Gold: ప్రస్తుతం బంగారం డబ్బు కంటే విలువైన వస్తువుగా భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతున్న ఆర్థిక పరిస్థితుల కారణంగా బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. ఒకప్పుడు కేవలం ఆభరణాల కోసం మాత్రమే బంగారం కొనుగోలు చేసేవారు.. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కోసం ఎగబడి కొంటున్నారు. ఈ పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఉండడంతో బంగారం లోహానికి విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో ఒక దేశం లో ఉన్న బంగారం నిలువలు కూడా ఆదేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. కొన్ని దేశాలు బంగారం నిల్వలను చూసి ఆ దేశానికి రుణాలు కూడా ఇచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఎంత బంగారం నిలువలు ఉన్నాయి? మనదేశంలో ఎంత బంగారం నిల్వ ఉంది?
బిజినెస్ టుడే నివేదిక ప్రకారం.. ఏ దేశంలో ఎంత బంగారం ఉందో తెలుస్తోంది. ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎక్కువగా అమెరికా బంగారం నిలువలను కలిగి ఉంది. ఈ దేశంలో 8100 టన్నుల బంగారం ఉన్నట్లు తెలుస్తోంది. 3400 టన్నులతో జర్మనీ రెండో స్థానం.. 2500 టన్నులతో ఇటలీ మూడో స్థానం.. 2400 టన్నులతో ప్రాన్స్ నాలుగో స్థానం.. 2300 టన్నులతో చైనా 5వ స్థానంలో ఉంది. వెయ్యి టన్నులతో స్విట్జర్లాండ్ ఆరవ స్థానంలో నిలుస్తోంది.
భారతదేశం 880 టన్నులతో ఏడో స్థానంలో నిలిచింది. జపాన్ 846 టన్నులు, టర్కీ 635 టన్నులు.. 8 9 స్థానాలను కలిగి ఉన్నాయి. అయితే భారత్ కు పక్కనే ఉన్న పాకిస్తాన్లో బంగారం నిల్వలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తి ఉంటుంది. ఈ దేశంలో కేవలం 64.7 టన్నులు మాత్రమే ఉంది. భారతదేశంలో అత్యధికంగా ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల వద్ద బంగారం నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో ముత్తూట్ ఫైనాన్స్ వద్ద 209 టన్నుల బంగారం ఉన్నట్లు సమాచారం. భారతదేశంలో ఒక ప్రైవేట్ సంస్థ మిగతా దేశాల కంటే ఎక్కువగా ఉండడం విశేషం.
బంగారం నిల్వలు ఎక్కువగా ఉండడంతో భారతదేశ ఆర్థిక పరిస్థితి కూడా బలంగా ఉన్నట్లు చెప్పుకోవచ్చు. బంగారం నిల్వలు ఒక దేశ భౌతిక ఆస్తిని మాత్రమే కాకుండా.. ఆర్థిక పరిస్థితిని తెలుపుతుంది. బంగారం నిల్వల విషయంలో భారతదేశం ఏడవ స్థానంలో ఉంటే.. పాకిస్తాన్ 49వ స్థానంలో ఉంది. బంగారం రేటు ప్రస్తుతం పెరగడంతో.. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ మరింత పెరిగినట్లు చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో వచ్చే ఆర్థిక సమస్యలకు.. ఆర్థిక మాంద్యానికి బంగారం నిల్వలు ఎంతో దోహదపడతాయి. అంతర్జాతీయంగా పరిస్థితిలో అస్థిరంగా ఉన్నప్పుడు విదేశీ కరెన్సీ కి ప్రత్యామ్నాయంగా బంగారం ఉపయోగపడుతుంది. అందుకే దీనిని కేంద్ర బ్యాంకులు రిజర్వుగా ఉంచి చూపిస్తాయి. వీటి ద్వారా మౌలిక సదుపాయాలను కూడా అందించడానికి మార్గం ఉంటుంది.