95 శాతం బలూచిస్తాన్‌ పాకిస్తాన్‌ కంట్రోల్‌లో లేదు. సింద్‌, పంజాబ్‌, గిల్కిర్‌ బల్కిస్తాన్‌, ఆజాద్‌ కశ్మీర్‌లోనూ దాడులు జరిగాయి.

బలూచిస్తాన్ ప్రాంతం పాకిస్తాన్ అధికారంలో 5% మాత్రమే ఉండడంతో మిగతా ప్రాంతాలు వేరుగా పోరాటం కొనసాగిస్తున్నాయి. సిన్నీ, పంజాబ్, ఆజాద్ కశ్మీర్ లోనూ దాడులు జరుగుతూ దేశం రెండింటికంటే ఎక్కువ ఆపరేషన్లు నిర్వహించాలని ప్రేరేపిస్తుంది. పాకిస్తాన్ భద్రతా పరమైన ఈ పరిస్థితి నిరంతరం ఆంతరంగిక తిరుగుబాట్లు, ప్రభుత్వ వ్యవస్థ భ్రమణానికి దారితీస్తుంది. ఇలా పాకిస్తాన్ తన అంతర్గత సమస్యలతో నలిగిపోతోంది. అంతర్జాతీయ విషయంలోనూ, సరిహద్దు భద్రత విషయంలోనూ తీవ్రమైన అంతరాయం ఏర్పడినా పరిషా‍్కరం కనిపించడం లేదు.