Prashanth Varma: సినిమా ఇండస్ట్రీ బిజినెస్ కి పెట్టింది పేరుగా మారింది. చాలామంది ప్రొడ్యూసర్లు భారీ మొత్తంలో పెట్టుబడులను పెట్టి అంతకుమించిన లాభాలను అర్జించాలనే ప్రయత్నం చేస్తున్నారు. కొంత మంది ప్యాషన్ తో సినిమాలను ప్రొడ్యూస్ చేస్తుంటే మరి కొంతమంది మాత్రం డబ్బులను అర్జించడానికి సినిమాలను చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలో చాలామంది జెన్యూన్ ప్రొడ్యూసర్లకు లాసెస్ వచ్చి ఇండస్ట్రీ నుంచి ఫెడౌట్ అవుతున్నారు. మరి కొంత మంది మాత్రం ఎక్కువ సంఖ్యలో లాభాలను సంపాదించుకుంటూ చాలా సంవత్సరాల పాటు టాప్ ప్రొడ్యూసర్లుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఉన్న దర్శకులు సైతం మంచి సినిమాలను చేయడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు. ప్రశాంత్ వర్మ లాంటి దర్శకుడు ‘హనుమాన్’ సినిమాతో టాప్ డైరెక్టర్ గా మారాడు.ఈ సినిమా 40 కోట్లతో తీస్తే 295 కోట్లను వసూలు చేసింది… ఇక ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన నిరంజన్ రెడ్డి కి భారీ లాభాలు వచ్చాయి. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ప్రశాంత్ వర్మ నిరంజన్ రెడ్డితో జై హనుమాన్,అధీరా, మహకాళి, బ్రహ్మ రాక్షసి లాంటి సినిమాలను కూడా తన బ్యానర్ లోనే చేస్తానని చెప్పాడు అంటూ ఆయన కొన్ని మాటలైతే మాట్లాడాడు…
ఇంకా ఆయన ప్రశాంత్ వర్మ గురించి చెబుతూ జై హనుమాన్,అధిరా, మహాకాళి, బ్రాహ్మ రాక్షస సినిమాలు నాతో చేస్తానని చెప్పి నా దగ్గరి నుంచి 10.38 కోట్ల వరకు అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. ఇక ఆ సినిమాలను చేయకుండా అడ్వాన్స్ డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఇన్ని రోజులపాటు నన్ను హింసిస్తున్నాడు. కాబట్టి నష్టపరిహారం కింద 200 కోట్ల రూపాయలను ఇప్పించాలని నిరంజన్ రెడ్డి కోరుతున్నాడు.
అలాగే ఆక్టోపస్ అనే సినిమాని 10.28 కోట్లు పెట్టి రైట్స్ కొనిపించాడని ఆ సినిమా రైట్స్ కూడా నా దగ్గర లేకుండా వేరే ప్రొడ్యూసర్ దగ్గర ఉంచాడని చెప్పాడు. అలాగే అధీర సినిమాని డైరెక్టు చేయడానికి కోటి రూపాయలు అడ్వాన్స్ కూడా తీసుకున్నాడని ఇవన్నీ కలిపి మరో 100 కోట్ల రూపాయల నాకు ఇప్పించాలని నా విషయం తేలెంత వరకు అతను సినిమాలను చేసుకోకుండా షూటింగ్స్ నిలిపివేయాలని చాంబర్లో కంప్లైంట్ చేశాడు…
ఇక ఈ విషయం మీద వర్మ సైతం స్పందిస్తూ నేను అసలు ఆ ఐదు సినిమాలు అతని బ్యానర్లో చేస్తానని ఎప్పుడూ చెప్పలేదు. అగ్రిమెంట్లు కూడా రాసుకోలేదు. ఆయన నుంచి 15.82 కోట్లు మాత్రమే తీసుకున్నానని అది కూడా హనుమాన్ సినిమా సక్సెస్ అయినందుకు పర్సంటేజ్ రూపంలో నాకు రావాల్సిన అమౌంట్ నేను తీసుకున్నాను. ఇక ఆక్టోపస్ సినిమా రైట్స్ గురించి ఒరిజినల్ ప్రొడ్యూసర్స్ తో మాట్లాడాలని దానికి నాకు సంబంధం లేదని తెలియజేశాడు…
ఇక అదీరా సినిమా కోసం నాకు కోటి రూపాయలు ఇవ్వలేదని అది కేవలం టీజర్ చేయడానికి మాత్రమే కోటి రూపాయలు ఇచ్చారు. నాకు రావాల్సిన డబ్బులు డార్లింగ్, సంబరాలు ఏటి గట్టు సినిమాల మీద ఇన్వెస్ట్ చేశారని వివరణ ఇచ్చాడు. మరి వీరిద్దరిలో ఎవరి వాదన కరెక్టు ఎవరిది తప్పు అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…