Assam Black Magic Village: ప్రస్తుతం మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో ఉన్నాం. టెక్నాలజీతో ఒక ఆట ఆడుకుంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు.. దయ్యం అని ఎవరైనా మన ముందు మాట్లాడితే వింతగా చూస్తుంటాం. ఎందుకంటే మన జీవితం మొత్తం టెక్నాలజీ చుట్టూ తిరుగుతోంది. పది రోజుల ముందు ఏం జరుగుతుందో ఇప్పుడే తెలుసుకునే స్థాయి మనకు వచ్చేసింది. అలాంటప్పుడు మూఢనమ్మకాలను.. దేవుడు.. దయ్యాలను నమ్మే పరిస్థితిలో మనం లేము.
ఈ స్టోరీ చదివిన తర్వాత మీరు కచ్చితంగా దయ్యాలను నమ్మాలి. ఎందుకంటే అక్కడ జరిగేది అలా ఉంటుంది కాబట్టి. పైగా అక్కడ ప్రతి ఇల్లు కూడా ఒక రకంగా ఉంటుంది. అందులో మనుషులు విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఆ గ్రామం మనదేశంలోని అస్సాం రాష్ట్రంలో ఉంది. ఆ గ్రామానికి ఈ పేరు రావడానికి కారణం ఏంటి.. క్షుద్ర పూజలు వస్తేనే ఆ గ్రామంలో ఉండడానికి ఎందుకు అర్హత ఉంటుంది.. అనే విషయాలపై ఈ కథనం..
అస్సాం రాష్ట్రంలో ఒక చిన్న పల్లెటూరు పేరు మయాంగ్. ఇది అద్భుతమైన పర్యాటక ప్రాంతం కూడా. కాకపోతే ఇక్కడ క్షుద్ర పూజలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దీనిని మనదేశంలో బ్లాక్ మ్యాజిక్ క్యాపిటల్ సిటీ అని పిలుస్తుంటారు.. మౌచంగ్ అనే వంశానికి చెందినవారు ఇక్కడ ఎక్కువమంది నివసించడం వల్ల ఈ గ్రామానికి మయాంగ్ అనే పేరు వచ్చింది. ఇక్కడ మయాంగ్ పూబిచోరా పేరుతో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి.
ఈ గ్రామంలో ప్రతి ఇంటి ముందు జంతువుల కళేబరాలు కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువ కళేబరాలు కనిపిస్తే అతడు అంత గొప్ప మంత్రగాడు అన్నట్టు.. ఇది గుహవాటి ప్రాంతం నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.. ఇక్కడ ఒక మ్యూజియం కూడా ఉంది.. క్షుద్ర పూజలకు ఉపయోగించే వస్తువులను అక్కడ భద్రపరుస్తూ ఉంటారు.. ఈ గ్రామంలో సుమారు వందమంది దాకా క్షుద్ర పూజలు చేసేవారు ఉన్నారు.. అయితే ఇప్పుడు చదువుకునే వారి సంఖ్య పెరిగిపోవడంతో క్షుద్ర పూజలు చేసేవారి సంఖ్య తగ్గిపోయింది.
తమ వృత్తిని భవిష్యత్తు తరాలకు కూడా అందించడానికి వెనుకటి తరం వారు క్షుద్ర పూజలు నేర్పిస్తున్నారు. క్షుద్ర పూజలు అభ్యసించే వారిని బెజ్ లేదా ఓజా అని పిలుస్తుంటారు. వెన్నెముక నొప్పితో బాధపడే వారికి ఇక్కడ ప్రత్యేకంగా చికిత్స చేస్తారు. అందువల్ల చాలామంది వెన్నెముక సమస్యతో బాధపడేవారు ఇక్కడికి వస్తూ ఉంటారు. అఘోరాలు కూడా అప్పుడప్పుడు ఈ గ్రామానికి వస్తూ ఉంటారు. కొంతమంది క్షుద్ర పూజలు నేర్చుకోవడానికి ఏళ్ల తరబడి స్మశానంలో ఉంటుంటారు. అయితే ఈ గ్రామాన్ని కేవలం మన దేశీయులే కాకుండా.. విదేశీయులు కూడా సందర్శిస్తూ ఉంటారు. ఇక్కడ క్షుద్ర పూజలు నేర్చుకుంటూ ఉంటారు.
