Images source: google
ఎలాంటి వ్యాయామ పరికరాలు అవసరం లేకుండా శరీరానికి మంచి ఫిట్‌నెస్ ను అందించేది వాకింగ్. దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
Images source: google
రోజూ 30 నిమిషాలు నడవడం వల్ల శారీరకంగా, మానసికంగా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
Images source: google
అమెరికన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌లో ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం, రోజుకు కనీసం 30 నిమిషాలు నడవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని 19% తగ్గించవచ్చట.
Images source: google
ప్రతి రోజు 30 ని.లు నడవడం వల్ల ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడంలో సహాయపడుతుంది. అంతేకాు బరువు తగ్గడానికి కూడా దోహదపడుతుంది.
Images source: google
నడక మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. JAMA సైకియాట్రీలో ఒక అధ్యయనం ప్రకారం నిరాశ, ఆందోళన వంటి లక్షణాలను తగ్గిస్తుంది.
Images source: google
రెగ్యులర్ వాకింగ్ కండరాలు, ఎముకలను బలంగా చేస్తుంది. కాళ్ళు, పండ్లు, దిగువ వీపుకు ప్రయోజనకరంగా ఉంటుంది వాకింగ్.
Images source: google
భోజనం తర్వాత 30 నిమిషాల నడిస్తే జీర్ణక్రియకు సహాయపడుతుంది. జీర్ణాశయంలోని కండరాలను ఉత్తేజపరుస్తుంది నడక.
Images source: google