Images source: google
బీచ్‌లు, సుందరమైన ప్రదేశాలు ఉండే ప్రదేశాల్లో ఇండోనేషియాలోని బాలి ఒకటి. ఇక్కడి ప్రకృతి అందాలను చూడటానికి భారీ సంఖ్యలో పర్యాటకులు వెళ్తుంటారు.
Images source: google
బాలిలో తానా లాట్ టెంపుల్ చాలా ప్రసిద్ధి చెందింది. అతిపెద్ద రాయి మీద సముద్ర తీరంలో నిర్మించిన ఈ ఆలయాన్ని ఎక్కువ మంది సందర్శిస్తారు. సముద్రం లోపల ఉండే ఈ ఆలయంలో సూర్యాస్తమయం చూడటానికి చాలా బాగుంటుంది.
Images source: google
బాలిలో ఉబడ్ ప్రాంతంలో ఉండే వరిపంటలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. కొండ ప్రాంతంలో కొబ్బరి తోటలు, పంటలను చూడటానికి సందర్శకులు వెళ్తుంటారు.
Images source: google
ఉబుద్ మంకీ ఫారెస్ట్‌లోఎక్కడ చూసిన కోతులో కనిపిస్తాయి. ఈ ఆలయంలో విభిన్న రకాలైన శిల్పాలతో కోతులను నిర్మించారు. ఎక్కువగా కోతుల శిల్పాలు ఉండటంతో దీన్ని ఉబుద్ మంకీ ఫారెస్ట్ అని అంటారు.
Images source: google
దాదాపు 60 జాతుల జంతువులు నివసించే యానిమల్ థీమ్ పార్క్‌ను బాలిలో చూడాల్సిందే. ఇది బాలిలో అతిపెద్ద యానిమల్ పార్క్.
Images source: google
సముద్ర మట్టానికి వెయ్యి మీటర్ల ఎత్తులో ఉండే బెసాకి ఆలయం బాలిలో చాలా ప్రసిద్ధమైనది. ఈ ఆలయంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర ఆలయాలు ఉంటాయి. ప్రకృతి సుందరమైన ప్రదేశంలో ఉండే ఈ ఆలయాన్ని చూడటానికి సందర్శకులు ఎక్కువగా వెళ్తుంటారు.
Images source: google
బాలి బీచ్‌లకు చాలా ఫేమస్.. ఇక్కడ ఎన్నో బీచ్‌లు ఉన్నాయి. ముఖ్యంగా కుటా బీచ్ ప్రత్యేకమైనది. ఈ బీచ్‌ను సందర్శించడానికి ఎక్కువగా టూరిస్ట్‌లు వెళ్తుంటారు.
Images source: google
బాలిని సందర్శించడానికి అన్నింటికంటే వేసవి కాలం ఉత్తమమైనది. మిగతా సీజన్ కంటే వేసవిలో వెళ్తే ఎక్కువగా ఎంజాయ్ చేయవచ్చు.
Images source: google